జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం
స్థాపితం | 2008 |
---|---|
ఛాన్సలర్ | సీ.పీ. రాధాకృష్ణన్ (తెలంగాణ గవర్నర్) |
వైస్ ఛాన్సలర్ | జయేష్ రంజన్, ఐఏఎస్ (ఇంచార్జ్ వీసీ) |
చిరునామ | మాసబ్ ట్యాంక్, హైదరాబాదు, తెలంగాణ, 500028, భారతదేశం 17°24′10″N 78°27′17″E / 17.4029113°N 78.454711°E |
కాంపస్ | పట్టణ |
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో ఉన్న ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం. ఇందులో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే రెండు కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్.డి పరిశోధన కోర్సులను అందిస్తున్నాయి.
చరిత్ర
[మార్చు]1940లో హైదరాబాద్ రాష్ట్రంలోని కళలు, స్థానిక హస్తకళలను ప్రోత్సహించడానికి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కళాశాలగా స్థాపించబడింది. 1972 అక్టోబరులో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ స్థాపించడంతో ఈ కళాశాల విశ్వవిద్యాలయంతో విలీనం చేయబడింది. ఆ విశ్వవిద్యాలయ రాజ్యాంగ కళాశాలగా మారింది.[1] 2014 తరువాత తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో "గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్"గా అభివృద్ధి చెందింది.
కోర్సులు
[మార్చు]స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ఆర్కిటెక్చర్, డిజైన్ & ప్లానింగ్ కోసం డిజిటల్ టెక్నిక్స్, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ప్లానింగ్ మొదలైన కోర్సులను అందిస్తోంది. కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రకళ, అప్లైడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, యానిమేషన్, శిల్పకళ మొదలైన కోర్సులు అందించబడుతున్నాయి.
అనుబంధ సంస్థలు
[మార్చు]కింది విద్యా సంస్థలు జేఎన్‌ఏఎఫ్‌ఏయూకి అనుబంధంగా ఉన్నాయి:[2]
- అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా, హైదరాబాద్
- ఐకాట్ డిజైన్ & మీడియా కళాశాల, హైదరాబాద్
- క్రియేటివ్ మల్టీమీడియా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, హైదరాబాద్[3]
- సిఎస్ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సికింద్రాబాద్
- ఎస్ఏఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆగిరిపల్లి
- శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్
- మాస్ట్రో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్
- వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, హైదరాబాద్
- మాస్టర్జీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, విజయవాడ ఏపీ
- డెక్కన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్, హైదరాబాద్
- వరాహ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ & ప్లానింగ్, విశాఖపట్నం
- స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ & ప్లానింగ్, జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, సికింద్రాబాద్.
- జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్, హైదరాబాద్
- లుంబినీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ & టౌన్ ప్లానింగ్, అనంతరామ్ ఏపి
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "About us". Jawaharlal Nehru Architecture and Fine Arts University. Archived from the original on 2017-12-08. Retrieved 2022-09-05.
- ↑ "Affiliated Colleges". Jawaharlal Nehru Architecture and Fine Arts University. Archived from the original on 2017-11-23. Retrieved 2022-09-05.
- ↑ https://www.jnafau.ac.in/affiliated-colleges-vad/