కొండముది శ్రీరామచంద్రమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండముది శ్రీరామచంద్రమూర్తి ప్రముఖ రచయిత. ఇతడు 40కి పైగా నవలలు, 600 కథలు వ్రాశాడు. ఇతని నవల "చిరుమువ్వల మరుసవ్వడి" ఆధారంగా ఆనంద భైరవి సినిమాను తీశారు. ఈ సినిమాకు ఇతనికి ద్వితీయ ఉత్తమ కథారచయితగా నంది పురస్కారంతో పాటు వంశీ, కళాసాగర్ పురస్కారాలు లభించింది. ఇంకా ఇతడు మండలాధీశుడు, శ్రీరామచంద్రుడు సినిమాలకు సంభాషణలు వ్రాశాడు.

రచనలు[మార్చు]

 1. పద్మవ్యూహం (నాటకం)
 2. సింహకాకౌతం
 3. మంత్రిగారి కూతురు
 4. సిరిదివ్వెలు
 5. ధర్మదీపం
 6. తలుపులు తెరవకండి
 7. పాపం పడగనీడ
 8. నారీ నారీ నడుమ మురారి
 9. స్వయంకృతం
 10. కలియుగ స్త్రీ
 11. వెన్నెల వేడి
 12. యజ్ఞ సమిథలు
 13. మనిషి గుర్రం మనసు కళ్ళెం (నవల)
 14. ధర్మం చెర (నవల)
 15. ఒక సబల కథ (నవల)
 16. తెలుగు తల్లీ కళ్ళుమూసుకో
 17. ధనుర్దాసు (నాటకం)
 18. గడ్డిపూలు (నాటకం)
 19. రాజేంద్రప్రసాద్ (జీవిత చరిత్ర)
 20. కొండముది శ్రీరామచంద్రమూర్తి కథలు
 21. శ్రీరామచంద్రమూర్తి కథలు
 22. పాములాటి బ్రతుకు
 23. చిరుమువ్వల మరుసవ్వడి (నవల)
 24. అనిబీసెంట్

మరణం[మార్చు]

ఇతడు మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్ దేశంలోని ఖాట్మండులో 2008, సెప్టెంబరు 22వ తేదీన గుండెపోటుతో మరణించాడు[1].

మూలాలు[మార్చు]