Jump to content

దేశాయిపేట

అక్షాంశ రేఖాంశాలు: 18°00′03″N 79°36′41″E / 18.000710938907574°N 79.61137998301791°E / 18.000710938907574; 79.61137998301791
వికీపీడియా నుండి
దేశాయిపేట
—  రెవెన్యూ గ్రామం  —
దేశాయిపేట is located in తెలంగాణ
దేశాయిపేట
దేశాయిపేట
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°00′03″N 79°36′41″E / 18.000710938907574°N 79.61137998301791°E / 18.000710938907574; 79.61137998301791
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండలం వరంగల్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

దేశాయిపేట, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, వరంగల్ మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లా లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ గ్రామీణ జిల్లా స్థానంలో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు

[మార్చు]

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా తూర్పు జర్నలిస్టుల కోసం దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం 12.60 కోట్లతో ప్రభుత్వం 200 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళను నిర్మించింది. 2021, ఏప్రిల్ 12న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణానికి ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[4]

2023, జూన్ 17న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 200 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళను ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, స్థానిక ప్రజాప్ర‌తినిధులు, జిల్లా క‌లెక్ట‌ర్, అధికారులు పాల్గొన్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "దేశాయిపేటలో జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన". telugu.oneindia.com. 2021-04-12. Archived from the original on 2021-04-12. Retrieved 2023-06-19.
  5. telugu, NT News (2023-06-17). "Minister KTR | కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో యంగ్‌వన్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన". www.ntnews.com. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.

వెలుపలి లింకులు

[మార్చు]