గుండు సుధారాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండు సుధారాణి
గుండు సుధారాణి

శ్రీమతి గుండు సుధారాణి


వరంగల్ మేయర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-07-28) 1964 జూలై 28 (వయసు 59)
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం (2015 వరకు)

భారత్ రాష్ట్ర సమితి (2015-ప్రస్తుతం)

జీవిత భాగస్వామి గుండు ప్రభాకర్
వృత్తి రాజకీయాలు
మతం హిందూ

గుండు సుధారాణి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు. 2015లో ఆవిడ తెలుగుదేశం పార్టీని వదలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది . సుధారాణి బీసీ సామజిక వర్గానికి చెందిన మహిళా. సుధారాణి కుటుంబానికి వరంగల్ జిల్లాలో నగల వ్యాపారం, పెట్రోల్ పంపులు, భూ వ్యాపారాలు ఉన్నాయి.[1]ఆమె ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నది. 2021, మే 7న వరంగల్లు మహానగర పాలక సంస్థ మేయ‌ర్‌గా గుండు సుధారాణి ఎన్నికయింది.[2][3]ఆమె 01 జూన్ 2021న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయ‌ర్‌గా బాధ్యతల చేపట్టింది.[4]

నేపధ్యము[మార్చు]

1964, జూలై 28 న జన్మించింది.[5] 2014 పార్లమెంటు సమావేశాలలో ఈవిడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజ్యసభలో గళమెత్తినది.[6]

విద్యాభ్యాసము[మార్చు]

మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ లో ఎం. ఎ చేసింది[5].

రాజకీయాలు[మార్చు]

  • 2005 నుండి 2010 వరకు వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించింది. 2010 లో తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైనది.
  • 2002 నుండి 2004 వరకు తిరుమల తిరుపతి దేవస్థానములు పాలకమండలి సభ్యురాలుగా ఎన్నుకోబడినది [5]
  • 2017 - తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌[7]
  • ఆమె 2021లో గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) 29వ డివిజన్ టీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ అందజేశారు.[8]

సమాజ సేవ[మార్చు]

కేంద్ర ప్రభుత్వము ప్రవేశపట్టిన సంసద్ ఆదర్శ్ గ్రామ్‌ యోజన పధకం క్రింద వరంగల్ గ్రామీణ జిల్లా, ఆత్మకూరు మండలం లోని నీరుకుళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకున్నది.[9]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-02. Retrieved 2015-10-31.
  2. Namasthe Telangana (7 May 2021). "గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మేయ‌ర్‌గా గుండు సుధారాణి". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  3. ఈనాడు, వార్తలు (7 May 2021). "ఖమ్మం, వరంగల్‌ మేయర్లు ఖరారు". www.eenadu.net. Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
  4. Namasthe Telangana (1 June 2021). "ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి". Namasthe Telangana. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  5. 5.0 5.1 5.2 "Biographical Sketch Member of Parliament Rajya Sabha". Archived from the original on 27 మార్చి 2019. Retrieved 9 March 2014.
  6. "Pepper spray leaves Lok Sabha and nation in tears - News". Mid-day.com. Retrieved 2014-03-24.
  7. Sakshi (29 May 2017). "8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. Sakshi (19 April 2021). "గ్రేటర్‌ ఫైట్‌: ఎవరు బరిలో నిలిచారో తెలుసా?". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  9. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-10-31.

బయటి లంకెలు[మార్చు]