బి. సుదర్శన్ రెడ్డి
బి. సుదర్శన్ రెడ్డి | |||
| |||
గోవా మొదటి లోకాయుక్త
| |||
పదవీ కాలం మార్చి 2013 – అక్టోబరు 2013 | |||
సుప్రీంకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 2007, జనవరి 12 – 2011 జూలై 8 | |||
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1993, మే 2 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1946, జూలై 8 ఆకుల మైలారం, కందుకూర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
బి. సుదర్శన్ రెడ్డి (జననం: 1946 జూలై 8) భారతదేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి,[1] గోవా మొదటి లోకాయుక్త చైర్మన్. 2007 జనవరి 12 నుండి 2011 జూలై 8 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు.[2]
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 2024 డిసెంబర్ 14న హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మధ్యవర్తత్వ కేంద్రం (ఐఏఎంసీ) శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టాడు. [3]
బి. సుదర్శన్ రెడ్డి 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పర్యవేక్షించటానికి, సూచనలు ఇవ్వటానికి ఏర్పాటు చేసిన కమిటీకి సలహాదారుడిగా నియమితుడయ్యాడు.[4]
తొలి జీవితం
[మార్చు]సుదర్శన్ రెడ్డి 1946, జూలై 8న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కందుకూర్ మండలంలోని ఆకుల మైలారం గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుదర్శన్ రెడ్డి హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1971లో న్యాయవిద్యను పూర్తిచేశాడు.[5]
వృత్తి జీవితం
[మార్చు]సుదర్శన్ రెడ్డి తన కెరీర్ లో మొదటగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది కె. ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్, రాజ్యాంగపరమైన విషయాలపై ప్రాక్టీస్ ప్రారంభించాడు. 1988, ఆగస్టు 8న హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా, కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యాడు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ సలహాదారుగా కూడా పనిచేశాడు. 1993, మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తి అయ్యాడు. 2005 డిసెంబరు 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.
2007, జనవరి 12న సుప్రీంకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 2011 జూలై 8న పదవీ విరమణ పొందాడు.[6][7] 2013 మార్చిలో మొదటి గోవా లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించాడు, వ్యక్తిగత కారణాలతో 2013 అక్టోబరులో ఆ పదవికి రాజీనామా చేశాడు.[8]
ముఖ్య తీర్పులు
[మార్చు]- జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి వివిధ చట్టపరమైన శాఖలపై, ముఖ్యంగా క్రిమినల్ న్యాయశాస్త్రం, పన్ను, సేవా చట్టం, మానవ హక్కులు, రాజ్యాంగ సమస్యలపై అనేక తీర్పులు ఇచ్చాడు.
- పదవీ విరమణకు కొన్ని రోజుల ముందు, నల్లధనం కేసులను విచారించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహించినందుకు విమర్శిస్తూ తీర్పును వెలువరించాడు. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించాడు.
- అంతకుముందు, అతని బెంచ్ జారీ చేసిన ఆదేశాల మేరకు, పూణేకి చెందిన వ్యాపారవేత్త హసన్ అలీ ఖాన్ బెయిల్‌పై విడుదల చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిలిపివేసింది, అతని కస్టడీ విచారణకు మార్గం సుగమం చేసింది. హసన్ అలీపై మనీ లాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి.
- మానవ హక్కుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మావోయిస్టుల హింస లేదా తిరుగుబాటును ఎదుర్కొనేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రత్యేక పోలీసు అధికారులు/సాల్వా జుడుమ్ లేదా 'కోయ కమాండోలు' అని పిలవబడే గిరిజన యువకులను నియమించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Correspondent, Legal (2011-07-08). "Justice B. Sudershan Reddy retires". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2018-06-10. Retrieved 2021-10-11.
- ↑ The Hindu (7 July 2011). "Justice B. Sudershan Reddy retires" (in Indian English). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ Eenadu (15 December 2024). "ఐఏఎంసీ శాశ్వత ట్రస్టీగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ ETV Bharat News (11 December 2024). "పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్ ఈనెల 19 నుంచి హైదరాబాద్‌లో బుక్‌ఫెయిర్". Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 22 (help) - ↑ "Hon'ble Mr. Justice B. Sudershan Reddy". Archived from the original on 20 జూలై 2011. Retrieved 11 October 2021.
- ↑ "Judges Profile". Archived from the original on 20 ఫిబ్రవరి 2020. Retrieved 11 October 2021.
- ↑ "Former Judges". Archived from the original on 23 నవంబరు 2018. Retrieved 11 October 2021.
- ↑ "Goa Lokayukta B Sudarshan Reddy resigns". The Economic Times. PTI. 17 October 2013. Retrieved 11 October 2021.