Jump to content

నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా)
సంస్థ వివరాలు
స్థాపన జూలై 10, 2017
Preceding agency నిజామాబాదు నగరపాలక సంస్థ
అధికార పరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం నిజామాబాదు
18°40′19″N 78°05′38″E / 18.672°N 78.094°E / 18.672; 78.094
సంబంధిత మంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, (ముఖ్యమంత్రి)
కల్వకుంట్ల తారక రామారావు, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి)
కార్యనిర్వాహకులు ప్రభాకర్ రెడ్డి[1], చైర్మన్

నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా) తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ. వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.

చరిత్ర

[మార్చు]

2017, జూలై 10న తెలంగాణ ప్రభుత్వంచే నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేయబడింది. దీని ప్రధాన కార్యాలయం నిజామాబాదు పట్టణంలో ఉంది.[2]

విధులు - బాధ్యతలు

[మార్చు]

రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని మౌలిక సదుపాయాల ప్రణాళికను, అభివృద్ధిని వివరించడానికి ఆయా అభివృద్ధి పనులకోసం పట్టణ అభివృద్ధి సంస్థలకు అధికారాలు ఇవ్వబడ్డాయి.

అధికార పరిధి

[మార్చు]

169.37 చదరపు కిలోమీటర్ల (65.39 చదరపు మైళ్ళు)[3][4] పరిధిలోని నిజామాబాదు ఉత్తర, దక్షిణ, గ్రామీణ మండలాల్లో విస్తరించి ఉన్న 6,33,933[5][6] నివాసితుల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికను ఈ సంస్థ నిర్వహిస్తుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 61 గ్రామాలను కలిపి ఈ సంస్థను ఏర్పాటుచేశారు.[7][8]

చైర్మన్

[మార్చు]

2018, సెప్టెంబరు 15న నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాడు.[9]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రభూమి, తెలంగాణ (8 November 2019). "భావి అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్లు". www.andhrabhoomi.net. Archived from the original on 8 November 2019. Retrieved 17 January 2020.
  2. "Karimnagar, Nizamabad, Khammam to get urban devp authorities". India Today. 5 July 2017. Retrieved 15 January 2020.
  3. Telangana Today, Telangana (24 October 2017). "GO released to set up Nizamabad Urban Development Authority". Archived from the original on 26 November 2018. Retrieved 15 January 2020.
  4. Deccan Chronicle, Telangana (24 January 2018). "Merger of 13 Nizamabad villages on the cards". Narender Pulloor. Archived from the original on 26 November 2018. Retrieved 15 జనవరి 2020.
  5. Telangana Today, Telangana (30 September 2018). "Nizamabad (Urban) Assembly constituency profile". Archived from the original on 24 March 2019. Retrieved 15 January 2020.
  6. Telangana Today, Telangana (30 September 2018). "Nizamabad Rural Assembly constituency profile". Archived from the original on 24 March 2019. Retrieved 15 January 2020.
  7. నమస్తే తెలంగాణ, వార్తలు (25 October 2017). "పట్టణ శివార్ల కు పండుగ". www.ntnews.com. Archived from the original on 17 January 2020. Retrieved 17 January 2020.
  8. Sakshi (27 February 2022). "73 గ్రామాలు.. 568 కిలో మీటర్లతో 'నుడా' మాస్టర్‌ ప్లాన్‌." Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
  9. నమస్తే తెలంగాణ, వార్తలు (15 September 2018). "నూడా చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ". Archived from the original on 13 ఏప్రిల్ 2019. Retrieved 15 January 2020.