Coordinates: 33°40′24″N 117°36′37″W / 33.6734182°N 117.6101414°W / 33.6734182; -117.6101414

రామకృష్ణ మఠం (కాలిఫోర్నియా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామకృష్ణ మఠం (కాలిఫోర్నియా)
రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద విగ్రహం
మతం
అనుబంధంరామకృష్ణ మఠం
Regionకాషాయం
పవిత్ర సంవత్సరం1949
ప్రదేశం
ప్రదేశం19961 లైవ్ ఓక్ కాన్యన్ రోడ్, ట్రాబుకో కాన్యన్, కాలిఫోర్నియా
రాష్ట్రంకాలిఫోర్నియా
భౌగోళిక అంశాలు33°40′24″N 117°36′37″W / 33.6734182°N 117.6101414°W / 33.6734182; -117.6101414
Website
అధికారిక వెబ్సైటు

రామకృష్ణ మఠం, కాలిఫోర్నియాలోని ట్రాబుకో కాన్యన్‌లోని రోలింగ్ హిల్స్‌లో ఉన్న మఠం.[1]

చరిత్ర[మార్చు]

1939లో ఆంగ్ల రచయిత, తత్వవేత్త జెరాల్డ్ హెర్డ్, జీవితానికి సంబంధించిన ఆలోచనాత్మక అధ్యయనానికి, అభ్యాసానికి అంకితమైన ఒక మతపరమైన సంస్థను స్థాపించాలనే ఆలోచనను రూపొందించాడు. వేదాంత సొసైటీకి ఒక మఠం అవసరమని తెలుసుకున్న హియర్డ్ 300 ఎకరాల భూమిని వేదాంత సొసైటీకి ఇచ్చాడు. 1949, సెప్టెంబరు 7న స్వామి ప్రభవానంద చేతులమీదుగా 40 ఎకరాల స్థలంలో ప్రతిష్ఠించబడింది. ఈ మఠం వేదాంత సొసైటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో భాగంగా, రామకృష్ణ ఆర్డర్ ఆఫ్ ఇండియాకు పశ్చిమ శాఖగా ఉంది. రామకృష్ణ పరమహంస పేరుమీదుగా ఈ రామకృష్ణ మఠం ఏర్పాటుచేయబడింది.[2]

ఇతర వివరాలు[మార్చు]

ఉదయం 6 గంటలకు మార్నింగ్ బెల్ మోగించడంతో ఇక్కడి దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 6:30 నుండి 7:30 వరకు ధ్యానం ఉంటుంది. అల్పాహారం, మధ్యాహ్నం ఆరాధన, మధ్యాహ్న భోజనం ఉంటాయి. కాసేపు విశ్రాంతి తరువాత 5:30లకు మరల పని దినచర్య కొనసాగుతుంది. సాయంత్రం లైబ్రరీలో శ్రీరామకృష్ణ సువార్త పఠనం ఉంటుంది.

సెప్టెంబరు మధ్య నుండి జూన్ వరకు ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మఠం ప్రధాన రెఫెక్టరీలో జరుగుతాయి. జూలై నాల్గవ తేదీన స్వామి వివేకానంద గౌరవార్థం ఒక ప్రత్యేక వేడుకను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకకు అనేక వందల మంది సందర్శకులు వస్తారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Our Monastery - Ramakrishna Monastery". 2020-09-06. Retrieved 2022-01-19.
  2. 2.0 2.1 Brazil, Ben (15 February 2018). "Daily Pilot News Daily Pilot The monastery amid O.C.'s mania". Los Angeles Times. Retrieved 19 January 2022.

బయటి లింకులు[మార్చు]