పాలమూరు విశ్వవిద్యాలయము

వికీపీడియా నుండి
(పాలమూరు విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పాలమూరు విశ్వవిద్యాలయము
రకంప్రభుత్వ
స్థాపితం2008
ఛాన్సలర్ఈ.ఎస్.ఎల్.నరసింహన్
వైస్ ఛాన్సలర్డా. జి.భాగ్యనారాయణ
స్థానంమహబూబ్ నగర్, Telangana, భారతదేశం
కాంపస్పట్టణ
అనుబంధాలుUGC
జాలగూడు[http://www.palamuruuniversity.ac.in

పాలమూరు విశ్వవిద్యాలయం (Palamuru University), మహబూబ్ నగర్ పట్టణంలో 2008లో ఏర్పాటుచేయబడింది. అంతకు ముందు ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో భాగంగా పిజి సెంటరుగా ఉండేది. 2008-09 విద్యా సంవత్సరం నుంచి ఈ విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో ఎం.ఎ. (రాజనీతి శాస్త్రం), ఎం.బి.ఏ., ఎం.సీ.ఏ., ఎం.కాం., ఎమ్మెస్సీ కోర్సులు ప్రారంభించారు. 2009లో బీఫార్మసీ, 2010లో ఎంసీడబ్ల్యూ తదితర కోర్సులు కూడా ప్రారంభించడంతో ప్రస్తుతం మొత్తం 14 కోర్సులు కలిపి 1800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.[1] మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని డిగ్రీకళాశాలలు ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చాయి.

ప్రత్యేకతలు[మార్చు]

  • 2010 నవంబరు 12న పాలమూరు విశ్వవిద్యాలయం ఎన్.ఎస్.ఎస్. (జాతీయ సేవా పథకం)విభాగం ఆధ్వర్యంలో 2,500 మందితో 'లార్జెస్ట్ బేర్‌ఫుట్‌ వాక్'అనే కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. దేశంలోనే గిన్నిస్ పుస్తకంలో స్థానం పొందిన తొలి విశ్వవిద్యాలయంగా పాలమూరు విశ్వవిద్యాలయం రికార్డు సృష్టించింది.[2].జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఈ రికార్డుకు వ్యూహ రచన చేసి విశ్వ విద్యాలయ ఉపకులపతి, రెజిస్ట్రార్,ఎన్.ఎస్.ఎస్.జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి అధికారులు,ప్రోగ్రాం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, వలంటీర్లు, విద్యార్థుల సహకారంతో ఈ రికార్డు సృష్టించడం వల్ల రాష్ట్రానికి చెందిన ప్రశంస బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాలమూరు విశ్వవిద్యాలయానికి 'మహా మహా' అనే బిరుదునిచ్చి గౌరవించారు.
  • పాలమూరు విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి 5633 అక్షరాలతో హ్యాండీక్రిస్టల్స్... ప్రారంభ పదాలుగా అతిపొడవైన గ్రంథ శీర్షిక పెట్టినందుకు గిన్నిస్ రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కూడా గుర్తించారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 27-08-2013
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2013-11-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-06. Cite web requires |website= (help)