Jump to content

శాన్ డియాగో

వికీపీడియా నుండి
సాన్ డియాగో పట్టణం

శాన్ డియాగో పట్టణానికి ఈ పేరు సెయింట్ డిడాకస్ జ్ఞాపకార్ధం ఆయన మరణానంతరం పెట్టబడింది. ఇది అమెరికాలోని పెద్దనగరాలలో తొమ్మిదవ స్థానంలోనూ కాలిఫోర్నియా రాష్ట్రంలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇది అమెరికా దేశ పశ్చిమ తీరంలో పసిఫిక్ మహాసముద్ర తీరంలో విస్తరించి ఉంది. అమెరికా జనాభా గణాంకాలను అనుసరించి ఈ నగర జనాభా సంఖ్య 2008 వ సంవత్సరంలో 12,79,329. ఈ సముద్రతీర నగరం ఒక శాన్ డియాగో కౌంటీ నియోజకవర్గం . శాన్ డియాగో, కాల్స్‌బాడ్-శాన్ మార్కోస్ మెట్రో పాలిటన్ ప్రదేశాలకు శాన్ డియాగో వ్యాపార కూడలిగా ప్రసిద్ధి చెందింది. మనీ మాగజిన్ 2006 వ సంవత్సరంలో నివాసయోగ్యమైన అయిదవ ఉత్తమ నగరంగా శాన్ డియాగోను పేర్కొంది. ఫోర్బ్స్ కథనాన్ని అనుసరించి అమెరికా దేశంలో శాన్ డియాగో అయిదవ ఐశ్వర్య వంతమైన నగరంగా పేర్కొనబడింది. యుద్ధరంగానికి, పర్యాటకరంగానికి సంబంధించిన బృహత్తర పారిశ్రామిక నగరం శాన్ డియాగో. శాన్ డియాగో ఆర్థికంగా వ్యవసాయం, బయో టెక్నాలజీ/బయో సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఎలెక్ట్రానిక్స్, రక్షణ వ్యవస్థకు చెందిన వస్తు తయారీ, ఆర్థిక రంగ, వ్యాపార రంగానికి చెందిన సేవలు, నావల తయారీ, నావల బాగుచేత, సాస్ట్ వేర్ అభివృద్ధి, టెలి కమ్యూనికేషన్స్, వైర్‌లెస్ రీసెర్చ్, పర్యాటక రంగం లతో ముడిపడి ఉంది. నగరంలో ఉపస్థితమైన యూనివర్సిటీ ఆఫ్ శాన్ డియాగో యు చ్ ఎస్ డి మెడికల్ సెంటర్‌ను స్థాపించి పరిశోధనలను నిర్వహిస్తుంది.

నగర చరిత్ర

[మార్చు]
యురేపియన్ల ప్రవేశానికి ముందు శాండియాగోలో నివసించిన కుమేయాయ్ ప్రజలు
సెయింట్ డిడాకస్

శాన్ డియాగో నగర ప్రదేశం 10,000 సంవత్సరాల క్రితమే క్యుమెయాయ్ ఇండియన్ తెగల నివాసిత ప్రాంతంగా ఉందని ఆధారాలు ఉన్నాయి. స్పెయిన్ దేశం తరఫున నౌకాయానం చేస్తున్న పోర్చ్‌గీస్ పూర్వీకంగా కల రోడ్రిక్విజ్ కాబ్రిల్లో ఈ ప్రదేశాన్ని చేరి దీనిపై స్పెయిన్ సామ్రాజ్యం తరఫున 1542లో ఆధిక్యతను ప్రకటించి దీనికి శాన్ మిక్యూ అని నామకరణం చేసాడు. కాలిఫోర్నియాను భౌగోళికంగా చిత్రించడానికి పంపబడిన సబెస్టీన్ విజ్‌కెయినొ 1602లో శాన్ డియాగోకు వచ్చి చేరాడు. ప్రస్తుతం సముద్రతీరాన ఉన్న మిషన్ బే, పాయింట్ లోమా ప్రదేశాలను స్ర్వే చేసిన విజ్‌కెయినొ ఈ ప్రదేశానికి కాథలిక్ సెయింట్ డిడాకస్ జ్ఞాపకార్ధం అతని పేరు పెట్టాడు.స్పెయిన్ దేశస్థుడైన అతడు ప్రజలచే అధికంగా శాన్ డియోగా పిలువ బడటంతో శాన్ డియాగో అనే నామకరణం చేసాడు. 1769లో గాస్పర్ డి పోర్టోలా చే హార్బర్ (ఓడ రేవు) ప్రిసిడియో ఆఫ్ శాన్‌డియాగోస్థాపించబడింది. అదే సమయంలో ఫాదర్ జూనిపిరో సెర్రా పర్యవేక్షణలో ఫ్రాన్‌సిస్కాన్ చేత మిషిన్ శాన్‌డియాగో డి ఆల్కలా స్థాపించబడింది.

మిషన్ శాండియాగో
న్యూటౌన్ (ప్రస్తుత డౌన్ టౌన్) స్థాపకుడు ఆలెంజో హార్టెన్

1847లో మార్‌మన్ బెటాలియన్ తమ 2000 మైళ్ళ సుదీర్ఘ ప్రయాణం తరువాత శాన్ డియాగోను తమ గమ్యస్థానంగా చేసుకున్నది. ఆ దళ సభ్యుల చేత పాత పట్టణం (ఓల్డ్‌టౌన్) ప్రస్తుత శాన్ డియాగో, మాన్‌సన్ వీధి మూలన ఒక బ్రిక్ యార్డ్ (ఇటుకల నిర్మాణం) ను నిర్మించారు. ఆ కట్టడంలో నగరానికి మొదటి న్యాయస్థానం తన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం శాన్‌డియాగోలో ఒక భాగమైన శాన్ పాస్‌క్వల్ వ్యాలీలో బాటిల్ ఆఫ్ పాస్‌కన్ వార్, బాటిల్ ఆఫ్ మెక్సికన్ వార్ దళాల మధ్య పోరు జరిగింది. యుద్ధ పర్యవసానంగా గోల్డ రష్ ఆఫ్ 1948 సమయంలో 1850లో కాలిఫోర్నియా అమెరికన్ ప్రజలకు తన ద్వారాలు తెరిచిన సమయంలో అమెరికన్ ప్రజలు వరదలా శాన్ డియాగోకు తరలి వచ్చారు. ముందుగా కొత్తగా రూపొందించబడిన శాన్‌డియాగో నగరం కౌంటీ నియోజక వర్గంగా గుర్తించబడి తరువాతి కాలంలో పురపాలక వ్యవస్థగా గుర్తించబడింది.

బల్బొయా పార్క్

ప్రస్తుత ఓల్డ్ టౌన్ శాన్‌డియాగో స్టేట్ హిస్టారిక్ పార్క్ సమీప ప్రాంతలో ప్రిసిడియో కొండల కింది భాగంలోఈ నగరం ముందుగా రూపుదిద్దుకుని అభివృద్ధి చెందింది. 1860 ఆఖరులో పూర్వీక ఒప్పందానికి దక్షిణంగా కొన్ని మైళ్ళ దూరంలో కొత్తనగర నిర్మాణానికి అలాంజో హార్టన్ ప్రతిపాదన చేయబడిన ప్రాంతమే ప్రస్తుత డౌన్ టన్ సాన్ డియాగో. శాన్ డియాగో బే రవాణాకు అనుకూలంగా ఉండటంతో వ్యాపార ఆధారిత సమూహాలు ముందుగా న్యూటౌన్ వైపు ఆకర్షించబడ్డారు. ప్రస్తుతం ఆది ఓల్డ్ టౌన్ గా పిలువబడుతూ నగరానికి ప్రభుత్వ కార్యకలాపాలకు కేంద్రంగానూ, ఆర్థిక కేంద్రంగా బలపడింది. రెండవ ప్రపంచ యుద్ధానికి కొన్ని సంవత్సరాల ముందుగా ఇక్కడ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ నిర్వహించిన ఫ్రీ స్పీచ్ ఫైట్ కార్యక్రమం నగరంలో కొన్ని హింసాత్మక పరిణామాలకు దారి తీసింది. శాన్ డియాగో నగరంలో రెండు వరల్డ్ ఫెయిర్లు, 1915 ది పనామా కలిఫోర్నియా ఎక్స్‌పోజిషన్, 1935లో కలిఫోర్నియా పసిఫిక్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజిషన్నిర్వహించబడ్డాయి. ఈ ఎక్స్‌పోజిషన్ కొరకు నగరంలోని బాల్‌బో పార్క్లో స్పానిష్/బార్‌క్యూ శైలి భవనాలు చాలా నిర్మించబడ్డాయి. ప్రత్యేకంగా 1915లో నిర్మించబడిన ఈ తాత్కాలిక నిర్మాణాలు అనేకం తరువాతి కాలంలో చాలా సంవత్సరాల వరకూ అవి చాలా భాగం శిథిలమయ్యే వరకూ వాడకంలో ఉన్నాయి. చివరకు మిగిలినవి వాటి ప్రాతన శైలి మార్చబడకుండా పునర్నిర్మించబడి పురాతన నిర్మాణ శైలికి అద్దాలుగా ప్రస్తుత కాలం వరకూ నిలిచాయి. పాయింట్ లోమాలో 1901 యు. ఎస్ నావికా దళం నావల్ కోయిలింగ్ స్టేషనును స్థాపించి 1920 కాలంలో మరింత విస్తరించబడింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం సైనిక దళం నగర ఆర్థిక రంగంలో ప్రముఖ పాత్ర పోషించింది. కాని వారిలో అత్యధికులు కోల్డ్ వార్ తరువాతి కాలంలో ప్రాంటియ రక్షణ, ఎయిరో స్పేస్ పరిశ్రమలలో బాధ్యతలు స్వీకరించి తమ సేవలు కొనసాగించారు. ఫలితంగా డౌన్ టౌన్ నాయకుల ఆధిక్యం నగర ఆర్థికరంగంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం శాన్ డియాగో నగరం బయో టెక్నాలజీ పరిశ్రలకు కేంద్రంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఈ నగరంలోనే టెలికమ్యూనికేషన్ దిగ్గజం క్వాల్‌కమ్ ప్రధాన కార్యాలయం పనిచేస్తుంది.

