నీలగిరి నగరాభివృద్ధి సంస్థ
Jump to navigation
Jump to search
నీలగిరి నగరాభివృద్ధి సంస్థ (నుడా) తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ. వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.[1][2]
అధికార పరిధి
[మార్చు]నీలగిరి అర్బన్ డెవెలప్‌మెంటు అథారిటీని నల్లగొండ మున్సిపాలిటీతో పాటు 42 శివారు గ్రామాలను కలిపి నుడాను ఏర్పాటు చేస్తూ 2022 ఫిబ్రవరి 14న ప్రభుత్వం జీవో నెంబర్ 26 జారీ చేసింది.[3]
నుడా పరిధిలోని గ్రామాలు
[మార్చు]- నల్గొండ మండలం - అమ్మగూడ, అనంతారం, అన్నారెడ్డిగూడెం, అన్నెపర్తి, బుద్ధారం, చందనపల్లి, చెన్నారం, దండంపల్లి, దొనకాల్, జి.కె.అన్నారం, గుండ్ల పల్లె, కె. కొండారం, కాంచనప్పల్లె, కాజీరామారం, ఖుదావన్‌పూర్, కొత్త పల్లె, మేళ్లదుప్పలపల్లి, మూషం పల్లె, రసూల్‌పుర, సూరారం, తోరగల్, వెలుగు పల్లె.
- తిప్పర్తి మండలం - తిప్పర్తి, అనిశెట్టిదుప్పలపల్లి, గడ్డికొండారం, గంగన్నపాలెం, జంగారెడ్డిగూడెం, కంకణాలపల్లి, పజ్జూరు, రాజుపేట, తానెదారుపల్లి.
నీలగిరి అర్బన్ డెవెలప్‌మెంటు అథారిటీ సభ్యులు
[మార్చు]నుడాకు జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, పురపాలక కమిషనర్ ఉపాధ్యక్షులుగా, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డిలు సభ్యులుగా నియమితులయ్యారు.[5]
ఇవికూడా చూడండి
[మార్చు]- హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
- కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ
- నిజామాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
- ఖమ్మం పట్టణ అభివృద్ధి సంస్థ
- హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
- మహబూబ్‌నగర్ నగరాభివృద్ధి సంస్థ
మూలాలు
[మార్చు]- ↑ telugu (15 February 2022). "నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు అభివృద్ధి అథారిటీలు". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
- ↑ Eenadu (6 January 2022). "నుడా ఏర్పాటుకు కసరత్తు షురూ". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
- ↑ Andhra Jyothy (4 February 2022). "నిధుల సమీకరణకు నుడా కసరత్తు". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
- ↑ ETV Bharat News (15 February 2022). "కొత్తగా రెండు నగరాభివృద్ధి సంస్థలు". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.