పైగా ప్యాలెస్
పైగా ప్యాలెస్ | |
---|---|
![]() | |
సాధారణ సమాచారం | |
చిరునామా | బేగంపేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
ప్రస్తుత వినియోగదారులు | యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ |
పూర్తి చేయబడినది | 1900 |
పైగా ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న ప్యాలెస్. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.[1]
చరిత్ర[మార్చు]
మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన నవాబ్ వికారుల్ ఉమ్రా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్ కు వచ్చేవాడు.[2]
నిజాం పాలన తరువాత ఈ ప్యాలెస్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో హైదరాబాదులోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్ కోసం కేటాయించారు. ప్రస్తుతం శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ఈ ప్యాలెస్ వేదికగా మారింది.
నిర్మాణం[మార్చు]
దాదాపు 119 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి. రెండవ అంతస్తుకు చేరుకోడానికి కలపతో చేసిన మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి.[3]
మూలాలు[మార్చు]
- ↑ నమస్తే తెలంగాణ, జందగీ వార్తలు (24 May 2018). "పైగా ప్యాలెస్". మూలం నుండి 1 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 1 May 2019. Cite news requires
|newspaper=
(help) - ↑ Telangana Today, SundayScape-Telangana Diaries (12 November 2017). "A palace straight out of a storybook". Kota Saumya. మూలం నుండి 1 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 1 May 2019. Cite news requires
|newspaper=
(help) - ↑ పైగా ప్యాలెస్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 74