సెడార్ ఫైర్ అగ్ని ప్రమాదం

[మార్చు]

శాన్ డియాగోలో సంభవించిన సెడార్ ఫైర్ అగ్ని ప్రమాదం కలిఫోర్నియాలో గత శతాబ్ది కాలంలో జరిగిన అతి పెద్ద కార్చిచ్చుగా గుర్తించబడింది. ఈ అగ్ని ప్రమాదంలో 280,000 ఎకరాల ఆటవిక ప్రాంతం అగ్నికి ఆహుతి కాగా 15 మంది ప్రాణాలను కబళించి 2,200 గృహాలను తన అగ్ని కీలలకు ఆహుతి చేసింది. ఈ మంటల వలన చెలరేగిన పొగ అనేక మందిని దురిత గతిన వైద్యశాలలకు తరలి వెళ్ళేలా చేసింది. ఈ మంటల వలన ఆస్త్మా, స్వసకోశ సమస్యలు, కళ్ళ మంటలు, పొగ పీల్చడం వలన కలిగిన అనారోగ్యం, వాతావరణ కాలుష్యం వంటి అవస్థల కారణంగా శాన్ డియాగో కౌంటీ పాఠశాలలు ఒక వారం రోజుల కాలం శలవు ప్రకటించాయి. తరువాతి నాలుగు సంవత్సరాల అనంతరం విచ్ ఫ్రీక్, హర్రీస్ ఫైర్ లాంటి అనేక అగ్ని ప్రమాదాలు నగరంలో అధిక భాగం నాశనం చేయడమే కాక కొన్ని ప్రాంతాలను, కొన్ని సమాజాలను సమూలంగా నాశనం చేసాయి. ప్రత్యేకంగా రాంచో బెర్నాండో, రాంచో శాంటా ఫే సమాజాలు దెబ్బతిన్నాయి. సదరన్ కలిఫోర్నియా ఫైర్ సెషన్ ఆఫ్ 2007 అగ్ని ప్రమాదం రొమానా ప్రాంతంలో తన ప్రతాపం చూపింది.

భౌగోళికం

[మార్చు]
విహంగ వీక్షణంలో శాండియాగో

ఎస్ డి ఎస్ యు ప్రొఫెసర్ గౌరవ ప్రొఫెసర్ " మోంటే మార్షల్ " శాండియాగో అఖాతాన్ని " ఉత్తర దక్షిణంగా విడదీస్తూ సుదీర్గమైన భాగం కలిగిన ఉపరితల వ్యక్తీకరణ కలిగిన భూమి " అని వర్ణించాడు. శాన్‌ఆండ్రియా ఫాల్ట్ సిస్టంలో " ది రోజ్ కేనియన్ ", లోమాఫాల్టులు భాగంగా ఉన్నాయి. అఖాతం వెంట 15 మైళ్ళదూరం ద్వీపకల్పశ్రేణిలో లగునా పర్వతాలు ఉన్నాయి. అమెరికన్ ఖండానికివి వెన్నెముకలాంటి పర్వతాలలో ఈ పర్వతాలు ఒక భాగం.

నగరంలో 200 లోతైన లోయలు, కొండలు సహజమైన మైదానాలను చెదురుమదురుగా నగరమంతా శాన్‌డియాగోను కొండప్రాంతం కలిగిన నగరంగా మార్చాయి. సంప్రదాయంగానే శాన్‌ఫ్రానియన్లు మెట్ట ప్రాంతాలలో నివాసగృహాలు వాణిజ్య నిర్మాణాలు నిర్మించి నగరప్రాంత లోయలను అడవి ప్రాంతంగా వదిలిపెడతారు. అందువలన లోయలు నగరాన్ని చిన్న భాగాలుగా విడగొడుతూ పక్క ప్రాంతాల మధ్య ఖాళీలను ఏర్పరుస్తాయి. అంతేకాక జనసాంధ్రత తక్కువగా ఉండడానికి ఇది ఒక కారణంగా మారింది. నగర మధ్యభాగంలో ఉత్తరదక్షిణాలుగా శాన్‌డియాగో నది ప్రవహిస్తూ శాన్‌డియాగో అఖాతంలో కలుస్తుంది. ఈ నది ఏర్పరచిన నదీ లోయ నగరాన్ని ఉత్తర దక్షిణాలుగా విడదీస్తుంది. స్వచ్ఛమైన ఈ నదీ జలాలు స్పెయిన్ భూశోధకులను ఆకర్షించాయి. పలుజలాశయాలు, కొండమార్గాలు రీజనల్ పార్కు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన నగర ప్రాంతాలలో ఉన్నాయి.

నగరపరిమితిలో ఉన్న గుర్తించతగిన కొండశిఖరాలు కోలెస్ మౌంటెన్. 1593 అడుగుల ఎత్తైన ఈ పర్వతం నగరంలో ఎత్తైనదిగా భావించబడుతుంది. 1558 అడుగుల ఎత్తు ఉన్న బ్లాక్ మౌంటెన్, 824 అడుగుల ఎత్తు ఉన్న మౌంటు సోలెడాడ్ ముఖ్యమైన కొండశిఖరాలు. ది కుయామక మౌంటెంస్, లాగునా మౌంటెన్లు నగరానికి తూర్పున ఉన్నాయి. బేయండు మౌంటెన్ ఎడారి ప్రాంతం. " ది క్లెవ్‌లాండ్ నేషనల్ ఫారెస్ట్ శాన్‌డియాగో డౌన్‌టౌన్‌కు అరగంట కార్ డ్రైవ్ దూరంలో ఉంది. నగరానికి ఈశాన్య, ఆగ్నేయ ప్రాంతాలలో పలు తోటలు ఉన్నాయి.

తెగలు, ఇరుగు పొరుగు

[మార్చు]
నార్మల్ హైట్స్ స్మాల్

శాన్‌డియాగో నరంలో సమూహ పరంగా విభజింపబడిన ప్రత్యేక ప్రాంతాలు 52 ఉన్నాయి. ఇవ్వబడిన నరగ ప్లానులో పలు పొరుగు ప్రాంతాలు ఉన్నాయి. నగరం చుట్టూ ఉన్న పొరుగు ప్రాంతాలు 100 కంటే అధికంగా ఉన్నాయి. శాన్‌డియాగో డౌన్‌టౌన్ శాన్‌డియాగో అఖాతతీరంలో ఉంది. బాల్‌బొయా ఈశాన్యంలో చుట్టి మిట్టలు, లోయలు కలిగిన హిల్‌క్రెస్ట్, నార్త్ పార్క్ పురాతన, నగరపుర ప్రజల నివాసాలు ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలలో నార్త్ ఆఫ్ వెల్లీ, రహదారి ఉన్నాయి. దక్షిణంలో సిటీ హైట్స్, కాలేజ్ ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తర దిక్కున మిషన్ వెల్లీ, ఇంటర్‌స్టేట్ 8 ఉన్నాయి. వెల్లీ ఉత్తరదిక్కున రహదారి పక్కన మేరిన్ క్రాప్ ఎయిర్ స్టేషను మిరామర్ దక్షిణ దిక్కున క్లైర్ మోంటు, కియర్నీ మెసా, టియర్రాశాంటా, నవాజో ఉన్నాయి. మిరా మెసా స్క్రిప్స్, రాంచ్ద్ఫ్చ్ద్, రాంచో, బెర్నాడో ఉన్నాయి. నగరానికి ఈశాన్యంగా ఉన్న దూర ప్రాంతం హాద్జెస్ సరస్సు, శాన్‌పాస్‌క్వల్ వెల్లీ ఉన్నాయి. ఇది వ్యవసాయ రక్షితప్రాంతం. కెరామెల్ వెల్లీ, డెల్‌మార్ హైట్స్ నగరానికి ఈశాన్యమూలలో ఉన్నాయి. దానికి దక్షిణంగా టొర్రే పైంస్ స్టేట్ రిజర్వ్, ది బిజినెస్ సెంటర్ ఆఫ్ ది గోల్డెన్ ట్రయాంగిల్ ఉన్నాయి. దానికి దక్షిణంగా సముద్రతీరం, లా జొల్లా సమూహప్రజలు, పసిఫిక్‌బీచ్, ఓషన్ బీచ్ ఉన్నాయి. శాన్‌డియాగో ఖాతం నుండి డౌన్‌డౌన్ వరకు ఉన్న ద్వీపకల్పం పాయింటు లోమా ఆక్రమించుకుని ఉంది. దక్షిణ శాన్‌డియాగో ఉండే సమూహాలు శాన్‌యాసిడ్రో, సంయుక్తరాష్ట్రాల సరిహద్దులలో మెక్సికోను ఓటే మెసా ఆనుకుని ఉంది. శాండియాగో ఖాతం మధ్య భాగంలో ఒక సన్నని భూభాగం ఈ ప్రాంతాన్ని మిగిలిన శాన్‌డియాగో నగరంతో కలుపుతూ ఉంది. శాన్‌డియాగో పరిసరప్రాంత భౌగోళిక సరిహద్దులను లోయలు ఎత్తుపల్లలతో నిండిన వీధుల తీరును ఇక్కడి ప్రజలు చక్కగా అర్ధం చేసుకున్నారు. 2008 నుండి " సిటీ విలేజ్" కాంసెప్టుతో నగరం సరిహద్దుల ముఖ్యత్వం సరిగా గుర్తించి నిర్వహిస్తున్నారు.

