Jump to content

ఖైరతాబాదు మస్జిద్

వికీపీడియా నుండి
1626 నాటి ఖైరతాబాదు మస్జిద్

'హైరతాబాదు మస్జిద్ హైదరాబాదులో గల ఖైరతాబాదులో ఉంది. ఇది ఈ మస్జిద్ చుట్టూ ప్రసిద్ధ ప్రాంతమైన ఖైరతాబాదు నిర్మించబడింది. ఈ ప్రదేశం హైదరాబాదులో గల అతి పెద్ద వ్యాపార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా ప్రసిద్ధి చెందినది.[1]

చరిత్ర

[మార్చు]

ఖైరతాబాదు మస్జిద్ సా.శ. 1626 లో ఖైరునీసా బేగం చే నిర్మింపబడింది. ఇది మా సాబెబా (సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా (1612–1626 AD) కుమార్తె) గా కూడా పిలువబడుతుంది. ఆమె తన గురువు అయిన అఖుండ్ ముల్లా అబ్దుల్ మాలిక్ కోసం నిర్మించింది.

ఈ మస్జిద్ కు ఆనుకొని ఖాళీగా ఉన్న గోపుర భవనం కనిపిస్తుంది. ఈ భవనంలో ఏ విధమైన సమాధి లేకుండా ఖాళీగా ఉండటానికి కారణం అఖుండ్ స్వీయ ఖననం కోసం ఈ మందిరాన్ని నిర్మించాడు; కానీ అతను మక్కా యాత్రకు వెళ్ళి అక్కడే మరణించినందున ఈ భవనము ఖాళీగా ఉంది.

ఆయన మక్కాకు హజ్ యాత్రలో ఉన్నపుడు మరణించాడు.అందువలన ఈ గోపుర భవనం ఖాళీగా ఉంది.[1]

ఖైరునీసా బేగం తన మేనల్లుడైన హుస్సేన్ షా వాలిని అచట రాణిగారికోసం ఒక పాలస్, ఒక మస్జిద్, ఒక నీటి సరస్సులను కట్టమని అడిగింది. ఆ సరస్సు తదనంతరం ప్రసిద్ధ హుసేన్ సాగర్గా మారింది. ఇది ఖైరతాబాదుకు ఉత్తర దిక్కున ఉంది.

నిర్మాణము

[మార్చు]
ఖైరతాబాదు మసీదు, సమాధి

ఖైరతాబాదు మస్జిద్ రూపకల్పన, నిర్మాణం హుస్సేన్ షా వాలి చే జరిగింది. ఈ మస్జిద్ మూడు ఆర్చిలను ముఖద్వారంగా కలిగి యున్నది. మసీదు యొక్క సన్నని మినార్లు చాలా అలంకరణ కలిగి యుంటాయి, జాలీలతో కూడుకుని విలువైన పనితనం గోచరిస్తుంది. ఈ మస్జిద్ యొక్క నిర్మాణంలో కచ్చితమైన సామరస్యం అమూలాగ్రం గోచరిస్తుంది. ప్రధాన ప్రార్థనా గది ఎత్తుగా ఉన్న ప్లాట్ ఫాం పై ఉంటుంది..[2]

INTACH AP, ఇండియా దీనిని వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.[3]

నిర్లక్ష్యం

[మార్చు]

హిందూ పత్రికలో ప్రచురితమైన ఆర్టికల్ క్రైయింగ్ ఫర్ అటెన్షన్ ప్రకరం స్థానిక మస్జిత్ లను మొక్కల పెరుగుదల ఆక్రమిస్తున్నాయని తెలిపింది. ఖైరతాబాదు లోని కుతుబ్ షాహీ మస్జిద్, ఖైరాతీ బేగం యొక్క సమాధులు సంరక్షింపబడిన ప్రసిద్ధ నిర్మాణాలు. ఇవి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.[4][5]


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2014-10-08.
  2. [1]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-10-06. Retrieved 2014-10-08.
  4. ""Crying for Attention," [[The Hindu]], 30 October 2006". Archived from the original on 18 ఫిబ్రవరి 2013. Retrieved 8 అక్టోబరు 2014.
  5. "How protected is our heritage?". timesofindia.indiatimes.com. September 12, 2011. Archived from the original on 2012-11-06. Retrieved September 12, 2011.