Jump to content

కొండుభట్ల రామచంద్ర మూర్తి

వికీపీడియా నుండి
కె. రామచంద్ర మూర్తి
జననం
కొండుభట్ల రామచంద్ర మూర్తి

21 మే 1948
ఖమ్మం
వృత్తిరచయిత, సంపాదకులు

కె. రామచంద్రమూర్తిగా సుపరిచితులైన కొండుభట్ల రామచంద్ర మూర్తి ప్రఖ్యాత సంపాదకుడు, రచయిత, కాలమిస్ట్, వ్యంగ్య రచనలతో సమాజాన్ని మేల్కొలిపే హితైషి, బహుముఖ ప్రజ్ఞాశాలి.

ఉద్యోగం

[మార్చు]

తొలినాళ్ళలో RTC లో పనిచేసి, పాత్రికేయ వృత్తిపై ఆసక్తితో బెంగుళూరులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో పనిచేసారు. ఐదేళ్ళు ఆంధ్రప్రభలో పనిచేసాక విజయవాడలో ఉదయం పత్రికలో పనిచేసారు. హెచ్‍ఎంటీవీ లో కూడా పనిచేసాడు. సాక్షి సంపాదకీయ డెరైక్టర్‌గా పని చేశాడు.[1]

కె.రామచంద్రమూర్తి నవంబరు 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారుగా నియమితుడయ్యాడు. ఆయన తన వ్యక్తిగత కారణాల రీత్యా పదవికి 25 ఆగష్టు 2020న రాజీనామా చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (7 September 2014). "'సాక్షి' ఈడీగా కె.రామచంద్రమూర్తి". Sakshi. ఒరిజినల్ నుండి 27 జూలై 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 July 2021.
  2. TV9 Telugu (25 August 2020). "సలహాదారుపదవికి కె.రామచంద్రమూర్తి రాజీనామా - k ramachandramurthy resigns as AP advisor". ఒరిజినల్ నుండి 27 జూలై 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)