నగర రూపం

[మార్చు]

శాండియాగో ఒకప్పుడు ఓల్డ్ టౌన్ డిస్ట్రిక్ కేంద్రంగా చేసుకుని ఉండేది. 1860 తరువాత వాణిజ్య అభివృద్ధి సాధ్యం కాగదన్న విశ్వాసంతో నగర కేంద్రం సముద్రతీరంలో అభివృద్ధి చేయబడింది. జలాశయతీరాన అభివృద్ధి చేయబడిన ప్రస్తుత న్యూటౌన్ ప్రాంతం త్వరితగతిలో అభివృద్ధి కావడంతో ఓల్డ్ టౌన్ ప్రాముఖ్యత మరుగున పడింది.

శాన్‌డియాగో నిర్మాణాలు 300 అడిగులు ఎత్తును అధిగమించిన తరువాత 1927 లో నిర్మించబడిన అపార్ట్‌మెంట్ హోటెల్ 1927 నుండి 1963 వరకు అత్యంత ఎత్తు అయిన భవనంగా గుర్తింపు కలిగి ఉంది. తరువాత కాలంలో ఆకాశసౌధాల నిర్మాణం అధికం అయిన తరువాత ఎత్తు అయిన భవనాలుగా గుర్తించబడినవి యూనియన్ బ్యాంక్ ఆఫ్ కలిఫోర్నియా, సింఫోనీ టవర్. ప్రస్తుతం శాన్‌డియాగో ఎత్తు అయిన భవనంగా 1991లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న 500 అడుగుల ఎత్తు ఉన్న ఒన్ అమెరికన్ ప్లాజా గుర్తింపును కలిగి ఉంది. 1970లో ఫెడరల్ అవియేషన్ అడిమినిస్ట్రేషన్ భవనాల గరిష్ఠ ఎత్తు పరిమితిని 500 అడుగులుగా నిర్ణయించిన తరువాత డౌన్‌టౌన్ ఆకాశసౌధాలలో ఏవీ అత్యంత ఎత్తుగా నిర్మించబడలేదు. శాన్‌డియాగో డౌన్‌టౌన్ విమానాశ్రయానికి సమీపంలో ఉండడమే ఈ నిర్ణయానికి కారణం.

పగటి వేళలో శాండియాగో
పగటి వేళలో శాండియాగో
రాత్రి వేళలో శాండియాగో
రాత్రి వేళలో శాండియాగో

వాతావరణం

[మార్చు]
పబ్లిక్ బీచులో సర్ఫర్లు

అమెరికా వ్యవసాయ అనుకూల వాతావరణం ఉన్న పది నగరాలలో శాన్‌డియాగో వాతావరణం ఒకటి. అలాగే అత్యుత్తమ వేసవి వాతావరంం కలిగిన రెండు నగరాలలో ఒకటిగా వాతావరణ ప్రసార మాధ్యమాలు వర్ణిస్తున్నాయి. శాన్‌డియాగో వాతావరణం సముద్రతీర వాతావరణంగా పరిగణించబడుతుంది. ఉత్తరం సెమీ ఆరిడ్ దక్షిణంలో ఆరిడ్ వాతావరణం కలిగి ఉంటుంది. శాన్‌డియాగో పొడి, వెచ్చని వేసవి, స్వల్పమైన చలికాలం కలిగి ఉండి హిమపాతం మాత్రం డిసెంబర్, మార్చ్ మాసాల మధ్యకాలంలో ఉంటుంది. వర్షపాతం 9-13 అంగుళాలు ఉంటుంది.

దక్షిణ కాలిఫోర్నియా అధికభాగంలో ఉండేలా శాండియాగో నగరంలో వైధ్యమైన వాతావరణం కలిగి ఉంటుంది. అధికంగా భౌగోళికమైన వైవిధ్యం ఇందుకు ఒక కారణమని భావించబడుతుంది. " మే గ్రే /జూన్ గ్లూం " సమయంలో సముద్రతీరంలో 5-10 మైళ్ళ దూరం వరకు మందమైన నీటి ఆవిరి కమ్ముకుని ఉంటాయి. అయినప్పటికీ మేఘరహిత ప్రకాశవంతమైన వెలుగు ఉంటుంది. కొన్ని సమయాలలో ఈ పరిస్థితి జూన్ నుండి జూలై వరకు కొనసాగుతుంది. తరువాత నగరంలో రోజంతా ఆకాశాం మేఘావృతమై ఉంటుంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల వాతావరణం మాత్రం వైవిధ్యమైన ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ సూచనగా కాలిఫోర్నియా వాతావరణం 1950 నుండి 3 సెంటీగ్రేడ్ డిగ్రీలు అధికం అయింది.

బ్లాక్ బీచులో ఒక సర్ఫర్

సముద్రతీరంలో వర్షపాతం సంవత్సరానికి షుమారు 10 అంగుళాలు ఉంటుంది. సరాసరి వర్షపాతం 10.65 అంగుళాలు. అధికంగా వర్షపాతం చలికాలంలో ఉంటుంది. సాధారణంగా వర్షపాతం డిసెంబర్ నుండి మార్చ్ వరకు ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో మాత్రం 2 అంగుళాలు ఉంటుంది. అధికంగా మే మాసం నుండి సెప్టెంబర్ వాతావరణం వరకు పొడిగా ఉంటుంది. వర్షాకాలంలో భారీవర్షపాతం అధికంగా ఉంటుంది. శాండియగో ఎగువ ప్రాంతాలలో భారీవర్షపాతం ఉంటుంది. ఎగువప్రాంత వర్షపాతం సంవత్సరానికి 11-15 అంగుళాలవరకు ఉంటుంది. వర్షపాతంలో వైవిధ్యం అత్యధికంగా ఉంటుంది. 24 అంగుళాల వర్షపాతంతో నమోదైన అధిక వర్షపాత కాలం 1883/1884, 1940/1941. 1921 డిసెంబర్ మాసం అత్యంత అధికంగా వర్షపాతం 9.21 అంగుళాలు నమోదైంది.

శాండియాగో హిమపాతం అపురూపంగా మాత్రమే సంభవిస్తుంది. 150 సంవత్సరాలలో 4-5 మార్లు మాత్రమే హిమపాతం నమోదైంది. 1949, 1967 ఎగువప్రాంతాలైన లాజొల్లా, లోమా ప్రాంతాలలో మంచు భూమి మీద కొన్నిగంటలు మాత్రమే నిలిచింది. మిగిలిన మూడు పర్యాయాలు 1882,1946, 1946 లలో నమోదైంది. 1858 నుండి శాండియాగోలో అధికారికంగా ఉష్ణోగ్రత నమోదు చెయ్యడం మొదలైంది. 1958 నుండి 1940 వరకు అధికారిక వాతావరణ కార్యాలయం డౌన్‌టౌన్ భవనాలలో ఉంటూవచ్చింది. 1940 నుండి ఈ కాత్యాలయం లిండ్బర్గ్ ఫీల్డుకు మార్చబడింది.

పర్యావరణం

[మార్చు]
టారీ పైంస్ స్టేట్ పార్క్

మిగిలిన పలు దక్షిణ కాలిఫోర్నియా ప్రస్తుత శాన్‌డియాగో ప్రాంతంలోని భూభాగంలో ఒక విధమైన కరువును ఎదుర్కొనే పొదలతో నిండి ఉంటుంది. శాన్‌డియాగోలోని సముద్ర తీరం వెంట అంతరించి పోతున్న " టొర్రే పైన్ " వృక్షాలు విస్తరించిన పొదలతోచేరి విస్తారంగా ఉన్నాయి. నిటారుగానూ విభిన్నరీతిలో ఉండే శాన్‌డియాగో భూ అమరిక అలాగే సముద్రానికి సమీపంలో ఉండడం కారణంగా నగరపరిమితిలో పలు రకములైన వృక్షజాతులు కనిపిస్తుంటాయి. వీటిలో టైడల్ మార్ష్, కేన్యానులు ప్రధానమైనవి. నగరానికి దిగువ ప్రాంతాలలో విస్తారంగా ఉన్న చపరాల్, కోస్టల్ సాగా వంటి జాతికి చెందిన పొదలు కార్చిచ్చుకు కారణం ఔతున్నాయి. 20వ శతాబ్దంలో కార్చిచ్చు శాతం అధికం అయింది. ముఖ్యంగా ఈ కార్చిచ్చు అడవులు, నగర పొలిమేర ప్రాంతాలలో మొదలౌతాయి.

శాన్‌డియాగో విస్తారమైన నగరపరిమితిలో నగరం చుట్టూ పర్యావరణ పరిరక్షిత ప్రాంతాలు ఉన్నాయి. అవి వరుసగా టొర్రే పైన్స్, లాస్ పెనస్‌క్విటోస్ కేన్యాన్ ప్రిజర్వ్, మిషన్ ట్రైల్ రీజనల్ పార్క్. టొర్రే పైన్స్ స్టేట్ రిజర్వ్, కోస్టల్ స్ట్రిప్ ఉత్తర సముద్రతీరంలో ఉన్నాయి. ఇక్కడ పలుజాతులకు చెందిన పైన్ వృక్షాలు ఉన్నాయి.

కార్చిచ్చు పొగలో శాన్ డియాగో ఆకాశ సౌధాలు

నిటారుగా ఉండే భూ ఆకృతి కారణంగా భవననిర్మాణాలు పర్యావరణ సంరక్షణకు ఆటంకం కలిగించలేదు. నగరపరిమితిలో ఉన్న పలు లోయలు పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నాయి. క్లిమెన్ కేన్యాన్‌యాన్‌లో స్విజ్జర్ కేన్యాన్, టెల్‌కాం కేన్యాన్ నేచురల్ పార్క్, మార్టిన్ బియర్ మెమోరియల్ పార్కులు ఉన్నాయి.

