జస్టిస్ సర్దార్ అలీ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జస్టిస్ సర్దార్ అలీ ఖాన్
జననం(1930-05-05)1930 మే 5
మరణం2012 నవంబరు 8(2012-11-08) (వయసు 82)
హైదరాబాదు
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిన్యాయవాది

జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ (5 మే 1930 - 8 నవంబర్ 2012) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. న్యాయవ్యవస్థలోని వివిధ పదవులు నిర్వహించాడు.[1]

తొలి జీవితం[మార్చు]

హైదరాబాద్ రాష్ట్రంలోని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కోర్టులో సుబేదార్ (గవర్నర్)గా పనిచేస్తున్న మహ్మద్ అమీర్ అలీ ఖాన్ కు జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ జన్మించాడు. 1948లో మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలో తొలిస్థానంలో నిలిచాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ, ఎల్.ఎల్.బి. పట్టా పొందాడు.

వృత్తిరంగం[మార్చు]

ఇతడు మైనారిటీల జాతీయ కమిషన్ చైర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ ఎయిడ్ అండ్ అడ్వైజరీ బోర్డు అధ్యక్షుడిగా పనిచేశాడు. 1991 నుండి 1992 వరకు ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా, 1984 నుండి 1991 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా ఫ్యాకల్టీ డీన్, 1994 నుండి 1996 వరకు నిజాం కళాశాల బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఇతనికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

మరణం[మార్చు]

జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ తన 82 ఏళ్ళ వయసులో 2012, నవంబరు 8న మరణించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. "Justice Sardar Ali Khan dead". The Hindu (in Indian English). Special Correspondent. 2012-11-09. ISSN 0971-751X. Retrieved 2021-05-26.{{cite news}}: CS1 maint: others (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-10. Retrieved 2021-05-26.
  3. Khan, Ali (8 November 2012). "Justice Sardar Ali Khan passes away". The Siasat Daily - Archive (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-26.