Jump to content

సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ

వికీపీడియా నుండి
(సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నుండి దారిమార్పు చెందింది)
సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ

దారుస్సలాం మజ్లిస్ పార్టీ కార్యాలయం
తరువాత అసదుద్దీన్ ఒవైసీ (కుమారుడు)
నియోజకవర్గం హైదరాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం 14 ఫిబ్రవరి, 1931
హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్
మరణం 29.9.2008
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
సంతానం 3 కుమారులు , 1 కుమార్తె.
మతం ఇస్లాం
వెబ్‌సైటు లేదు
October 17, 2006నాటికి మూలం http://www.etemaaddaily.com/

సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ (ఫిబ్రవరి 14, 1931 - సెప్టెంబరు 29, 2008) హైదరాబాదు నగరానికి చెందిన రాజకీయవేత్త. మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు.

రాజకీయ జీవితం

[మార్చు]

1960 లో మల్లేపల్లి కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు. 1962, 67, 78, 83 లలో శాసన సభ్యునిగా, 1984 నుంచి 2004 వరకు 6 సార్లు వరుసగా హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడైన అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికైనంత వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. హైదరాబాద్ నగర మేయర్లుగా ఇద్దరు హిందువులను దళితులను మజ్లిస్ పార్టీ తరపున గెలిపించాడు. ఈయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ఎంపీ, శాసన సభ్యులులుగా పనిచేస్తున్నారు[1][1]. అక్బరుద్దీన్ ఒవైసీ ఆయన రెండవ కుమారుడు. అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు[2]. సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ యొక్క తండ్రి కూడా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కు అధ్యక్షునిగా పనిచేశాడు.

దారుస్సలాంలో ఎంఐఎం ప్రధాన కార్యాలయం ఎంఐఎం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సలావుద్దీన్ ఒవైసీ.

1976 లో ఆయన తండ్రి మరణానంతరం మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ యొక్క అధ్యక్ష బాధ్యతలను సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ స్వీకరించాడు.

సలాహుద్దీన్ ఒవైసీ "సాలార్-ఎ-మిల్లత్" (సమూహ నాయకుడు - ముస్లిం సమూహ నాయకుడు) గా కూడా అందరికీ పరిచయం. ప్రజలే ఇతడిని "సాలార్ ఎ మిల్లత్" గా, గౌరవంగా పిలిచేవారు. ఆయన తన ఉపన్యాసాలలో ఈ విధంగా చెప్పేవాడు. "భారతదేశం ముస్లింలను వారి అదృష్టానికి వదిలి వేసింది. అందువలన ముస్లిములు ప్రభుత్వం యొక్క సహాయానికి ఎదురు చూడకుండా వారి కాళ్లపై వారు నిలబడాలి". ఒవైసీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన రాజకీయ వేత్త. ఆయన ఖ్యాతి రాష్ట్ర సరిహద్దుల వరకు పాకింది. ముస్లిం ప్రజలు ఆయన వెనుకే ఉన్నారని, ముస్లిం ఓటు బ్యాంకుకు ఆయన ప్రధానమైన వాడని అందరూ విశ్వసించేవారు. ఆయన హైదరాబాద్లో ముస్లిం నాయకులలో ప్రసిద్ధమైనవాడు.

సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ అతి పిన్న వయసులోనే ఆయన తండ్రి చెరసాల పాలయ్య సమయంలో రాజకీయ జీవితం ప్రారంభించాడు.

అభివృద్ధి

[మార్చు]

ముసిం ల ఆర్థిక, విద్యాభివృద్ధికి ఒవైసీ మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కాలేజీ, ఫార్మసీ కళాశాల, డిగ్రీ కళాశాల, కాలేజ్ ఫర్ హాస్పటల్ మేనేజ్ మెంట్, ఎం.బి.ఎ, ఎం.సి.ఎ., నర్సింగ్, కోపరేటివ్ బ్యాంకు, ఐ.టి.ఐ, రెండు ఆసుపత్రులను స్థాపించాడు. ఉర్దూ పత్రిక ఏతెమాద్ (నమ్మకం / భరోసా) ను ప్రారంభించాడు.

ఎన్నికల సమాచారము

[మార్చు]
  • 1962 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర పార్టీ అభర్థిగా పత్తర్ ఘట్టి శాసనసభ నియోజక వర్గం నుండి గెలిచాడు.
  • 1962 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర పార్టీ అభర్థిగా చార్మినార్ శాసనసభ నియోజక వర్గం నుండి గెలిచాడు.
  • 1978 శాసనసభ ఎన్నికలలో 51.98% ఓట్లతో స్వతంత్ర పార్టీ అభర్థిగా చార్మినార్ శాసనసభ నియోజక వర్గం నుండి గెలిచాడు.
  • 1983 శాసనసభ ఎన్నికలలో 64.05% ఓట్లతో స్వతంత్ర పార్టీ అభర్థిగా చార్మినార్ శాసనసభ నియోజక వర్గం నుండి గెలిచాడు.
  • 1984 లోక్‌సభ ఎన్నికలలో 38.13% ఓట్లతో స్వతంత్ర పార్టీ అభర్థిగా హైదరాబాద్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
  • 1989 లోక్‌సభ ఎన్నికలలో 45.91% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
  • 1991 లోక్‌సభ ఎన్నికలలో 46.18% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
  • 1996 లోక్‌సభ ఎన్నికలలో 34.57% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
  • 1998 లోక్‌సభ ఎన్నికలలో 44.65% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
  • 1999 లోక్‌సభ ఎన్నికలలో 41.36% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

ఇతర పాత్రలు

[మార్చు]
  • 1985–96— హోం మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు.
  • 1996–97—హోం మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడు.
  • 1996–97—పరిశ్రమల శాఖ కమిటీ సభ్యుడు.
  • 1996–97—ఆర్థిక కమిటీ సభ్యుడు.
  • 1998–99— రక్షణ శాఖ కమిటీ సభ్యుడు, అందలి సబ్ కమిటీ సభ్యుడు.

సూచికలు

[మార్చు]
  1. 1.0 1.1 Andhra Pradesh / Hyderabad News : A veteran of many battles Archived 2020-04-08 at the Wayback Machine. The Hindu (2008-09-30). Retrieved on 2012-05-05.
  2. MIM president Salahuddin Owaisi passes away | Indian Muslims Archived 2011-07-21 at the Wayback Machine. Indianmuslims.info. Retrieved on 2012-05-05.

బయటి లింకులు

[మార్చు]