సంయుక్త రాష్ట్రాలలో అంతరింవి పోతున్న పలుజాతి మొక్కలు, జంతివులు శాన్‌డియాగో కౌంటీలో ఉన్నంతగా మరెక్కడాలేవని భావిస్తున్నారు. వైద్య్యత కలిగిన వాతావరణంపసిఫిక్ మహాసముద్ర సామీప్యత కారణంగా ఈ పరిసరాలలో ఇతర ప్రాంతాలకంటే అత్యధికంగా లభించిన ఆకాశమార్గం 492 రకాల పక్షజాతులు కనిపిస్తున్నాయి. అడ్‌బర్న్ సొసైటీ నిర్వహిస్తున్న క్రిస్ట్‌మస్ బర్ద్ కౌంట్ ఉత్సవంలో అత్యధిక సంఖ్యలో పక్షి జాతులను పరిశీలిస్తుంటారు. అధికపక్షిజాతుల పరిశీల చేయడంలో ఇత్రప్రాంతాల కంటే శాడియాగో ప్రథమ స్థానంలో ఉంది.

శాన్‌డియాగో, ఇక్కడి బాక్ కౌంటీ కార్చిచ్చు అధికంగా జరిగేప్రాంతంగా గుర్తించబడింది. 2003లో శాన్‌డియాగో సిడార్‌ఫైర్ సంభవించింది. గత శతాబ్దంలో కాలిఫోర్నియాలో సంభవించిన కార్చిచ్చులో ఇది పెద్దదని భావించబడుతుంది. ఈ కార్చిచ్చులో 2,80,000 ఎకరాల అడవి, 15 మంది ప్రజల ప్రాణాలు, 2,200 ఇళ్ళు అగ్నికి ఆహుతి అయ్యాయి. అదనంగా ఈ మంటల వలన ఉత్పన్నమైన పొగ శ్వాశసంబంధిత సమస్యలు, ఆస్తమా, కళ్ళమంట, పొగలోనికి పోవుట వంటి ఆరోగ్యసమసయలతో ఎమర్జెన్సీ వార్డులకు పేషంట్ల రాక అధికం చేసింది. వాయుకాలుష్యం కారణంగా శాన్‌డియాగో కౌంటీ పాఠశాలలు ఒక వారం మూతబడ్డాయి. నాలుగు సంవత్సరాల తరువాత కార్చిచ్చు రాంచో బెర్నాడో, రాంచో శాంటా ఫీ, రొమానా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను నాశనం చేసింది.

గణాంకాలు

[మార్చు]
హిస్పానిక్ అమెరికన్ హెరిటేజ్ మంత్రి

2000 జనాభాలెక్కలను అనుసరించి నగర జనాభా 12,23,400. వీరిలో గృహస్థుల సంఖ్య 4,50,691. నగరంలో 2,71,315 కుటుంబాలు నివసిస్తున్నారు. 2008 నాటికి 12,79,329 మంది ఔతారని అప్పుడు అంచనా వేయబడింది. ఒక చదరపు మైలు జన సాంద్రత 3,771.9. మొత్తం 4,51,126 జనాభాలో 30.2% మంది 18 సంవత్సరాల లోపు వారు. 44.6% కుటుంబాలుగా నివసిస్తున్న వివాహితులు. భర్త లేకుండా ఒంటరిగా జీవితం సాగిస్తున్న స్త్రీలు 11.4%. కుటుంబాలు లేకుండా నివసిస్తున్న వారి శాతం 39.8%. ఒంటరిగా జీవిస్తున్న గృహస్థుల శాతం 28%. 65 సంవత్సరాల పైబడి ఒంట్రి జీవితం అనుభవిస్తున్న వారి శాతం 7.4%. వీరిలో కొంత మంది ఒంటరి జీవితం అనుభవిస్తురు. సరాసరి గృహస్థు జనసంఖ్య 2.61. సరాసరి కుటుంబ జన సంఖ్య 3.3.

అమెరికన్ కమ్యూనిటీల అంచనా

[మార్చు]

2006-2008ల మధ్య అమెరికన్ కమ్యూనిటీ అంచనా అనుసరించి 67.4% ప్రజలు శ్వేతజాతీయులు. వీరిలో హిస్పానిక్ ప్రజలు కాని వారి శాతం 48.2%. ఆఫ్రికన్ అమెరికన్లు, నల్ల జాతీయుల శాతం 6.7%. స్థానికుల శాతం 0.7%. 14.7% ఆషియన్లు. స్థానిక హవాయిన్లు, పసిఫిక్ ద్వీపవాసుల శాతం 0.4%.ఇతర జాతీయుల శాతం 6.5%. మిశ్రమ జాతీయులు 3.6%. హిస్పానిక్ లేక లాటినోస్ ఇతరులు కలిసి జనాభాలో 27.3% ఉన్నారు.

ఇతర అంచనాలు

[మార్చు]

శాన్ డియాగో అసీసియేషన్ ఆఫ్ గవర్నమెంట్స్ అంచనాలు అనుసరించి 2008 జనవరి 1 తారాఖున శాన్ డియాగో నగర 13,36,865. 2000 నాటి జనసంఖ్య కంటే 9.3% అధికం. జనాభాలో హిస్పానికులు కాని శ్వేతజాతీయుల శాతం 45.3%. హిస్పానికుల శాతం 27.7%. 15.6% ఆసియన్లు/పసిఫిక్ ద్వీపవాసులు. నల్లజాతీయులు 7.1%, 0.4% అమెరికన్ ఇండియన్లు, ఇతర జాతులు 3.9%, హిస్పానికుల వివాహ వయసు సరాసరి 27.5%, నగర సరాసరి వివాహ వయసు 35.1 కాగా హిస్పానికులు కాని శ్వేతజాతీయుల సరాసరి వివాహ వయసు 41.6. 18 సంవత్సరాలకు లోబడిన వారిలో హిస్పానికులు అత్యధికం. హిస్పానికులు కాని శ్వేతజాతీయులలో 63.1% ప్రజలు 55 వయసు పైబడిన వారే.

నేరం

[మార్చు]

అమెరికాలోని మిగిలిన మహానగరాలతో పోలిస్తే శాన్ డియాగో నగరంలో 1990 నుండి 2000వరకు నేరాల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. 2000 నుండి 2004 నాటికి నేరాల సంఖ్య కొద్దిగా పెరిగింది. తక్కువ నేరాల స్థాయి కలిగిన అమెరికా నగరాల మధ్య శాన్ డియాగో నగర నేరాల సంఖ్య ఆరవ స్థానంలో ఉంది. ఒక వైపు దౌర్జన్య సంబంధిత నేరాలు 12.4% శాతం తగ్గు ముఖం పట్టినా సంపద సంబంధిత నేరాల సంఖ్యలో 1.1% శాతం పెరుగుదల కనిపించింది. అయినా అమెరికా నగరాల మొత్తం సంపద సంబంధిత నేరాల సంఖ్యలో శాన్ డియాగో నగర నేరాల సంఖ్య తక్కువగానే ఉంటుంది.

ఆర్ధిక రంగం

[మార్చు]
స్పేస్ అండ్ నావల్ వార్ ఫేర్ సిస్టం కమాండ్

శాన్ డియాగో నగర ఆర్థిక వనరులలో అతి ముఖ్యమైనవి రక్షణ వ్యవస్థ, వస్తుతయారీ రంగం, పర్యాటక రంగం. రక్షణ రంగానికి చెందిన యు.ఎస్ నేవీ పోర్ట్, మేరిన్ కార్ప్‌, కోస్ట్ గార్డ్ స్టేషనులు. మేరిన్ కార్ప్ ఎయిర్ స్టేషను మిరామర్, మారిన్ కార్ప్ రిక్రూట్ డిపోట్ లాంటి యుద్ధ శిక్షణా కేంద్రాలు శాన్ డియాగో నగరంలో ఉన్నాయి. నావికాదళానికి ఈ నగరంలో అనేక శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. నావల్ బేస్ పాయింట్ లోమా, నావల్ బేస్ శాన్ డియాగో, బాబ్ విల్సన్ నావల్ హాస్పిటల్, స్పేస్ అండ్ నావల్ వెల్ఫేర్ సిస్టమ్ సెంటర్ శాన్ డియాగో వీటిలో ముఖ్యమైనవి. శాన్ డియాగో నగర సామీప్యంలో శాన్ డియాగో కౌంటీలో చేరిన ప్రదేశంలో ఉన్న నావల్ ఆమ్‌ఫిబియస్ కొరొనాడో, నావల్ ఎయిర్ స్టేషను నార్త్ ఐలాండ్ లచే నడుపబడుతున్న నావల్ ఏక్సిల్లరీ లాండింగ్ ఫెసిలిటీ శాన్ క్లైమేట్ ఐలాండ్, సిల్వర్ స్ట్రాండ్ ట్రైనింగ్ కాంప్లెక్స్, ఔట్ లైయింగ్ ఫీల్డ్ ఇంపీరియల్ బీచ్ నడుప బడుతున్నాయి. శాన్ డియాగో నగరంలో నావల్ అవియేషన్ ఆరంభించబడినప్పటికీ తరువాతి కాలంలో ఫ్లోరిడాకు చెందిన పెన్సకోలా ప్రథమ స్థానానికి చేరుకుంది. శాన్ డియాగో నగరం నావికాదళ నౌకల సంఖ్య ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.

