రాంరెడ్డి వెంకటరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంరెడ్డి వెంకటరెడ్డి
రాంరెడ్డి వెంకటరెడ్డి


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి
నియోజకవర్గము పాలేరు

వ్యక్తిగత వివరాలు

జననం మే 22, 1944
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల
మరణం మార్చి 4, 2016
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు కమలమ్మ,నారాయణరెడ్డి
నివాసము హైదరాబాదు, భారతదేశం
మతం హిందూ

రాంరెడ్డి వెంకటరెడ్డి ( మే 22, 1944 - మార్చి 4, 2016) ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన స్వస్థలం ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం పాతలింగాల గ్రామం. ఆయన వ్యవసాయ కుటుంబంలో కమలమ్మ, నారాయణరెడ్డి దంపతులకు మే 22 1944 న జన్మించారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ డిగ్రీని పొందారు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి 1977 వరకు పాతలింగాల సర్పించిగా ఉన్నారు. ఎల్ఎంబీ డైరెక్టర్, డిసిసి ఉపాధ్యక్షులుగా పనిచేశారు[2]. 1996లో ఉప ఎన్నిక ద్వారా సుజాత నగర్ ఎమ్మెల్యే అయ్యారు [3]. 1999లో జరిగిన ఎన్నికలలో సుజాతానగర్ శాసనసభ సభ్యునిగా ఎన్నికైనారు.[4] 2004 ఎన్నికలలో కూడా అదే నియోజకవర్గం నుండి మరల శాసనసభ్యునిగా ఎన్నికైనారు.[5] ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. వెంకట్ రెడ్డి 2009 [6], 2014లలో పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నుంచి 2014[7] వరకు మంత్రిగా పనిచేశారు.[8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రాంరెడ్డి వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి స్వయాన ఆయనకు సోదరుడు.

మరణం[మార్చు]

ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అప్పటి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నాలుగేళ్లుగా ఆయన ఊపిరి తిత్తుల వ్యాధికి సికింద్రాబాద్ కిమ్స్‌లో వైద్యం చేయించు కుంటున్నారు. మార్చి 4 2016 ఉదయం రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటుతో మృతి చెందారు.[9]

మూలాలు[మార్చు]

  1. "ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇకలేరు". Archived from the original on 2016-03-07. Retrieved 2016-03-04.
  2. 2.0 2.1 "Ramreddy Venkat Reddy no more". Adepu Mahender​. thehansindia. 4 March 2016. Retrieved 4 March 2016. zero width space character in |publisher= at position 15 (help)CS1 maint: discouraged parameter (link)
  3. Election Commission of India BYE - ELECTION, 1996
  4. Andhra Pradesh Assembly Election Results in 1999
  5. Andhra Pradesh Assembly Election Results in 2004
  6. Andhra Pradesh Assembly Election Results in 2009
  7. List of candidates for Palair Constituency 2014
  8. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కన్నుమూత
  9. రాంరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూత

ఇతర లింకులు[మార్చు]