గుంటుపల్లి కల్పలత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంటుపల్లి కల్పలత

గుంటుపల్లి కల్పలత ప్రఖ్యాత ఛాతీ వైద్యురాలు. అమెరికన్‌ ఛాతీ వైద్యుల సంఘమునకు అధ్యక్షురాలు. హ్యూస్టన్ లోని బాయ్లర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లోఆచార్యురాలు. బీసీఎంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల శాఖకు అధిపతి. పొగాకు వాడకానికి వ్యతిరేకంగా ఎంతో కృషి చేసి, సంబంధిత వ్యాధులను నివారించడానికి పాటుపడ్డారు. అమెరికాలో భారత సంతతి వైద్యుల సంఘానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. హైదరాబాదు‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయములో వైద్యశాస్త్రములో ఎం.డీ పట్టా పొందారు. ఆ తరువాత ప్రత్యేక విద్య‌ చేయడానికి 1974లో అమెరికా వెళ్లారు. పొగాకు వాడకాన్ని నియంత్రించేందుకు పలు సాంఘిక సేవా కార్యక్రమాలను ఆమె నిర్వహించారు. పొగాకు వాడకానికి వ్యతిరేకంగా ఏడు భాషల్లో పుస్తకాలు వెలువరించడమే కాక, పిల్లల్లో పొగాకు పట్ల వ్యతిరేకత కలిగే ఎన్నో కార్టూన్లు రూపొందించారు. 'ఈవిల్స్ ఆఫ్‌ టుబాకో' పేరిట ఒక సీడీని, 12 నిమిషాల వీడియో డాక్యుమెంటరీని రూపొందించారు. వాటిని తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ, గుజరాతీ భాషల్లోకి అనువదించారు. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద వైద్య, విద్య సేవలు అందించే 'షేర్‌-యూఎస్‌ఏ' సంస్థను కూడా ఆమె స్థాపించారు.

పురస్కారాలు

[మార్చు]
  • 2007-పార్కర్‌ జే పామర్‌ కరేజ్‌ టు టీచ్‌' అవార్డు
  • అమెరికన్‌ థొరాసిక్‌ సొసైటీ వరల్డ్‌ లాంగ్ హెల్త్' అవార్డు

మూలాలు

[మార్చు]