Jump to content

మొలుగరం కుమార్

వికీపీడియా నుండి

మొలుగరం కుమార్ తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రొఫెసర్[1]. ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా 18 అక్టోబరు 2024 న నియమితుడయ్యాడు.ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నాడు[2][3][4].

ఆచార్య

మొలుగరం కుమార్
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
జననం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుయం.కుమార్
విద్యఎంటెక్., పి.హెచ్.డి.ఐఐటీ బొంబాయి
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిఇంజినీరింగ్ కళాశాల ఆచార్యుడు
ఉద్యోగంఉపకులపతి ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పరిశోధకుడు,
అర్బన్ ఎన్విరాన్ మెంట్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్
గుర్తించదగిన సేవలు
ఐఐటీ బొంబాయి,
పరీక్షలు విభాగం కంట్రోలర్,
నిత్యాన్వేషణం
పురస్కారాలురాష్ట్ర స్థాయి లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు,

జననం విద్యాభ్యాసం

[మార్చు]

మొలుగారం కుమార్ తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ మండలంలోని కొండా పూర్ గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచులర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీని చదివి, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జేఎన్టీయూ) నుండి పిజి (ఎం టేక్ ) డిగ్రీని పూర్తి చేసిన తరువాత బొంబాయి లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పిహెచ్. డి చేసి గౌరవ డాక్టరేట్ పట్టా పొందాడు.

వృత్తి జీవితం

[మార్చు]

మొలుగారం కుమార్ ‌ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదులోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సివిల్ ఇంజనీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ గా పని చేశారు. 2019-2020 లో టి ఎస్ పీజీఈసేట్ కన్వీనర్ పని చేశారు.అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, సివిల్ ఇంజనీరింగ్ బోర్డు ఆఫ్ స్టడీస్ విభాగములో ‌చైర్మన్‌గా సేవలందించాడు. ‌ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదు లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సివిల్ ఇంజనీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ గా పని చేశారు. 2019-2020 లో టి ఎస్ పీజీఈసేట్ కన్వీనర్ పని చేశారు.అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, సివిల్ ఇంజనీరింగ్ బోర్డు ఆఫ్ స్టడీస్ విభాగములో ‌చైర్మన్‌గా సేవలందించారు. ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్, మౌలిక సదుపాయాల కల్పన లో అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు డైరెక్టర్ గా వ్యవహరించాడు.పరిక్షల విభాగానికి యూసిఈ ,ఇన్ ఫ్రాస్ట్రక్చ్ ర్ , సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అధిపతి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్, ఉస్మానియా యూనివర్సిటీ లో అనేక పరిశోధనలు సాంకేతిక సంస్థలలో జీవితకాల సభ్యుడుగా పని చేశాడు.ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల కంట్రోలర్ గా రెండు సంవత్సరాల పాటు సేవలందించాడు.

ఉపకులపతి

[మార్చు]

ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి [5],పరీక్షల విభాగం కంట్రోలర్,ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్,అర్బన్ ఎన్విరాన్ మెంట్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ గా పని చేయుచున్న ప్రొ, డా. మొలుగరం కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి గా నియమించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వీసీలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేదీ:18 అక్టోబరు 2024 న ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేశారు.ఉస్మానియా వర్సిటీ వీసీగా ప్రొ. డా.మొలుగరం కుమార్ మూడేళ్ల పాటు ఉప కులపతి గా పదవి ల్లో కొనసాగుతాడు.

అవార్డులు

[మార్చు]

1.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2018

మొలుగారం కుమార్ అంకిత భావంతో విధులు నిర్వహిస్తు జాతీయ అంతర్జాతీయ పత్రికలలో సమావేశంలో వందకు పైగా పరిశోధన పత్రాలను రచించారు. తొంబై కంటే ఎక్కువ యం.ఇ పరిశోధనలు పదకొండు పిహెచ్ డి పర్యవేక్షించి. విద్యార్థులకు మార్గదర జారీ చేసి నాణ్యమైన విద్య కై కృషి చేస్తున్నారు.అతని కృషిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది.

2.ఇంజనీరింగ్ ఆఫ్ ది ఇయర్ -2018 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వారి సహకారంతో ఇంజనీరింగ్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నారు.

3.జాతీయ ఇంటిగ్రేషన్ అవార్డు-2019 ఇంజనీరింగ్ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.

4.బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు -2019 స్మార్ట్ ఇన్ ఫ్రాస్ట్ ట్రస్టీ ఆఫ్ ఇండియా వారు ఈ పురస్కారం ఇవ్వడం జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. Today, Telangana (2023-07-08). "Prof. Kumar Molugaram to present at World Transportation Research Conference". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-10-19.
  2. "9 వర్సిటీలకు వీసీల నియామకం | Telangana Govt appoints Vice Chancellors to nine universities | Sakshi". sakshi.com. Retrieved 2024-10-19.
  3. Aamani (2024-10-18). "ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ కుమార్". www.dishadaily.com. Retrieved 2024-10-19.
  4. Velugu, V6 (2024-10-19). "9 యూనివర్సిటీలకు కొత్త వీసీలు". V6 Velugu. Retrieved 2024-10-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "ఇద్దరూ ఓయూ పూర్వవిద్యార్థులే". EENADU. Retrieved 2024-10-19.