శాన్ డియాగో మీద ఎగురుతున్న ఎఫ్-ఏ 18

శాన్ డియాగో నగరం నావికా దళ బలం అత్యధికంగా కేంద్రీకృతమైన ప్రపంచ నగరాలలో మొదటి స్థానంలో ఉంది. నిమిత్ క్లాస్‌కు సూపర్ కారియర్స్ చెందిన యు.ఎస్ నిమిత్, యు.ఎస్ రోనాల్డ్ రీగన్, అయిదు ఆమ్‌ఫిబియస్ అసల్ట్ షిప్స్, అలాగే లాస్ ఏంజెలస్ క్లాస్ ఫాస్ట్ అటాక్ సబ్‌మెరీనులు, ది హాశ్పిటల్ షిప్ యు.ఎస్.ఎన్.ఎస్ మెర్సీ, కారియర్స్, సబ్‌మెరీన్ టెండర్స్, డిస్ట్రాయర్స్, క్రూసీస్, ఫ్రిగేట్స్, అనేక చిన్న చిన్న నావలకు ఇది జన్మ స్థానం. యు.ఎస్ నావికాదళ వెసెల్స్ నాల్గింటికి ఈ నగరానికి గౌరవ సూచకంగా యు.ఎస్.ఎస్ శాన్ డియాగో అని నామకరణం చేయాలని నిర్ణయించారు. శాన్ డియాగో నగరంలో స్థాపించబడిన క్వాల్ కమ్ ఇన్‌కార్పొరేటెడ్ పరిశ్రమ ఇక్కడ తమ ప్రధాన కార్యాలయం నడిపిస్తూ వైర్ లెస్ టెక్నాలజీని ఉపాయోగించి సమాచార సాధనాల తయారీలో ముందజలో ఉంది. క్వాల్ కమ్ కర్మాగారం నగరంలో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న ఏకైక ప్రైవేట్ ప్రైవ్ట్ యాజమాన్య పరిశ్రమగా పేరుగాంచింది. వెబ్ సెన్స్ అనే సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ శాన్ డియాగోలోని అతి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీగా శాన్ డియాగో బిజినెస్ జనరల్ పత్రిక పేర్కొంది. శాన్ డియాగో పశ్చిమ తీరాన ఉన్న రేవు సబ్ మెరీన్, నౌకా నిర్మాణ పరిశ్రమ అలాగే ప్రపంచంలోని అతి పెద్ద నౌకాదళం కలిగి ఉండడంతో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉండి నగర ఆర్థికరంగాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. సైనిక దళంగా శాన్ డియాగో ప్రాధాన్యత సంతరించుకున్న తరుణంలో అనేక సైనిక వస్తు తయారీ ఒప్పంద దారులు శాన్ డియాగోను తమ ప్రధాన కేంద్రంగా చేసుకుని పని చేయసాగారు. వారిలో ముఖ్యమైన సంస్థలు జనరల్ ఆటోమిక్స్, నాస్కో (NASSCO).

పర్యాటక రంగం

[మార్చు]
శాన్ డియాగో డౌన్ టౌన్

శాణ్ డియాగో నగరం అనేక ప్ర్యాటక ఆకర్షణలు కలిగిన ప్రదేశంగా పేరెన్నిక కలిగిన నగరం. అహ్లాదకరమైన నగర వాతావరణం, సుందర సముద్ర తీరాలు, బాల్బొరా పార్క్, బెల్‌మోన్ట్, అమ్యూజ్‌మెంట్ పార్క్, శాన్ డియాగో జూ, శాన్ డియాగీ వైల్డ్ నిమల్ పార్క్, సీ వరల్డ్ లాంటివి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. స్పానిష్ సంస్కృతి ప్రభావం నగరంలో విశేషంగా చోటు చేసుకున్న కారణంగా నగరంలో అనేక చారిత్రక ప్రాధాన్యమున్న ప్రదేశాలు దర్శనమిస్తాయి. కామిక్ కోన్, ది బక్ ఇన్విటేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్, ది శాన్ డియాగో/ డెల్ మార్ ఫెయిర్, శాన్ డియాగో బ్లాక్ ఫిల్మ్ ఫెస్టివల్, స్ట్రీట్ మ్యూజిక్ ఫెస్టివల్ వాటిలో కొన్ని. 2009 శాణ్ డియాగో కౌంటీ 30 మిలియన్ల అతిథులకు ఆతిథ్యం ఇచ్చింది. వారిలో సగం మంది నగరంలో ఒక రాత్రి కూడా బస చేసిన వాళ్ళు. సగం మంది పగటి సమయం మాత్రమే ఉండి వెళ్ళిన సందర్శకులు. వారు నగరంలో 8 బిలియన్ డాలర్లు నగరంలో ఖర్చు చేసినట్లు అంచనా. కలిఫోర్నియా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్న శాన్ డియాగో క్రూసీ పరిశ్రమ మాత్రమే కొనుగోలు చేస్తున్న ఆహారం, చమురు (ఆయిల్ లేక పెట్రోల్), నిర్వహణ సేవలకు 2 మిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు అంచనా. 2008లో రేవు 250 మార్లు నౌకలను నడిపినట్లు అంచనా. ఈ నౌకలలో ప్రయాణం చేసిన వారి సంఖ్య 8,00,000. శాన్ డియాగో కాన్‌వెన్‌షన్ సెంటర్ 68 కంటే అధికంగా జరిగిన సమావేశాలకు ఆతిధ్యం, ట్రేడ్ షోస్ ద్వారా 6,00,000 మందిని ఆకర్షించినట్లు అంచనా.

పరిశోధన

[మార్చు]
శాండియాగో డౌన్ టౌన్

శాన్ డియాగో లోని కొన్ని ప్రదేశాలలో బయోటెక్నాలజీ సంబంధిత పరిశోధన సౌకార్యాలున్న ప్రధాన కార్యాలయాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకంగా ఇవి లా జొలా, సొరన్టో వ్యాలీలో అధికం. న్యూరోక్రై బయోసైన్సెస్, న్వెంటా బయోఫార్మాస్యూట్యైకల్స్ వంటి బృహత్‌టెక్నాలజీ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలు శాడియాగోలో నిర్వహిస్తున్నాయి. అలాగే ఒక వైపు బి.డి బయో సైన్సెస్, బయోజెన్ ఐడెక్, ఇంటిగ్రేటెడ్ డి ఎన్ ఎ టెక్నాలజీస్, మెర్క్, పి ఫైజర్, ఎలాన్, జెనిమ్, సిటోవెన్స్, సెల్‌జెనె, , వర్టెక్స్ వంటి సంస్థలు ఇక్కడ కార్యాలయాలు లేక పరిశోధనా సౌకర్యాలు అందిస్తున్నాయి. అలాగే లాభాపేక్ష లేని బయోటెక్, హెల్త్ కేర్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా తమ కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయి. వాటిలో సిల్క్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ స్టడీస్, ది స్క్రిప్స్ రీసెర్చ్ ఇస్టిట్యూట్, ది వైర్‌లెస్ హెల్త్ ఇన్‌స్టిట్యుట్, శాన్‌ఫోర్డ్ బర్న్‌హామ్ ఇన్‌స్టుట్యూట్ ముఖ్యమైనవి. ఇవి కాక శాన్ డియాగోలో 140 ఒప్పంద పరిశోధనా ఆర్గనైజేషన్స్ ప్రాంతీయ హెల్త్ సైన్స్ సంస్థలకు ఒప్పంద తరహా సేవలను అందిస్తున్నాయి. యూనివర్స్టీ ఆఫ్ కలిఫోర్నియా, శాన్ డియాగో, ఇతర పరిశోధనా సంస్థలు ఫ్యూయల్ బయోటెక్నాలజీ అభివృద్ధికి సహకరిస్తున్నాయి. 2004లో మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ శాన్ డియాగో నగరాన్ని అమెరికాలోనే ప్రథమశ్రేణి బయోటెక్ టెక్నాలజీ కంపెనీల సమాహారంగా పేర్కొన్నది. 2009లో సుమారు 1940 పూర్తి సమయ ఉద్యోగులు శాన్ డియాగో/కార్ల్స్‌బాడ్/శాన్ మార్కోస్ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు అంచనా. వారు ఒక సంవత్సరానికి వేతన రూపంలో 48,270 అమెరిక డాలర్లు, వైద్య ఇతర అలవెన్స్ రూపంలో 46,500 డాలర్లు సంపాదిస్తున్నట్లు అంచనా.

నిర్మాణ రంగం

[మార్చు]
క్వాల్ కం హెడ్ క్వార్టర్స్
శాన్ డియాగో లోని లాజొలా విలేజ్ ఆకాశసౌధాలు

2006 ముందు శాన్‌డియాగో భవన నిర్మాణరంగంలో అద్భుత అభివృద్ధిని సాధించింది. కొన్ని సమయాలలో నవాసగృహాల కొరతను హౌసింగ్ అఫోడబిలిటీ క్రైసిస్గా వర్ణించారు. 1998, 2007 మధ్య కాలంలో గృహాల ధరలు సుమారు మూడింతలు అయ్యంది. కలిఫోర్నియా అసోసియేషన్ రియల్టర్స్ గణాంకాలను అనుసరించి 2007మే సమయానికి శాన్ డియాగో నగరంలో ఒక గృహం ధర 6,12,370 అమెరికన్ డాలర్లు. కాని వేతన అభివృద్ధి మాత్రం అంత అభివృద్ధి చెంద లేదు. తలసరి ఆదాయానికి అందుబాటులో లేని విధంగా నివాస గృహాలు ధరలు కలిగిన నగరాలలో శాన్ డియాగో అమెరికాలో రెండవ స్థానంలో ఉంది. పర్యవసానంగా శాన్ డియాగో నగరానికి 2004 నుండి వ్యతిరేక వలసల విధాన అనుభవం ఎదురైంది. గుర్తించ తగిన సంఖ్యలో ప్రజలు బజ కలిఫోర్నియా, రివర్‌సైడ్ కౌంటీ లకు తరలి వెళ్ళారు. టిజ్యూనా, టెమెక్యులా, మురీటా ప్రదేశాల నుండి శాన్ డియాగో నగరానికి ఉద్యోగ నిమిత్తం వస్తూపోతుంటారు. 2005 నుండి 2007 శాన్ డియాగో నగర నివాస గృహాల ధర 15% వరకూ తగ్గింది. తగ్గు ముఖం 2008 నాటికి మరింత వేగాన్ని పుంజుకుంది. ఈ తగ్గుదలకు ముఖ్య కారణం నిర్మాణ వ్యవస్థ షేర్ల ధర తగ్గటమే అని ఊహించబడింది. నిర్మాణరంగంలోని ఈ అస్థవ్యస్థ పరిణామాల వలన అనేక మంది తమ తమ ఆస్థులను కోల్పోవలసిన పరిస్థితి ఎదురైంది.

