Jump to content

పీర్జాదిగూడ నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
పీర్జాదిగూడ
నగరపాలక సంస్థ
రకం
రకం
పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ
చరిత్ర
స్థాపితం2016 ఏప్రియల్ 11
నాయకత్వం
మేయర్
జక్కా వెంకటరెడ్డి
2020, జనవరి నుండి
డిప్యూటీ మేయర్
కుర్రా శివకుమార్
నిర్మాణం
సీట్లు26
రాజకీయ వర్గాలు
టి.ఆర్.యస్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయం
వెబ్‌సైటు
అధికారిక వెబ్ సైట్

పీర్జాదిగూడ నగరపాలక సంస్థ, మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన నగరపాలక సంస్ధ.ఇది పీర్జాదిగూడ పట్టణం పరిపాలనా నిర్వహణ బాధ్యత నిర్వహించే పౌర సంస్థ. దీని ముఖ్య పట్టణం పీర్జాదిగూడ. ఇది నగరపాలక సంస్థగా ఏర్పడకముందు ఇది పురపాలక సంఘంగా 2016 ఏప్రిల్ 11 న పీర్జాదిగూడతో కలుపుకొని మూడు గ్రామ పంచాయితీల విలీనంతో పురపాలక సంఘంగా ఏర్పడింది.[1] పురపాలకసంఘంగా ఏర్పడినప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం పీర్జాదిగూడ జనాభా మొత్తం 51,689. విలీనం మేడిపల్లి, పర్వతాపూర్ గ్రామ పంచాయితీల జనాభాతో కలుపుకొని పట్టణ జనాభా మొత్తం 75,000. పట్టణ స్థానిక సంస్థ వైశాల్యం 10.5 చ.కి. కలిగిఉంది. పురపాలక సంఘంలో మొత్తం ఇళ్లు 23,300. భౌగోళికంగా పీర్జాదిగూడ మునిసిపాలిటీ 17.3974308, అక్షాంశం 17.3974308 రేఖాంశంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]
  • 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం 12108 ఇళ్లతో, 51689 జనాభాతో 10.05 చ.కి.లో విస్తరించి ఉంది.పురుషులు సంఖ్య 26335 స్త్రీల సంఖ్య 25349 [2]
  • 2001 భారత జనగణన గణాంకాల ప్రకారం 19643 జనాభాతో 10.05 చ.కి.లో విస్తరించి ఉంది. పురుషులు సంఖ్య 10085 స్త్రీల సంఖ్య 9558

వార్డులు సంఖ్య

[మార్చు]

2020 సాధారణ ఎన్నికలకు నగరపాలక సంఘం లోగడ ఉన్న 21 వార్డులను 26 వార్డులుగా విభజించారు.[3]

మేయర్ , డిప్యూటీ మేయర్

[మార్చు]

2020 లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు (యు ఆర్ జి) పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన జక్కా వెంకటరెడ్డి ఎన్నికయ్యాడు.అలాగే డిప్యూటీ మేయరు (యు.ఆర్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కుర్రా శివకుమార్ గౌడ్ ఎన్నికయ్యాడు.[4]

నగర కార్పోరేటర్లు

[మార్చు]

2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో నగరపాలక సంస్థ పరిధిలోని 26 వార్డులుకుఈ దిగువవారు కార్పోరేటర్లుగా ఎన్నికైయ్యారు.[5]

  1. జక్కా వెంకటరెడ్డి [6]
  2. కేతావత్ సుభాష్
  3. బత్తినేని శారద
  4. యశరాం మహేశ్వరి
  5. బడిగే స్వాతిగౌడ్
  6. కొల్తూరి మహేష్
  7. మాడుగుల చంద్రకళ
  8. లేతాకుల మాధవి
  9. బాచ రాజు
  10. వీరమల్ల సుమలత
  11. మద్ది యోగేంద్రరెడ్డి
  12. అమర్ సింగ్
  13. తూముకుంట్ల ప్రసన్నలక్ష్మి
  14. పాశం శశిరేఖ
  15. బండారి మంజుల
  16. బండి రమ్య
  17. కుర్రా శివకుమార్ గౌడ్ (డిప్యూటీ మేయరు)
  18. కుర్రా శాలిని
  19. అలువాల సరిత
  20. కౌడే పోచయ్య
  21. పిట్టల మల్లేష్
  22. భీంరెడ్డి నవీన్ రెడ్డి
  23. నారపల్లి మధుసూదన రెడ్డి
  24. వై.అనంతరెడ్డి
  25. దొంతిరి హరి శంకర్ రెడ్డి
  26. పప్పుల రాజేశ్వరి

మూలాలు

[మార్చు]
  1. "Peerzadiguda Municipal Corporation". peerzadigudamunicipality.telangana.gov.in. Archived from the original on 2020-01-29. Retrieved 2020-01-29.
  2. https://peerzadigudamunicipality.telangana.gov.in/pages/basic-information[permanent dead link]
  3. https://peerzadigudamunicipality.telangana.gov.in/assets/206/2019/12/mediafiles/peergizuda.pdf[permanent dead link]
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-12-05. Retrieved 2020-04-23.
  5. https://peerzadigudamunicipality.telangana.gov.in/pages/council[permanent dead link]
  6. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ (2020). "Corporators, Peerzadiguda Municipal Corporation". Archived from the original on 10 సెప్టెంబరు 2021. Retrieved 10 September 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]