శివదుర్గ దేవాలయం (కాలిఫోర్నియా)
శివదుర్గ దేవాలయం (కాలిఫోర్నియా) | |
---|---|
భౌగోళికం | |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం | కాలిఫోర్నియా |
ప్రదేశం | శాంటా క్లారా |
సంస్కృతి | |
దైవం | దుర్గాదేవి, రాధా కృష్ణ, శివలింగం |
ముఖ్యమైన పర్వాలు | హోలీ, నవరాత్రి |
చరిత్ర, నిర్వహణ | |
స్థాపితం | 2012 |
శివదుర్గ దేవాలయం, కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న ఒక హిందూ దేవాలయం. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని హిందువులకు పుణ్యక్షేత్రంగా సేవలు అందిస్తోంది.[1] 2012, డిసెంబరులో ప్రారంభించబడింది. దుర్గాదేవి ఇక్కడి ప్రధాన దేవత. ఇక్కడ వినాయకుడు, సాయిబాబా, శివలింగం, రాధాకృష్ణ మొదలైన ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. సంవత్సరానికి 100,000 మంది హిందుఊ భక్తులు ఇక్కడికి వస్తుంటారు.[2]
చరిత్ర
[మార్చు]2012, డిసెంబరు 2న పండిట్ కృష్ణ కుమార్ పాండే, అతని అనుచరులచే కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలో ఈ శివదుర్గ దేవాలయం స్థాపించబడింది.[3] హిందూ సంస్కృతి, సాంప్రదాయ విలువలను వ్యాప్తి చేయడమే ఈ దేవాలయ ఏర్పాటు లక్ష్యం.[2] పండిట్ పాండే ఆలయ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడిగా ఉన్నాడు.[4] పాండే జ్యోతిషశాస్త్రంలో డిగ్రీ చదివాడు. గతంలో వైష్ణో దేవి పూజారిగా పనిచేశాడు.[5]
పండిట్ జస్రాజ్, అశోక్ సింఘాల్, త్రిప్తి ముఖర్జీలకు అంకితం చేస్తూ శివదుర్గ దేవాలయం స్థాపించబడింది. 2015 చివరలో, ఆలయం సన్నీవేల్‌లోని కెర్న్ అవెన్యూకి మార్చబడింది.[6] 2021 జూన్ నెలలో శాంటా క్లారాలోని ఫ్లోరా విస్టా ఏవ్‌కి మార్చబడింది.
పండుగలు
[మార్చు]ఈ దేవాలయంలో వారానికోసారి హారతి, కీర్తనలు, మతపరమైన ప్రసంగాలు, వన భోజనాలు జరుపబడుతుంటాయి.[7] హిందూ క్యాలెండర్‌లోని ప్రధాన పండుగలు ఇక్కడ నిర్వహిస్తారు.[8] హిందీ తరగతులు, యోగా సెషన్‌లు ఆలయ కార్యకలాపాలలో భాగంగా ఉంటాయి.[9] ఇక్కడ నిర్వహించే వార్షిక పండుగలు:[10]
- మహా శివరాత్రి (మార్చి)
- శ్రీరామ నవమి (ఏప్రిల్)
- కృష్ణ జన్మాష్టమి (ఆగస్టు)
- గణేష్ చౌతుర్తి (సెప్టెంబరు)
- దీపావళి (నవంబరు)
- దీపావళి వేడుక (నవంబరు)
మూలాలు
[మార్చు]- ↑ "Lohri celebrated at Shiv Durga temple". January 16, 2019.
- ↑ ఇక్కడికి దుముకు: 2.0 2.1 "Shiv Durga Temple shifts to Sunnyvale | India Post News Paper". July 27, 2016.
- ↑ "Despite US government approval, temples wait for right time to restart in-person worship". May 26, 2020. Archived from the original on 2022-01-21. Retrieved 2022-01-19.
- ↑ "Event held to highlight Modi government's achievements". April 10, 2019.
- ↑ "Hindu Priest USA | About Us".
- ↑ "Shiv Durga Temple shifts to Sunnyvale | India Post News Paper". July 27, 2016.
- ↑ "Shiv Durga Temple Sunnyvale, California, United States Timings". January 11, 2018.
- ↑ Mukherji, Anahita. "A hate crime against an Indian-American unites Silicon Valley's Sunnyvale". Quartz India.
- ↑ "Hindi classes and Yoga sessions Shiv Durga Temple". Archived from the original on 2020-07-25. Retrieved 2022-01-19.
- ↑ "Event – Shivdurgatemple". Archived from the original on 2022-01-27. Retrieved 2022-01-19.
బయటి లింకులు
[మార్చు]- అధికారిక వెబ్సైట్ Archived 2021-06-14 at the Wayback Machine