Jump to content

క‌ర్రి సంధ్యారెడ్డి

వికీపీడియా నుండి
క‌ర్రి సంధ్యారెడ్డి
క‌ర్రి సంధ్యారెడ్డి
జననం
జాతీయతఆస్ట్రేలియా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్ట్రాత్‌ ఫీల్డ్‌ డిప్యూటీ మేయర్‌
జీవిత భాగస్వామికర్రి బుచ్చిరెడ్డి
పిల్లలునీల్, నిఖిల్ రెడ్డి
తల్లిదండ్రులు
  • పటోళ్ళ శంకర్‌రెడ్డి (తండ్రి)
  • సరళారెడ్డి (తల్లి)

క‌ర్రి సంధ్యారెడ్డి తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ. ఈవిడ 2023 సెప్టెంబరు 5న ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి మహిళగా గుర్తింపు పొందింది.[1]

జననం, విద్య

[మార్చు]

సంధ్యారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాదులో పటోళ్ళ శంకర్‌రెడ్డి, సరళారెడ్డి దంపతులకు జన్మించింది. అబిడ్స్‌లోని స్టాన్లీ స్కూల్‌, సెయింట్‌ఆన్స్‌లో చదివింది. కేంద్రియ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా అందుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ పూర్తిచేసింది.[2] ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్ లా డిగ్రీ పొంది, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేసింది.

వివాహం, కుటుంబం

[మార్చు]

ఆస్ట్రేలియాలో స్థిరపడిన కర్రి బుచ్చిరెడ్డితో 1991లో సంధ్యారెడ్డి వివాహం జరిగింది. వారికి ఇద్దరు (నీల్, నిఖిల్ రెడ్డి) కుమారులు ఉన్నారు. నిఖిల్ రెడ్డి 2023 ఆస్ట్రేలియా జాతీయ చదరంగ ఛాంపియన్ గా నిలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

2022లో జరిగిన ఆస్ట్రేలియాలోని స్ట్రాత్‌ఫీల్డ్‌ స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సంధ్యారెడ్డి, ఆస్ట్రేలియాలో పెద్ద పార్టీలైన లేబర్‌, లిబర్‌ పార్టీల అభ్యర్థులను వెనక్కినెట్టి కౌన్సిలర్‌గా గెలిచింది. 2023 సెప్టెంబరు 5న జరిగిన సాధారణ కౌన్సిల్‌ సమావేశంలో కౌన్సిలర్‌ కరెన్‌ పెన్సబెన్‌ మేయర్‌గా, కౌన్సిలర్‌ సంధ్యారెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. స్ట్రాత్‌ ఫీల్డ్‌ కౌన్సిల్‌ చరిత్రలోనే ఇద్దరు మహిళలు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను అధిరోహించడం ఇదే తొలిసారి.[3]

సామాజిక సేవ

[మార్చు]

సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నది. స్ట్రాత్‌ఫీల్డ్‌ లోని హోమ్ బుష్ కమ్యూనిటీ సెంటర్ లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషిచేసింది. సామాజికు సేవకు 2020లో ‘స్ట్రాత్‌ ఫీల్డ్‌ సిటిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ అందుకుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా తెలంగాణ మహిళ". EENADU. 2023-09-08. Archived from the original on 2023-09-08. Retrieved 2023-09-08.
  2. Velugu, V6 (2023-09-08). "ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళకు కీలక పదవి". V6 Velugu. Archived from the original on 2023-09-08. Retrieved 2023-09-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. telugu, NT News (2023-09-08). "Sandhya reddy | ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా సంధ్యారెడ్డి.. తొలి భారత సంతతి మహిళగా రికార్డు". www.ntnews.com. Archived from the original on 2023-09-08. Retrieved 2023-09-08.