అధిక ఉపాధి కల్పించిన వారి జాబితా

[మార్చు]

విద్య

[మార్చు]

శాన్ డియాగో సిటీ స్కూల్స్ అని పిలవబడే శాన్ డియాగో యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ 113 ప్రాథమిక పాఠశాలలు, 23 మిడిల్ స్కూల్స్, 10 ఆల్టర్నేటివ్ స్కూల్స్, 27 మాధ్యమిక పాఠశాలలు, 25 చార్టర్ స్కూల్స్ మొదలైన వాట్ని సమర్ధవంతగా నిర్వహిస్తూ నగరంలోని అత్యధికులకు విద్యను అందిస్తున్న ఒకే ఒక పెద్ద విద్యాసంస్థ. కౌంటీ ఉత్తర భాగంలోని పౌల్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్, శాన్ డియాగిటోయూనియన్ ఉన్నత పాఠశాల డిస్ట్రిక్ నగర సరి హద్దుల నుండి నగరంలో అనేక పాఠశాలలను నిర్వహిస్తూ సేవలందిస్తున్నాయి. అలాగే నగర దక్షిణ భాగంలో ఉంటూ నగరంలో అనేక పాఠశాలల నిర్వహిస్తూ స్వీట్ వాటర్ యూనియన్ ఉన్నత పాఠశాల డిస్ట్రిక్ తన విసేష సేవలను శాన్ డియాగో నగరవాసులకు అందిస్తుంది.

కళాశాలలు విశ్వవిద్యాలయాలు

[మార్చు]
శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీ హార్పనర్ హాల్

అమెరికా జనాభా గణాంకాలను అనుసరించి 25 దానికి పైబడిన వయసున్న శాన్ డియాగో నగర యువకులలో 40.4% ఉన్నత విద్యాభ్యాస డిగ్రీలు పొంది ఉన్నారని పేర్కొన్నది. అత్యధిక విద్యావంతులు కలిగిన అమెరిక నగరాలలో శాన్ డియాగో తొమ్మిదవ స్థానంలో ఉంది. నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వరుసగా శాన్డియాగో స్టేట్ యూనివర్సిటీ (ఎస్.ఎస్.యు, యూనివర్శిటీ ఆఫ్ కలిఫోర్నియా, శాన్ డియాగో (యు.సి.ఎస్.డి), శాన్ డియాగో కాలేజ్ డిస్ట్రిక్ అనుబంధ సంస్థలైన శాన్ డియాగో సిటీ కాలేజ్, శాన్ డియాగో మెస కాలేజ్, శాన్ డియాగో మిరామర్ కాలేజ్ తమ వంతు విద్యా సేవలను అందిస్తున్నాయి. ప్రైవేట్ యాజమాన్య విద్యా సంస్థలు వరుసగా యూనివర్శిటీ ఆఫ్ శాన్ డియాగో, పాయింట్ లోమా నజరనె యూనివర్శిటీ, అలియంట్ ఇంటర్‌నేషనల్ యూనివర్శిటీ, నేషనల్ యూనివర్శిటీ, శాన్ డియాగో క్రిస్టియన్ కాలేజ్, జాన్ పౌల్ ది గ్రేట్ కాధలిక్ యూనివర్శిటీ, కోల్ మాన్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ రెడ్ లాండ్స్ వారి బిజినెస్ స్కూల్స్, డిజైన్ స్కూల్స్ ఆఫ్ శాన్ డియాగో, శాన్ డియాగో ఆవరణలో ఉన్న ఫాషన్ డిజైనింగ్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చెంటైజింగ్, న్యూ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, శాన్ డియాగో ఆవరణలో ఉన్న పసిఫిక్ ఓక్స్ కాలేజ్, చాంపన్ యూనివర్శిటీ, ది ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ , సదరన్ స్టేట్స్ యూనివర్శిటీ, వుడ్‌బరీ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ శాటిలైట్ కాంపస్లు ఉన్నాయి. నగరంలో యు.ఎస్.ఎస్.డి స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనే వైద్య కళాశాల నగరవాసులకు వైద్య విద్యను అందిస్తుంది. నగరంలో ఎ.డి.బి అక్రిడైటెడ్ లా స్కూల్ దాని అనుబంధ విద్యాసంస్థ అయిన కలిఫోర్నియా వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ లా, థామస్ జెఫర్సన్ స్కూల్ ఆఫ్ లా న్యాయ శాస్త్రా బోధన చేస్తున్నాయి. నగరంలో లాభాపేక్ష లేని న్యాయవిద్యాశాల వెస్ట్రన్ సెర్రా లా స్కూల్ నగర వాసులకు విద్యా సేవలందిస్తుంది.

గ్రంథాలయాలు

[మార్చు]
శాన్ డియాగో జీసెల్ గ్రంథాలయం

నగరంలో శాన్ డియాగో పబ్లిక్ లైబ్రరి తో చేరి అనేక గ్రంథాలయాలు ఉన్నాయి. శాన్ డియాగో డౌన్ టౌన్‌లో ప్రధాన కార్యాలయంతో నగరమంతా అనేక శాఖలు ఉన్న శాన్ డియాగో మునిసిపల్ లైబ్రెరి నగరవాసులకు సేవలందిస్తుంది. 2006లో నగరం 2.7 మిలియన్ల అమెరిక డాలర్లను గ్రంథాలయ అభివృద్ధికి వెచ్చించింది. అవి కాక మాల్‌కమ్ ఎ లవ్ లైబ్రెరి, జియోసెల్ లైబ్రెరి ఉన్నాయి.

సంస్కృతి

[మార్చు]
మ్యూజియం ఆఫ్ మాన్

శాన్ డియాగోలోఅనేక ప్రసిద్ధి చెందిన మ్యూజియములు ఉన్నాయి. అవి వరుసగా బల్బో పార్క్‌లో ఉన్న శాన్ డియాగో మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్, శాన్ డియాగో నేషనల్ హిస్టరీ మ్యూజియమ్, మ్యూజియమ్ ఆఫ్ ఫోటో గ్రాఫిక్ ఆర్ట్స్ , లా జొలాలో సముద్రతీర భవనంలో ది మ్యూజియమ్ ఆఫ్ కాంటెంపరరీ ఆర్ట్ శాన్ డియాగో ఉంది దీనికి అనుబంధిత మ్యూజియమ్ శాంటా ఫి డిపోట్ డౌన్‌టౌన్లో ఉంది. ది కొలంబియా డిస్ట్రిక్ డౌన్ టౌన్‌లో శాన్ డియాగో మారీటైమ్ మ్యూజియమ్కు చెందిన చారిత్రక నౌకా ప్రదర్శన శాల ఉంది. ఇక్కడ స్టార్ ఆఫ్ ఇండియా అనే ప్రసిద్ధి చెందిన నౌక, యు.ఎస్.ఎస్ మిడ్‌వే సంస్థ విజయాలను వివరించే శాన్ డియాగో ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ మ్యూజియమ్లు ఉన్నాయి. నగరంలో కళారంగంలో గుర్తించ తగిన అభివృద్ధి కొనసాగుతోంది. ప్రత్యేకంగా లిట్టిల్ ఇటలీలో చిన్న చిన్న ప్రదర్శన శాలల ద్వారా శుక్రవార రాత్రి సమయాలలో కళా రూపక్పలన సంబధిత ప్రదర్శనలను నిర్వహించబడుతుంటాయి. నార్త్ పార్క్‌లో రే ఎట్ నైట్వివిధ రకాల చిన్న బడ్జెట్ కళాప్రదర్శనలు ప్రతి మాసం రెండవ శని వారం నిర్వహిస్తుంది.

లా జొలా, సమీపంలోని సొలానా బీచ్‌లో అనేక విధాల కళాప్రదర్శనలు జరుగుతుంటాయి. జిన్‌హా లింగ్ దర్శకత్వంలో సింఫోనీ టవర్స్‌లో ది శాన్ డియాగో సింఫోనీ ప్రదర్శనలు తరచూ జరుగుతుంటాయి. అలాగే సివిక్ సెంటర్ ప్లాజాలో లాన్ కేంప్‌బెల్ దర్శకత్వంలో శాన్ డియాగో ఒపేరా ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఈ ప్రదర్శనలను ఒపేరా అమెరికాచేత అమెరికాలోని 10 అత్యున్నత ఒపేరా ప్రదర్శనలలో ఒకటిగా గుర్తింపు పొందింది. బాల్‌బో పార్క్‍లో ఉన్న ఓల్డ్ గ్లోబ్ దియేటర్ సంవత్సరానికి 15 మ్యూజిక్ ఆల్బమ్స్, నాటకాలను తయారు చేస్తుంది. యు.సి.ఎస్.డి లోని లా జొలా ప్లే హౌస్‌లో క్రిస్టోఫర్ దర్శకత్వంలో ప్రపంచ ప్రఖ్యాత నాటక, సంగీత ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఓల్డ్ గ్లోబ్ ప్లే హౌస్, లా జొలా ప్లే హౌస్ నిర్మిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ నాటకాలు సంగీత ప్రదర్శనలు అత్యుత్తమ స్థాయికి చెందినవి. ఇవి టోనీ అవార్డ్ పోటీలలో ప్రదర్శించటానికి ప్రతిపాదించడమే వీటి నాణ్యతకు దక్కిన ప్రత్యేక గుర్తింపు. క్రాక్ సెంటర్‌‌లో ఉన్న ది జాన్ క్రాక్ దియేటర్ 600 సీట్ల సామర్ధ్యంతో నృత్య, సంగీత ప్రదర్శనలను నిర్వహిస్తుంది. హార్టన్ ప్లాజాలో ఉన్న లిస్యూమ్ దియేటర్స్ వద్ద ఉన్న శాన్ డియాగో రిపోర్టరీ దియేటర్ అనేక విధములైన సంగీత, నాటకాలను నిర్మిస్తుంది. ఇంకా దియేటరీ తయారీలను వృత్తిపరంగా చేస్తున్న లిరిక్ ఒపేరా శాన్ డియాగో, స్టార్ లైట్ మ్యూజికల్ దియేటర్ మొదలైనవి నగర వాసులను కళాత్మక ప్రదర్శనలతో మనసును ఆహ్లాద పరుస్తున్నాయి. వందలాది చిత్రాలు, దజన్ల కొద్దీ టి.వి షోలు శాన్ డియాగోలో చిత్రీకరించబడుతున్నాయి.

