బోడుప్పల్ నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోడుప్పల్
నగరపాలక సంస్థ
రకం
రకం
పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ
నాయకత్వం
మేయర్
సామల బుచ్చిరెడ్డి
2020 నుండి
డిప్యూటీ మేయర్
కొత్త లక్ష్నీ
నిర్మాణం
రాజకీయ వర్గాలు
టి.ఆర్.యస్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
సమావేశ స్థలం
బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ కార్యాలయం
వెబ్‌సైటు
వెబ్ సైట్

బోడుప్పల్ నగరపాలక సంస్థ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లాలో కొత్తగా ఏర్పడిన నగరపాలక సంస్థ.ఇంతకుముందు బోడుప్పల్ మున్సిపాలిటి 2016 సంవత్సరంలో పూర్వపు రంగారెడ్డి జిల్లాలోని బోడుప్పల్, చంగిచెర్ల గ్రామ పంచాయతీల విలీనంతో ఏర్పడింది.[1] తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 211, తేది 2019 జూలై 23 లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది.[2] నగర ప్రాంతం 20.53 చ.కి. విస్తీర్ణంలో విస్తరించిఉంది. చర్లపల్లి వద్ద ప్రతిపాదిత రైల్ టెర్మినల్, పోచారం ఐటి పార్క్ వంటి పరిసరాలలో జరుగుతున్న పరిణామాలతో బోడుప్పల్ నగరం అధిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ తిరుపతిగా పిలవబడుతున్న[3] యాదగిరిగుట్ట ఆధ్యాత్మిక ప్రదేశం ఇక్కడకి 51 కి.మీ. దూరంలో ఉంది.దీని ముఖ్య పట్టణం బోడుప్పల్.

ఉనికి[మార్చు]

బోడుప్పల్ నగరం హైదరాబాద్ ఎంజిబిఎస్ టెర్మినల్ నుండి 14 కి.మీ. దూరంలో, జిహెచ్ఎంసి పరిధిలోని ఉప్పల్ సర్కిల్కు ఆనుకొని 17.6297 7, 78.4814 రేఖాంశం కూడలిలో ఉంది. ఇది ఈశాన్య దిశలో రాష్ట్ర రాజధాని తెలంగాణకు 14 కి.మీ. దూరంలో, ఘట్కేసర్ మండల ప్రధాన కార్యాలయం నుండి కీసర వద్ద ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 25 కి.మీ. దూరంలో ఉంది.

2020 ఎన్నికల వార్డులు సంఖ్య[మార్చు]

బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిని 2020 లో జరిగిన ఎన్నికలకు తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ వారిచే ఇరవై ఎనిమిది ( 28 ) వార్డులుగా విభజించబడింది.

మేయర్ , డిప్యూటీ మేయర్[మార్చు]

2020లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (యుఆర్ జి) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సామల బుచ్చిరెడ్డి ఎన్నికయ్యాడు.అలాగే డిప్యూటీ మేయరు పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొత్తలక్ష్మి ఎన్నికైంది.[4]

బడ్జెట్[మార్చు]

2022-23: బోడుప్పల్‌ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల బడ్జెట్ కోసం జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో 12కోట్ల అభివృద్ధి పనులు ఆమోదించబడ్డాయి. 10 పడకల దవాఖాన నిర్మాణానికి రూ.50 లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామగ్రి కొనుగోలుకు రూ.3 లక్షలు, రా చెరువు అభివృద్ధి, నాలా నిర్మాణం పొడిగింపునకు మరో రూ.4 కోట్లు, 2022 హరితహారానికి రూ. 5.93కోట్లు, పరిశుభ్రత, శానిటేషన్‌లో సామగ్రి కొనుగోలుకు రూ. 73.5 లక్షలు కేటాయించారు. పది బస్‌స్టాప్‌ల నిర్మాణం, బోడుప్పల్‌ నగరానికి 7 ముఖద్వారాల నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. మేయర్‌ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీరవిగౌడ్‌, స్థానిక కార్పోరేటర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు, కమీషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.[5]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-22. Retrieved 2020-01-24.
  2. "Boduppal Municipal Corporation". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2020-01-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-04. Retrieved 2020-01-24.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-12-05. Retrieved 2020-04-16.
  5. telugu, NT News (2022-03-18). "12కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం". Namasthe Telangana. Archived from the original on 2022-03-18. Retrieved 2022-03-18.

వెలుపలి లంకెలు[మార్చు]