అసదుద్దీన్ ఒవైసీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసదుద్దీన్ ఒవైసీ
అసదుద్దీన్ ఒవైసీ


ముందు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ
నియోజకవర్గం హైదరాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1969-05-13) 1969 మే 13 (వయసు 55)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
జీవిత భాగస్వామి ఫర్హీన్ ఒవైసీ
సంతానం ఒక కుమారుడు,ఐదుగురు కూతుర్లు
నివాసం హైదరాబాదు
మతం ఇస్లాం

అసదుద్దీన్ ఒవైసీ (మే 13, 1969) ఒక రాజకీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు. హైదరాబాదులో జన్మించాడు. ఎంఐఎం పార్టీ తరపున ఎన్నుకోబడ్డాడు. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ కుమారుడు. లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక గాక ముందు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

అసదుద్దీన్ ఒవైసీ 2024లో 18వ లోక్ సభ హైదరాబాద్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుండి వరుసగా ఐదో సారి 3,38,087 ఓట్ల రికార్డు మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత పై గెలిచాడు.

పదవులు

[మార్చు]
# నుంచి వరకు పదవి
01 1994 1999 శాసనసభ సభ్యుడు, (ఆంధ్రప్రదేశ్ శాసనసభ)
02 1999 2003 శాసనసభ సభ్యుడు, (ఆంధ్రప్రదేశ్ శాసనసభ)
03 2004 2009 14వ లోక్ సభ సభ్యులు హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
04 2004 2006 సభ్యుడు, పార్లమెంటు లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ సభ్యుల కమిటీ
05 2004 2006 సామాజిక న్యాయం, సాధికారతపై కమిటీ సభ్యుడు,
06 2006 2007 రక్షణ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
07 2009 2014 15వ లోక్ సభ సభ్యులు హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
08 2009 2014 రక్షణ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
09 2009 2014 సభ్యుడు, ఎతిక్ కమిటీ
10 2009 - అధ్యక్షుడు, ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
11 2014 - 16వ లోక్ సభ సభ్యులు హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]