క్రీడా రంగం

[మార్చు]
క్వాల్ కాం స్టేడియమ్

క్వాల్‌కం స్టేడియంలో " ది నేషనల్ లీగ్స్ బేస్‌బాల్స్ శాన్‌డియాగో క్రీడలు నిర్వహించబడ్డాయి. ఇక్కడ 3 ఎన్.ఎఫ్.ఎల్ క్రీడలు నిర్వహించబడ్డాయి. పెట్కో పార్క్‌లో ఎన్.ఎఫ్.ఎల్ సూపర్ బౌల్ చాంపియన్ షిప్ క్రీడలు నిర్వహించబడ్డాయి. 2006-2009 లలో " వరల్డ్ బేస్‌బాల్ క్లాసిక్ " క్రీడలలో కొన్ని భాగాలు నిర్వహించబడ్డాయి. " ఎన్.సి.ఎ డివిషన్ 1 శాన్‌డియాగో స్టేట్ అజ్టెక్ " మహిళల, పురుషుల ఫుట్‌బాల్, సాకర్, బాస్కెట్ బాల్, వాలీబాల్ క్రీడలు టొరెరో స్టేడియం, ది జెన్నీ క్రియాగ్ లో నిర్వహించబడ్డాయి.

పెట్కో పార్క్

శాన్‌డియాగో స్టేట్ అజ్టెక్ (ఎం.డబల్యూ.సి), " ది యూనివర్సిటీ ఆఫ్ శాన్‌డియాగో టొరెరోస్ " (డబల్యూ.సి.సి) లు ఎన్.సి.సి.ఎ డివిషన్ 1 బృందాలు. ది యు.సి.ఎస్.డి ట్రిటోంస్ (సి.సి.ఎ.ఎ)లు ఎన్.సి.ఎ.ఎ డివిషన్ 2 సభ్యులు. ది పాయింట్ లోమా నజారెనె సీ లైయింస్, శాన్‌డియాగో క్రిస్టియన్ కాలేజ్ (జి.ఎస్.ఎ.సి)లు " ది ఎన్.ఎ.ఐ.ఎ" సభ్యులు.

క్వాల్‌కం స్టేడియం కూడా ఎన్.సి.ఎ డివిషన్ 1 ఆజ్టెక్, ఉన్నత పాఠశాల ఫుట్‌బాల్ చాంపియన్ షిప్పులు, సూపర్ క్రాస్ ఈవెంటులకు వేదిక. ఇక్కడ రెండు కాలేజ్ ఫుట్‌బాల్ ఆన్యుయల్ బౌల్ క్రీడలు నిర్వహించబడ్డాయి. 1994లో స్థాపించబడిన నగర మొదటి స్టేడియం అయిన బాల్‌బోయా స్టేడియంలో " ది హాలిడే బౌల్ అండ్ పాయిన్‌సెట్టియా బౌల్, సాకర్, అమెరికన్ ఫుట్‌బాల్, ట్రెక్ అండ్ ఫీల్డ్ క్రీడలు నిర్వహించబడ్డాయి.

నగరంలో అభివృద్ధిచెందుతున్న క్రీడా సంస్థలలో ఒకటి " రగ్బీ యూనియన్ ". నగరంలో 2007-2009 లలో ప్రధానమైన రగ్బీ క్రీడా ఉత్సవం " ది యు.ఎస్.ఎ సెవెంస్ " నిర్వహించబడింది. యు.ఎస్.ఎ లో " ఓల్డ్ మిషన్ బీచ్ అథ్లెటిక్ క్లబ్ (ఆర్.ఎఫ్.సి) నిర్వహిస్తున్న " ది రగ్బీ సూపర్ లీగ్ " నిర్వహిస్తున్న 16 నగరాలలో శాన్‌డియాగో ఒకటి.

ప్రసార మాధ్యమం

[మార్చు]
ఎన్.బి.సి శాన్ డియాగో

ఇవి కూడా చూడండి: శాన్ డియాగోలో సెట్ మీడియా జాబితా నగరంలో ప్రచురించబడుతున్న పత్రికలు వరుసగా ది డైలీ న్యూస్ పేపర్, యుటి శాన్ డియాగో, దాని యొక్క ఆన్ లైన్ పోర్టల్, ప్రత్యామ్నాయ వార్తా వారపత్రికలు వరుసగా శాన్ డియాగో సిటీబీట్, శాన్ డియాగో రీడర్. శాన్ డియాగో యొక్క ఉత్తర కౌంటీ ప్రాంతంలో పంపిణీ చేయబడుతున్న మరొక వార్తాపత్రిక నార్త్ కౌంటీ టైమ్స్ ఉంది. నగరంలో శాన్ డియాగో యొక్క వాయిస్ ప్రభుత్వం, రాజకీయాలు, విద్య, ఇరుగుపొరుగు, కళల సమాచారం అందించే లాభాపేక్ష లేని ఆన్లైన్ ఆధారిత వార్తల షాప్ ఉంది. నగరంలో ప్రచురించబడుతున్న వ్యాపార ఆధారిత దినపత్రిక "శాన్ డియాగో డైలీ ట్రాన్స్క్రిప్ట్ ".

శాన్ డియాగో నీల్సన్ అంతర్జాల గణాంకాల ప్రకారం బ్రాడ్బ్యాండ్ విస్తరణ కారణంగా 2004 లో స్థానిక మార్కెట్లలో 69.6 శాతం సంయుక్త అభివృద్ధికి దారితీసింది. శాన్ డియాగో యొక్క మొదటి టెలివిజన్ కె ఎఫ్ ఎం బి స్టేషను ప్రసారాలు 1949 మే 16 న ప్రసారం ప్రారంభం అయ్యాయి. పెద్ద నగరం అయిన లాస్ ఏంజిల్స్కు సమీపంలో ఉన్న కారణంగా లాస్ ఏంజిల్స్ నుండి ప్రసారమౌతున్న ఏడు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) నుండి టెలివిజన్ స్టేషన్లు లైసెంస్ అనుమతి పొందిన ఏడు దూరదర్శన్ ప్రసారాలు అలాగే శాన్ డియాగో నగరంలో రెండు వి హెచ్ ఎఫ్ ఛానల్స్ నగర వాసులకు అందుబాటులో ఉన్నాయి. 1952 లో ఎఫ్.సి.సి శాన్ డియాగో వంటి నగరానికి టెలివిజన్ స్టేషన్లు పొందేందుకు అనుమతించిన తరువాత లైసెన్సింగ్ యు.హెచ్.ఎఫ్ ఛానల్స్ ప్రారంభించింది. మెక్సికోలో ఆధారిత స్టేషన్లు (ఎక్స్.ఇ, ఎక్స్.హెచ్ యొక్క ఐ.టి.యు ప్రసారాలు) కూడా శాన్ డియాగో నగరవాసులకు ప్రసారాలు అందిస్తున్నాయి. ప్రస్తుత టెలివిజన్ స్టేషన్లు ఎక్స్.హెచ్టి.జె.బి 3 (ఒంస్ టి.వి), ఎక్స్.ఇ.టి.వి 6 (సి.డబ్ల్యూ), కె.ఎఫ్.ఎం.బి 8 (సి.బి.ఎస్), కె.జి.టి.వి 10 (ఎ.బి.సి ), ఎక్స్.ఇ.డబ్ల్యూ 12 (టెలివిసా ప్రాంతీయ), కె.పి.బి.ఎస్ 15 (పి.బి.ఎస్ ), కె.బి.ఎన్.టి-సి.డి 17 (యూనివిజన్), ఎక్స్.హెచ్.టి.ఐ.టి 21 (అజ్టెకా 7), ఎక్స్.హెచ్.జె.కె 27 (అజ్టెకా 13), కె.ఎస్.డి.ఎక్స్-ఎల్.పి 29 (స్పానిష్ స్వతంత్ర), ఎక్స్.హెచ్.ఎ.ఎస్ 33 (టెలిముండో), కె35డిజి 35 (యు.సి.ఎస్.డి-టి.వి ), కె.డి.టి.ఎఫ్ - ఎల్.డి 51 (టెలి ఫ్యూచురా), కె.ఎన్.ఎస్.డి 39 (ఎన్.బి.సి), కె.జెడ్.ఎస్.డి-ఎల్.పి 41 (అజ్టెకా అమెరికా), కె.ఎస్.ఇ.ఎక్స్-సిడి 42 (ఇన్ఫోమెర్షియల్స్), ఎక్స్.హెచ్.బి.జె 45 (కాలువ 5), ఎక్స్.హెచ్.డి.టి.వి 49 (ఎం.ఎన్.టి.వి ), కె.యు.ఎస్.ఐ 51 (ఇండిపెండెంట్), ఎక్స్.హెచ్.యు.ఎ.ఎ 57 (చానల్ డి లాస్ ఈస్ట్రిలాస్), కె.ఎస్.డబల్యూ - టి.వి 69 (ఎఫ్.ఒ.ఎక్స్ ). శాన్ డియాగో కేబుల్ వ్యాప్తి రేటు 80,6 శాతం.

రాజకీయ రంగం

[మార్చు]
శాన్ డియాగో సిటీ కౌంసిల్ చాంబర్

మేయర్, అటార్నీ, సిటీ కౌన్సిల్ సభ్యుల స్థానాలు ఆధికారికంగా విభజింపబడ లేదు. సింగిల్ మెంబర్ డిస్ట్రిక్ట్ ల నుండి ఒక్కొక్కరు 8 మంది సభ్యులు కౌన్సిలర్లుగా ఎన్నుకొనబడతారు. నగరం మొత్తం నుండి మేయర్, సిటీ అటార్నీలు నేరుగా ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకొనబడతారు. మేయర్, సిటీ అటార్నీ, కౌన్సిలర్లు నాలుగు సంవత్సరాలకు ఒక సారి ఎన్నుకోబడతారు. ఎవరైనా ఒక్కొక్క స్థానానికి రెండు సార్లు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధన ఉంది. 2006 నుండి నగర ప్రభుత్వం సిటీ మేనేజర్ నుండి స్ట్రాంగ్ మేయర్ సిస్టమ్ గా రూపాంతరం చెందింది. 2004లో రెండు దఫాలుగా నగరమంతా ఓటింగ్ నిర్వహించి ఈ మార్పును తీసుకు వచ్చారు. కౌన్సిల్ లెజిస్లేటివ్ గానూ మేయర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానూ విధి నిర్వహణ చేస్తుంటారు.

నగర నిర్మాణం

[మార్చు]

ప్రజావసరాలు

[మార్చు]

నగరవాసులకు మంచినీటిని శాన్ డియాగో నగర "వాటర్ డిపార్ట్ మెంట్" (నీటిసరఫరా శాఖ) సరఫరా చేస్తుంది. నగరానికి కావలసిన నీరు " మెట్రోపాలిటన్ వాటర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా " నుండి లభిస్తుంది.

గ్యాస్, ఎలెక్ట్రిక్ అవసరాలు సెప్రా ఎనర్జీ లోని ఒక విభాగమైన" శాన్ డియాగో గ్యాస్ & ఎలెక్ట్రిక్ " ద్వారా తీరుతాయి.

రహదార్లు

[మార్చు]
శాన్ డియాగో మీద ఎగురుతున్న 1-5 విమానం

నగర వాసులలో 80 శాతం ప్రజలు తమ ప్రయాణావసరాలకు కారుల మీద ఆధారపడతారు. శాన్ డియాగో నగరంలో అనేక ఫీఘ వేస్, రహదారులు నగరవాసుల సౌకర్యార్ధం ఉన్నాయి. టిజుయానా - లాస్ ఏంజలెస్ మధ్య ఉన్న ఇంటర్ స్టేట్ 5, ఇంపీరియల్ కౌంటీ- అరిజోనా సన్ కారిడర్ మధ్య ఉన్న ఇంటర్ స్టేట్ 8, తూర్పు ప్రాంతంలో ఈశాన్య దిశగా ఐర్లాండ్ ఎంపైర్ - లాస్ వెగాస్ మధ్య ఉన్న ఇంటర్ స్టేట్ 15, మెక్సికన్ సరిబద్దులలో చీలి సరెంటో వ్యాలీ వద్ద కలుసుకునే ఇంటర్ స్టేట్ 805 ఉన్నాయి. నగరంలోని రహదారులన్నీ నగరానికి వాయవ్యంలో ఉన్న డౌన్ టౌన్ (నగర కేంద్రం) ప్రాంతానికి అనుసంధానించబడి ఉంటాయి.

ప్రభుత్వ రవాణా రంగం

[మార్చు]

శాండియాగో నగరంలో ప్రభుత్వం ట్రోలీ, బస్, స్ప్రింటర్, కోస్టర్, ఆంట్రక్ రైలు వంటి ప్రయాణ సౌకర్యాలును కల్పిస్తోంది. ట్రోలీ సౌకర్యం నగర కేంద్రం చుట్టుపక్కల నగరవాసులకు అందుబాటులో ఉంటుంది. మిషన్ వ్యాలీ, ఈస్ట్ కంట్రీ, కోస్టల్ సౌత్ బే లలో ట్రోలీ సర్వీసులు లభిస్తున్నాయి. 5వ రహదారి వెంట సాగే మార్గంలో " మిడ్-కోస్ట్ లైన్ " మార్గంలో పాత ఊరు నుండి విశ్వవిద్యాలయం వరకు ట్రోలీ మార్గంలో ప్రయాణ వసతి కల్పించబడి ఉంది. కోస్టల్ లైన్ పక్కగా నడుపబడుతున్న ఆంట్రక్ రైళ్లు శాండియాగోను లాస్ ఏంజిలెస్, ఆరెంజ్ కౌంటీ, రివర్ సైడ్, శాన్ బెర్నాడినో, వెంతురా మెట్రో లింక్ ద్వారా అనుసంధానిస్తాయి. శాన్ డియాగో పాత ఊరు, నగరకేంద్రం ప్రాంతం లలో రెండు ఆంట్రక్ మార్గాలు ఉన్నాయి. ప్రజాప్రయాణ వసతులు, ఉద్యోగుల రాకపోకల సమాచారం " శాండియాగో ట్రాన్సిట్ ఇన్ఫర్మేషన్ " లో అంతర్జాలంలోనూ, ఫోన్ సంభాషణ ద్వారా లభిస్తుంది. ఈ సమాచారం తెలుసుకోవాలంటే " 511" నంబరుకు ఈ ప్రాంతం నుండి ఫోన్ చేసి తెలుసుకో వచ్చు.

సైక్లింగ్

[మార్చు]
కొరొనాడో, శాన్ డియాగో విహంగ వీక్షణం

శాన్ డియాగో రహదారి విధానంలో సైకిల్ ప్రయాణానికి అనువైన అదనపు మార్గాలు నిర్మించబడి ఉంటాయి. తేలికైన పోడారిన వాతావరణం శాన్ డియాగో సైకిల్ ప్రయాణానికి సంవత్సరమంతా సౌకర్యమైన ప్రశాంత వసతి కల్పిస్తుంది. అదేసమయం కొండలు, లోయలు గుట్టలతో నిండిఉన్న తక్కువ జనసాంధ్రత కలిగిన భూభాగం కారణంగా సుదూరమైన సైక్లింగ్ మార్గాలకు అవకాశం కలిగిస్తుంది. అయినప్పటికీ నగరంలో సాధారణ ఉపయోగాలకు సైకిల్ ఉపయోగానికి నిషేధం ఉంది. వినోదానికి మాత్రమే సైక్లింగ్ చేయవచ్చు. డౌన్‌టౌన్ పరిసరప్రాంతంలో ఉన్న పాత జనసాంధ్రత కలిగిన ప్రాంతాలలో సైల్ ప్రయాణానికి మార్గాలు ఉన్నప్పటికీ నూతనంగా నిర్మించబడుతున్న రహదారులలో సైకిల్ మార్గాలు నిర్మించబడడం లేదు. ఫలితంగా విస్తారంగా ఉన్న సైక్లింగ్ సంబంధిత కార్యక్రమాలు కేవలం వినోదానికి మాత్రమే ఉపకరిస్తున్నాయి. 10 లక్షల జనాభా కంటే అధికంగా ఉన్న అమెరికా నగరాలలో సైకిల్ ప్రయాణానికి అనువైన నగరాలలో శాన్‌డియాగో నగరం ప్రథమ స్థానంలో ఉన్నదని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

విమానయానం

[మార్చు]

నగరంలో వాణిజ్యపరమైన విమానాశ్రయం " శాండియాగో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్". దీనిని " లిండ్‌బర్గ్" ఫీల్డ్ అనికూడా అంటారు. ఒకే రన్‌వే కలిగిన విమానశ్రయాలలో ఇది అమెరికాలోనే రద్దీ అయినది. 2005 లో ఈ విమానాశ్రయం 1.70,00,000 మంది ప్రజలకు వాయుమార్గ ప్రయాణ వసతి కల్పించింది. అలాగే ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ విమానాశ్రయం శాన్ డియాగో అఖాతం ప్రాంతం లో, బజారు ప్రాంతం నుంచి 3 మైళ్ళ దూరంలో ఉంది. శాన్ డియాగో విమానాశ్రయం నుండి అమెరికా లోని మిగిలిన నగరాలకే కాకుండా హవాయ్, మెక్సికో, కెనడా, జపాన్, యునైటెడ్ కింగ్‌డం లకు విమాన సర్వీసులు లభిస్తాయి. ఇది " శాన్‌డియాగో రీజనల్ ఎయిర్ పోర్ట్ అధారిటీ " అనే స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలలో నిర్వహించబడుతుంది. అదనంగా, జనరల్ అవియేషన్ ఎయిర్ పోర్టులు అయిన " మోంట్ గోమరీ ఫీల్డ్ (ఎం.వై.ఎఫ్), బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను నగరపాలక సంస్థ నిర్వహిస్తోంది.

శాన్‌డియాగో నగర వాహనరద్దీని తగ్గించడానికి సమీపకాలంలో కొత్తప్రణాళికలను చేపట్టారు. వీటిలో ప్రత్యేకమైన ప్రణాళికలు రహదార్లు, శాన్‌డియాగో విమానాశ్రయం నౌకాశ్రయంలోని క్రూసీ టెర్మినల్ మొదలైనవి. 5, 805 రహదార్ల (ది మెర్జ్) అభివృద్ధి. రెండు రహదార్ల కూడలిలో రద్దీ సమయంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. 2007 లో శాన్‌డియాగో లోని 37% రహదార్లులో వాహన రాకపోకలకు అనుకకూలంగా ఉన్నాయి. ఇందుకు మంజూరు చెయ్యబడిన 84.6 మిలియన్ డాలర్లు అభివృద్ధి కార్యక్రమాలకు సరిపోవు కనుక పోర్ట్ మార్గం పొడిగింపు పనులు 2010 లో మొదలైయ్యాయి. విమానేశ్రయంలో రెండవ టెర్మినల్ నిర్మాణ ప్రణాళికతో చేరి మిగిలిన అభివృద్ధి పనులు నిర్మాణం 2013 నాటికి పూర్తి కాగలవని భావించబడుతుంది.

సోదర నగరాలు

[మార్చు]

శాన్‌డియాగో 16 సోదర నగరాలు ఉన్నాయి. అంతర్జాతీయ సోదరనగరాలు.

సూచికలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Quanzhou అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "Miasta partnerskie Warszawy". um.warszawa.pl. Biuro Promocji Miasta. May 4, 2005. Archived from the original on 2007-10-11. Retrieved August 29, 2008.