మాలిబు హిందూ దేవాలయం
మాలిబు హిందూ దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం | కాలిఫోర్నియా |
స్థలం | 1600 లాస్ విర్జెనెస్ కాన్యన్ రోడ్, కలాబాసాస్ |
సంస్కృతి | |
దైవం | వెంకటేశ్వరస్వామి, శివుడు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రావిడ |
దేవాలయాల సంఖ్య | 1 |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 1981 |
వెబ్సైట్ | అధికారిక వెబ్సైటు |
మాలిబు హిందూ దేవాలయం, కాలిఫోర్నియాలోని ఒక దేవాలయం. వెంకటేశ్వరస్వామి కొలువైవున్న ఈ దేవాలయం 1981లో నిర్మించబడింది. శాంటా మోనికా పర్వతాలులోని మాలిబు సమీపంలోని కలబాసస్ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయం, సదరన్ కాలిఫోర్నియాలోని హిందూ టెంపుల్ సొసైటీ యాజమాన్యంలో నిర్వహించబడుతోంది. సాంప్రదాయ దక్షిణ భారత శైలిలో నిర్మించబడిన ఈ దేవాలయానికి హిందువులు తరచుగా వస్తుంటారు. పశ్చిమ అర్ధగోళంలోవున్న అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఇదీ ఒకటి.[1]
దేవాలయ ఆవరణలో పూజారులు నివాసం ఉంటారు. ఈ దేవాలయంలో ఉత్సవాలకోసం, సాంస్కృతిక, హిందూ కార్యక్రమాలోసం ప్రత్యేక వేదిక ఉంది.
నిర్వహణ
[మార్చు]లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న సివిల్ ఇంజనీరైన వాసన్ శ్రీనివాసన్ ఈ దేవాలయానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. అక్కడి స్థానిక కుటుంబాల నుండి నిధులు సేకరించడం, నిర్మాణ పర్యవేక్షణ, భారతదేశం నుండి పూజారులను తీసుకురావడంలో శ్రీనివాసన్ కీలకపాత్ర పోషించాడు.[2] 2017 జూలైలో శ్రీనివాసన్ మరణించే వరకు, భారతీయ అమెరికన్ పన్ను సలహాదారు నడదుర్ వర్ధన్ దేవాలయ అధ్యక్షుడిగా పనిచేశాడు.[3][4] దక్షిణ కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయాల సంఘం ఈ దేవాలయాన్ని నిర్వహిస్తోంది.
దేవాలయ సముదాయం
[మార్చు]ఈ దేవాలయంలోవున్న రెండు సముదాయాలలో ఎగువ కాంప్లెక్స్‌లో వేంకటేశ్వరస్వామి, దిగువ కాంప్లెక్స్ లో శివుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాగణంలో ఇతర దేవతలకు మందిరాలు కూడా ఉన్నాయి.[5]
ఇతర వివరాలు
[మార్చు]1997లో, క్రిస్ ఫర్లీ నటించిన బెవర్లీ హిల్స్ నింజా సినిమాలో ఒక చిన్న సన్నివేశం, 1998లో జీన్స్ సినిమా ఒక పాటను ఈ దేవాలయంలోనే చిత్రీకరించారు. 2006 జనవరిలో, పాప్-స్టార్ గాయని బ్రిట్నీ స్పియర్స్ 4-నెలల కొడుకును ఈ దేవాలయంలోని హిందూ పూజారులు ఆశీర్వదించారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రసారమైంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ Day, Mona (July 29, 2016). "Three-Day Bhagwat Katha Held at Malibu Temple". India West. Archived from the original on 8 ఆగస్టు 2018. Retrieved 19 January 2022.
- ↑ HOLLEY, DAVID (1985-10-27). "Legacy of Peace : Devotees Enact Rich Ritual at Festival as Work Progresses at Nation's Largest Hindu Temple". Los Angeles Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0458-3035. Retrieved 19 January 2022.
- ↑ "Nadadur Vardhan, President of Malibu Hindu Temple, Passes Away Following Brief Illness". India-West. 2017-07-06. Archived from the original on 2020-11-25. Retrieved 19 January 2022.
- ↑ "Malibu Hindu Temple Celebrates 32nd Anniversary". India-West. 2016-05-19. Archived from the original on 2017-08-09. Retrieved 19 January 2022.
- ↑ Garcia, Kenneth J. (March 25, 1988). "Sight to Behold : Ornate Hindu Temple in Malibu Is Shrine Where East Meets West". Los Angeles Times. Retrieved 19 January 2022.
- ↑ "Oops, Spears switched religions again". Today.com. 18 January 2006.