ఊరేగింపు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఊరేగింపు అంటే వీధులలో తిరుగుతూ చేసే ఉత్సవము. దీని అసలు రూపము ఊరెరిగింపు అంటే ఊరికి తెలియపరుస్తూ ప్రదర్శించుట. ఇది కొన్నిసార్లు పల్లకీలో జరిపితే కొన్నిసార్లు రథం మీద జరుగుతుంది. రథం మీద జరిగే ఊరేగింపును రథోత్సవం అంటారు. దేశంలో ప్రతి యేటా పూరీలో జరిగే జగన్నాథ రథోత్సవం ప్రసిద్ధి గాంచింది.
పండుగలు, తిరునాళ్లు
[మార్చు]ముఖ్యమైన పండుగల, తిరునాళ్ల సమయాలలో దేవాలయాలలోని ఉత్సవ విగ్రహలను ఆ ఊరిలో ఊరేగింపు చేస్తారు.
వినాయకచవితి
[మార్చు]భారతదేశంలో వినాయకచవితి పండుగ సందర్భంగా వినాయక నిమజ్జనం నాడు చేసే వినాయకుడి ఊరేగింపులు అత్యంత వైభవంగా జరిగుతాయి.
పీర్ల పండుగ
[మార్చు]మొహరం పండుగనే తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసాన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు.