Jump to content

సంకినేని వెంకటేశ్వర రావు

వికీపీడియా నుండి
సంకినేని వెంకటేశ్వర రావు
సంకినేని వెంకటేశ్వర రావు


శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
ముందు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
తరువాత మోత్కుపల్లి నర్సింహులు
నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 జూన్ 1963
తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సంకినేని రామారావు, కమలమ్మ
సంతానం అరుణ్ రావు, వరుణ్ రావు

సంకినేని వెంకటేశ్వర రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుండి 1999 నుండి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సంకినేని వెంకటేశ్వర రావు తెలంగాణ రాష్ట్రం,సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో 10 జూన్ 1963న సంకినేని రామారావు, కమలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తుంగతుర్తిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సంకినేని వెంకటేశ్వర రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2012లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.[2] తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి 2014లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, సూర్యపేట బీజేపీ జిల్లా ఇంచార్జ్ గా ఉన్నాడు.

సంకినేని వెంకటేశ్వర్‌రావు 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎల్.బి నగర్ ల ఇన్‌చార్జిగా,[3] 2021లో జరిగిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో ఎన్నికల ఇన్‌చార్జిగా పని చేశాడు.[4]

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ ప్రత్యర్థి పార్టీ ఫలితం
1999 తుంగతుర్తి సంకినేని వెంకటేశ్వర రావు టీడీపీ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపు
2004 తుంగతుర్తి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంకినేని వెంకటేశ్వర రావు టీడీపీ ఓటమి
2014 సూర్యాపేట జి.జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి సంకినేని వెంకటేశ్వర రావు భారతీయ జనతా పార్టీ ఓటమి
2018 సూర్యాపేట జి.జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి సంకినేని వెంకటేశ్వర రావు భారతీయ జనతా పార్టీ ఓటమి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (23 October 2023). "బీజేపీ అభ్యర్థుల బయోడేటా". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  2. The Times of India (15 October 2012). "Ex-MLA to quit TDP for YSR Congress | Hyderabad News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  3. Deccan Chronicle (19 November 2020). "BJP appoints 24 in-charges for Telangana GHMC polls" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  4. Andhrajyothy (4 April 2021). "బీజేపీని గెలిపించాలి : సంకినేని". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.