రా..రా..

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా పోస్టర్

రా..రా.. 2018లో విడుదలైన తెలుగు చిత్రం.

వ‌ంద సినిమాల్లో 99 సినిమాలు విజయం సాధించిన ప్రఖ్యాత దర్శకుడు త‌న‌యుడు రాజ్‌కిర‌ణ్‌ (శ్రీకాంత్‌) .. త‌న తండ్రిలా ద‌ర్శ‌కుడు కావాల‌నుకుంటాడు. అయితే రాజ్‌కిర‌ణ్ చేసిన తొలి మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూస్తాయి. దాంతో అత‌ని తండ్రి గుండెపోటుతో మ‌ర‌ణిస్తే.. త‌ల్లి ఆసుప‌త్రి పాల‌వుతుంది. త‌ల్లి బ్ర‌త‌కాలంటే ఎలాగైనా హిట్ సినిమా చేయాల‌నుకుంటాడు రాజ్‌కిర‌ణ్‌. అందుక‌ని, హార‌ర్ సినిమా తీసి విజయం సాధించాల‌ని అనుకుంటాడు. మంచి హార‌ర్ క‌థ కోసం ఓ పురాత‌న భ‌వంతిలోకి అడుగుపెడ‌తాడు. త‌నకు తోడుగా త‌న స్నేహితుల‌ను కొంత మందిని మాత్ర‌మే ఆ బంగ‌ళాలోకి తీసుకెళ‌తాడు. అప్ప‌టికే ఆ బంగ‌ళాలో కొన్ని ఆత్మ‌లు (ర‌ఘుబాబు, అలీ,హేమ మ‌రికొంద‌రు) తిరుగుతుంటాయి. వీరిని భ‌య‌పెట్టి ఇంట్లో నుండి వెళ్ల‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మవుతాయి. చివ‌ర‌కు రాజ్‌కిర‌ణ్ టీంతో పందెం కాశీ అందులో కూడా ఓడిపోయి బంగ‌ళా విడిచి పెట్టి వెళ్లిపోతాయి. అయితే అదే స‌మ‌యంలో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఆ మలుపు ఏంటి? అనేది మిగిలిన కథలో భాగం.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాణ సంస్థః విజి చెర్రీస్ విజ‌న్‌
  • సంగీతం: ర‌్యాప్ రాక్ ష‌కీల్
  • ఛాయాగ్ర‌హ‌ణం: పూర్ణ‌
  • నిర్మాత‌: ఎం.విజ‌య్‌
  • ద‌ర్శ‌క‌తం: విజి చరిష్ యూనిట్

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (23 February 2018). "శ్రీకాంత్ నటించిన 'రారా' మూవీ రివ్యూ". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రా..రా..&oldid=3799081" నుండి వెలికితీశారు