అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా
స్థానం

సమాచారం
రకంప్రైవేట్ యూనివర్సిటీ - ఫిల్మ్ స్కూల్
స్థాపన2011 జూన్ 30
స్థాపకులుఅక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు
Campusఅన్నపూర్ణ స్టూడియోస్
పరీక్షల బోర్డులుజవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉన్న ఫిల్మ్ స్కూల్. ఇది దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్, లాభాపేక్ష లేని మీడియా స్కూల్. ఈ సంస్థను నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావులతో సహా వారి కుటుంబ సభ్యులు స్థాపించారు. కాగా అక్కినేని అమల డైరెక్టర్‌ గా వ్యవహరిస్తోంది.[1]

ఇందులో నటన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

క్యాంపస్

[మార్చు]

ఈ కళాశాల అన్నపూర్ణ స్టూడియోస్ మైదానంలో ఉంది. 22 ఎకరాల విస్తీర్ణంలో, అన్నపూర్ణ స్టూడియోస్ సాంకేతికంగా అభివృద్ధి చెంది, ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ అండ్ మీడియా హబ్‌గా తయారైంది.

అకడమిక్స్

[మార్చు]

2012 జూన్ 20న, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఫిల్మ్ మేకింగ్‌లో పూర్తి స్థాయి డిగ్రీ కోర్సులను అందించడానికి జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.[2]

యాక్టింగ్ కోర్స్

[మార్చు]

ఇందులో ప్రతి సంవత్సరం రెండు ఆరు నెలల నటన కోర్సులను నిర్వహిస్తుంది.

ఇంటర్నేషనల్ కొలాబరేషన్

[మార్చు]

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా, నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మొదటి భారతీయ సినిమా సెమినార్ - విద్యార్థి, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాన్ని పూర్తి చేశాయి. ఈ కార్యాచరణలో భాగంగా, ఇవాన్‌స్టన్ (అమెరికా), దోహా (ఖతార్)లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ క్యాంపస్‌లకు చెందిన 27 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇక్కడ వారం రోజులపాటు సెమినార్ నిర్వహించారు. సెమినార్ ముఖ్యంగా రేడియో, టీవీ, ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోల సందర్శన ప్రారంభమై 48 గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్‌తో ముగిసింది. నార్త్ వెస్ట్రన్ ఇక్కడ విద్యార్థుల సహకారంతో ఐదు చిత్రాలను రూపొందించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "ప్రజల పక్షాన మీడియా పోరాడాలి |". web.archive.org. 2023-09-03. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Annapurna International School of Film teams up with JN varsity.url=http://www.thehindubusinessline.com/industry-and-economy/marketing/article3551313.ece?ref=wl_industry-and-economy". The Hindu. 20 June 2012.
  3. "India Glitz". India Glitz. Archived from the original on 24 September 2015. Retrieved 23 May 2014.