సంపత్ నంది
సంపత్ నంది | |
---|---|
జననం | హనుమకొండ, వరంగల్ జిల్లా, తెలంగాణా | 1980 జూన్ 20
వృత్తి | దర్శకుడు, రచయిత, నిర్మాత |
సంపత్ నంది ఒక తెలుగు సినీ దర్శకుడు రచయిత, నిర్మాత. [1]
జీవితం
[మార్చు]సంపత్ 1980 జూన్ 20 తేదీన వరంగల్ జిల్లా, హనుమకొండలో జన్మించాడు. పదో తరగతి దాకా హనుమకొండలో చదివాడు. అక్కడే వాళ్ళ ఇంటికి సమీపంలో ఒక గ్రంథాలయం ఉండేది. అక్కడ పుస్తక పఠనం బాగా అలవాటయింది. చిరంజీవి సినిమాలు వరుసగా చూసి వాటిని రచయిత ధృక్కోణంలో విశ్లేషించే వాడు. నెల్లూరు నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. తర్వాత రాయచూరులోని వి. ఎల్. సి. పి కళాశాలలో బిఫార్మసీ పూర్తి చేశాడు. పోసాని కృష్ణమురళి సంభాషణల మీద ఆసక్తి కలిగి ఓ సినిమా డైరీ సహాయంతో ఆయన ఫోను నంబరు సంపాదించి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. ఆయన ముందుగా డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నాడు. తన దగ్గర పనిచేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆ స్థానంలో ఇతనికి ఆహ్వానం పంపాడు పోసాని. తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో ముంబై, బెంగళూరు ల్లో ప్రకటనలు రూపొందించేవాడు.[2]
సినిమాలు
[మార్చు]2010 లో ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించారు. కేవలం 3 కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం సుమారు 80 లక్షలకు పైగా లాభాన్ని ఆర్జించి పెట్టింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వారం రోజుల్లోనే ఏడు అవకాశాలు వచ్చాయి. నిర్మాత శానం నాగ అశోక్ కుమార్ ద్వారా 2012 లో రాం చరణ్ కథానాయకుడిగా వచ్చిన రచ్చ సంపత్ రెండో సినిమా. 2015 లో రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 లో గోపీచంద్ ముఖ్యపాత్రల్లో గౌతమ్ నంద సినిమాను రూపొందించాడు.
దర్శకుడిగా
[మార్చు]నిర్మాతగా
[మార్చు]- TALIPATAM
- పేపర్ బాయ్
- సింబా (2024)
మూలాలు
[మార్చు]- ↑ NTV (20 June 2021). "'రచ్చ' చేసి, 'సీటీమార్' అంటున్న సంపత్ నంది!". NTV. Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 June 2021.
- ↑ "Sampath Nandi interview – Telugu film director". Idlebrain.com. Retrieved 2015-07-02.