ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌
प्रवर्तन निदेशालय
పొడిపదాలుఈడీ
Agency overview
ఏర్పాటు1 మే 1956
(68 సంవత్సరాల క్రితం)
 (1956-05-01)
Jurisdictional structure
Operations jurisdictionభారతదేశ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ
Governing bodyభారత ప్రభుత్వం
Constituting instruments
  • ఫారిన్ ఎక్స్చేంజి మానేజ్మెంట్ ఆక్ట్
  • ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ ఆక్ట్, 2002
ప్రధాన కార్యాలయంన్యూఢిల్లీ, భారతదేశం
మంత్రి responsible
Agency executives
  • సంజయ్ కుమార్ మిశ్రా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, డైరెక్టర్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌
  • సిమాంచల దాస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ప్రిన్సిపాల్ స్పెషల్ డైరెక్టర్
Parent agencyఆర్థిక మంత్రిత్వ శాఖ
Website
enforcementdirectorate.gov.in

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) భారతదేశంలో ఆర్థిక చట్టాలను అమలు చేయడానికి, ఆర్థిక నేరాలపై విచారణ వహించే ఆర్థిక గూఢచార సంస్థ. ఈడీ భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ శాఖలో భాగం. దీనిలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లకు చెందిన అధికారులతో పాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో పని చేసే అధికారులు ఈడీకి డిప్యుటేషన్‌పై వస్తూ ఉంటారు.[1]

ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. మేఘాలయ, కర్ణాటక, మణిపూర్, త్రిపుర, సిక్కిం వంటి రాష్ట్రాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసింది. మేఘాలయలోని ఇంఫాల్‌లో, షిల్లాంగ్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వీటికి డిప్యూటీ డైరెక్టర్ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తాడు. ఈ కార్యాలయాలు గువాహటిలోని జోనల్ కార్యాలయం-2 పరిధిలో పని చేస్తాయి.[2]

కర్ణాటకలోని మంగళూరులో 2021 సెప్టెంబరులో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా, దీనికి డిప్యూటీ డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ నాయకత్వం వహిస్తున్నాడు. రాష్ట్రంలోని 15 జిల్లాలపై దీనికి అధికార పరిధి ఉంది. ఈశాన్య ప్రాంతంలో నాలుగో సబ్ జోనల్ ఆఫీస్‌ను గ్యాంగ్‌టక్‌లో 2021 అక్టోబరులో ఏర్పాటు చేసింది. అగర్తలలో సబ్ జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.[3]

లక్ష్యం

[మార్చు]

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన లక్ష్యం భారత ప్రభుత్వం కీలక చట్టాలైన ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999 (ఫెమా), ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 (PMLA) , ది ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, 2018 (FEOA) లను అమలు చేయడం.[4]

మూలాలు

[మార్చు]
  1. "Official Website".
  2. "Explained: The Birth And Evolution Of Enforcement Directorate As Indian State's Sword Arm" (in ఇంగ్లీష్). 26 July 2022. Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
  3. Andhrajyothy (2 August 2022). "నాలుగేళ్ళలో రెట్టింపు బలోపేతమైన ఈడీ". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
  4. Andhra Jyothy (2006). "The history of the reign of the Emperor Charles V : with a view of the progress of society in Europe, from the subversion of the Roman Empire to the beginning of the sixteenth century". University of Michigan. Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.