కాలిఫోర్నియా
కాలిఫోర్నియా | |
---|---|
దేశం | సంయుక్త రాష్ట్రాలు |
రాష్ట్రం ఏర్పడుటకు ముందు | California Republic |
యూనియన్ లో ప్రవేశించిన తేదీ | September 9, 1850 (31st) |
అతిపెద్ద నగరం | Los Angeles |
అతిపెద్ద మెట్రో | Greater Los Angeles Area |
ప్రభుత్వం | |
• గవర్నర్ | Gavin Newsom (D) |
• లెప్టినెంట్ గవర్నర్ | Eleni Kounalakis (D) |
జనాభా వివరాలు | |
• మొత్తం | 37,691,912 (2,011 est) |
• సాంద్రత | 242/sq mi (93.3/km2) |
• గృహ సగటు ఆదాయం | US$61,021 |
• ఆదాయ ర్యాంకు | 9th |
భాష | |
• అధికార భాష | English |
• మాట్లాడే భాష | English (only) 57.6% Spanish 28.2%[1] |
అక్షాంశం | 32° 32′ N to 42° N |
రేఖాంశం | 114° 8′ W to 124° 26′ W |
కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలోకి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రపు ఒడ్డున ఉంది.ఈ రాష్ట్రానికి పొరుగున ఒరెగాన్, నెవాడా, ఆరిజోనా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దు మెక్సికో దేశపు బాహా కాలిఫోర్నియా. లాస్ ఏంజెల్స్, శాన్ డియాగో,శాన్ ఓసె, శాన్ ఫ్రాన్సిస్కో ఈ రాష్ట్రంలోని నాలుగు అతి పెద్ద నగరాలు. కాలిఫోర్నియా వైవిధ్యభరితమైన వాతావరణానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్ర జనాభా వివిధ జాతుల సమాహారం. రాష్ట్ర రాజధాని శాక్రమెంటో
స్థానిక ఆటవిక తెగలు కాలిఫోర్నియాలో వందలాది సంవత్సరాలుగా నివాసమున్నాయి. ఈ ప్రాంతం 1769లో స్పెయిన్ దేశీయులచే తొలిసారిగా ఆక్రమింపబడింది. 1821లో మెక్సికో స్వాతంత్ర్యానంతరం ఈ ప్రాంతం మెక్సికో ఏలుబడిలో కొనసాగింది. 1846లో స్వతంత్ర కాలిఫోర్నియా గణతంత్రంగా వారం రోజుల స్వల్పస్వతంత్రత పిమ్మట 1848లో మెక్సికో అమెరికా యుద్ధానంతరం సెప్టెంబరు 9,1850న అమెరికా సంయుక్త రాష్ట్రాలలోకి 31వ రాష్ట్రంగా చేర్ఛుకోబడింది.
అమెరికాలో ప్రవాస భారతీయులు అధికంగ స్థిరపడిన ప్రాంతాలలో కాలిఫోర్నియా ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడి ప్రవాసాంధ్రులు స్థాపించిన సిలికానాంధ్ర తెలుగు వారికి ఒక అహ్లాదకరమైన వేదిక
దేవాలయాలు[మార్చు]
- సొసైటీ ఆఫ్ ఎబిడెన్స్ ఇన్ ట్రూత్
- బాలాజీ దేవాలయం
- మాలిబు హిందూ దేవాలయం
- రామకృష్ణ మఠం
- శివదుర్గ దేవాలయం
- స్వామినారాయణ దేవాలయం
మూలాలు[మార్చు]
- ↑ California – Languages (PDF). Census. Retrieved April 15, 2010.