దెయ్యం (సినిమా)
| దెయ్యం (1996 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రాంగోపాల్ వర్మ |
|---|---|
| తారాగణం | జె.డి.చక్రవర్తి , మహేశ్వరి |
| సంగీతం | సత్యనారాయణ |
| నిర్మాణ సంస్థ | వర్మ క్రియెషన్స్ |
| భాష | తెలుగు |
దెయ్యం 1996లో విడుదలైన తెలుగు భయానక చిత్రం, దీనిని రామ్ గోపాల్ వర్మ రచించి, నిర్మించి, దర్శకత్వం వహించాడు. [1]ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ, అజింక్య డియో నటించారు. ఈ చిత్రం 21 జూన్ 1996న విడుదలైంది. ఇది హాలీవుడ్ చిత్రం పోల్టర్జిస్ట్ ఆధారంగా రూపొందించబడింది.[2]
కథ
[మార్చు]ఇది ఒక హారర్ సినిమా. కథ విషయానికి వస్తే జె. డి. చక్రవర్తి,,మహేశ్వరి ప్రేమికులు.,మహేశ్వరి తన అక్కా, బావ లతో కలిసి ఉంటూ ఉంటుంది. ఓ రోజు వారు ఇల్లు బదిలి అవుతారు. ఆ ఇల్లు ఎక్కడో సిటీకు దూరంగా ఉండే బంగళా. కాని అది ఒకప్పుడు శ్మశానం ఉన్న ప్రదేశం అని, ఆ బంగ్లా దెయ్యలకు, భూతాలకు నెలవైందని వారికి తెలియదు. అప్పుడప్పుడు వారికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవతు ఉంటాయి. హఠాత్తుగా ఓ రోజు వారి 5 ఏండ్ల కొడుకు చనిపోతాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలొ ఒక్కొక్కరు మృత్యువాత పడి అందరు చనిపోతారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తె రాం గోపాల్ వర్మ చాలా సన్నివేసాలు సున్నితంగా తీసారు. కాకపొతే చివరి అంకం లో మాత్రం అందరిని దెయ్యాలుగా చూపడం మాత్రం కొంచెం ఇబ్బంది గా అనిపిస్తుంది.
తారాగణం
[మార్చు]- జె. డి. చక్రవర్తి నర్సింగ్‌గా, మహి ప్రియుడు
- మహేశ్వరి మహి, సింధు చెల్లెలు
- జయసుధ సింధుమతి "సింధు"గా
- అజింక్యా డియో సింధు భర్త మురళిగా
- చిన్ని, సింధు కొడుకుగా మాస్టర్ రవిచంద్ర పద్మాల
- తనికెళ్ల భరణి సైకాలజిస్ట్‌గా
- జీవా పిచ్చివాడిగా
- రామజగన్ దెయ్యం చేత చంపబడిన వ్యక్తిగా
- అహుతి ప్రసాద్
- బెనర్జీ
- అనంత్
- కళ్ళు చిదంబరం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: రామ్ గోపాల్ వర్మ
- రచన: రామ్ గోపాల్ వర్మ
- సంగీతం: సత్యనారాయణ
- మాటలు: కొమ్మనాపల్లి గణపతిరావు
- ఛాయా గ్రహణం: చోటా కె నాయుడు
- ఎడిటింగ్: భానోదయ
- నేపథ్య గాయకులు: మనో, కె.ఎస్.చిత్ర
- నిర్మాత: రామ్ గోపాల్ వర్మ
- నిర్మాణ సంస్థ: వర్మ కార్పొరేషన్
- విడుదల: 21:06:1996.
మూలాలు
[మార్చు]- ↑ "Deyyam (1996)". Indiancine.ma. Retrieved 2025-08-18.
- ↑ "Best Telugu Horror Movies - Telugu Rush". 20 May 2018.