దానం నాగేందర్
దానం నాగేందర్ | |||
| |||
పదవీ కాలం 1994- 2004 (ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం) 2009 - 2014, 2018 - ప్రస్తుతం (ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం) | |||
నియోజకవర్గం | ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1964, ఆగస్టు 9 హైదరాబాద్, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | లింగమూర్తి - లక్ష్మీబాయి | ||
జీవిత భాగస్వామి | అనిత[1] | ||
సంతానం | ఇద్దరు కుమార్తెలు |
దానం నాగేందర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ఉన్నాడు.[2] 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి... 2009, 2018 ఎన్నికలలో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల శాఖ, ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు.[3]
జననం, విద్య
[మార్చు]నాగేందర్ 1964, ఆగస్టు 9న లింగమూర్తి - లక్ష్మీబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MA) పూర్తిచేశాడు.
రాజకీయ జీవిత చరిత్ర
[మార్చు]కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగేందర్ తరువాతి కాలంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదిగాడు.[4][5] 1994, 1999, 2004 ఎన్నిలకల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2004 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2004లో ఆసిఫ్‌నగర్ నుండి టిడిపి టికెట్‌పై గెలిచిన తరువాత, తన సీటుకు రాజీనామా చేశాడు. ఆ సమయంలో ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు. నియోజకవర్గాల డీలిమిటేషన్ తరువాత, 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు.[6][7] 2009లో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నాడు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగాడు.
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డిపై 20,846 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[8] 2018, జూన్ 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డిపై 28,396 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[9]
ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 2024 మార్చి 17న ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి & టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[10]
2024 లో 18వ లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటి చేశాడు.భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతుల్లో ఓటమి పాలైయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (14 November 2023). "భార్యలే ఐశ్వర్యవంతులు! టాప్‌లో ఓ మహిళా కాంగ్రెస్ అభ్యర్థి!". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "దానం నాగేందర్ - Oneindia Telugu". www.oneindia.com. Retrieved 2021-09-14.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "List of MLAs" Archived 2016-03-03 at the Wayback Machine. APOnline.
- ↑ "Council of Ministers" Archived 8 అక్టోబరు 2013 at the Wayback Machine. APOnline.
- ↑ "Profile of Danam Nagender - Khairtabad". hello ap. 2011-01-05.
- ↑ "Updated official microsite of Danam Nagender - Khairtabad" Archived 2014-04-19 at the Wayback Machine. danamnagender 2014-04-17.
- ↑ "Danam Nagender MLA of Khairatabad Andhra Pradesh contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-09-14.
- ↑ "Danam Nagender(TRS):Constituency- KHAIRATABAD(HYDERABAD) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-14.
- ↑ Hindustantimes Telugu (17 March 2024). "బీఆర్ఎస్ కు బిగ్ షాక్ - కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
- CS1 maint: url-status
- జీవిస్తున్న ప్రజలు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- 1958 జననాలు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1994)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (1999)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2004)
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)
- హైదరాబాదు జిల్లా వ్యక్తులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- తెలంగాణ శాసన సభ్యులు (2023)