కంచర్ల భూపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంచర్ల భూపాల్ రెడ్డి
కంచర్ల భూపాల్ రెడ్డి


పదవీ కాలం
2018 - ప్రస్తుతం
ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నియోజకవర్గం నల్గొండ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973, మే 5
ఉరుమడ్ల, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మల్లారెడ్డి - కౌసల్య
జీవిత భాగస్వామి రమాదేవి
సంతానం శ్రీలక్ష్మి

కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున నల్గొండ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కంచర్ల భూపాల్‌ రెడ్డి 1973, మే 5న మల్లారెడ్డి - కౌసల్య దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామంలో జన్మించాడు.[2] ఆయన 1990లో 10వ తరగతి వరకు ఉరుమడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి చేసి, చిట్యాల రవి జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ (1990-1993), హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బీకాం పూర్తి చేశాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

భూపాల్‌ రెడ్డికి రమాదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ).

రాజకీయ విశేషాలు[మార్చు]

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపాల్ రెడ్డి, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై 10,547 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై 23,698 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] ప్రస్తుతం నల్గొండ ఎమ్మెల్యే గా విధులు నిర్వహిస్తున్నాడు.[6]

మూలాలు[మార్చు]

  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  3. Sakshi (28 April 2019). "నా కూతుర్ని దేవుడు నడిపిస్తాడు: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
  4. "Kancharla Bhupal Reddy(Independent(IND)):Constituency- NALGONDA(NALGONDA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-20.
  5. "Kancharla Bhupal Reddy(TRS):Constituency- NALGONDA(NALGONDA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-20.
  6. The Hans India (22 March 2020). "Janata curfew Live Updates: MLA kancharla Bhupal... ... Janata Curfew Live Updates: 14-hour nationwide shut down begins across India". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.