ఆటోడ్రైవర్
Jump to navigation
Jump to search
ఆటోడ్రైవర్ | |
---|---|
దర్శకత్వం | సురేష్ కృష్ణ |
రచన | పోసాని కృష్ణమురళి (మాటలు) |
నిర్మాత | డి. శివప్రసాద్ రెడ్డి |
తారాగణం | అక్కినేని నాగార్జున , దీప్తి భట్నాగర్ |
సంగీతం | దేవా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ఏప్రిల్ 24, 1998 |
భాష | తెలుగు |
ఆటోడ్రైవర్ 1998లో విడుదలయిన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, దీప్తి భట్నాగర్, సిమ్రాన్ ముఖ్య నటీ నటులు.[1][2] సురేష్ ఈ సినిమాను తమిళంలో ఒరువన్ అన్ పేరుతో శరత్ కుమార్ కథానాయకుగా పునర్నిర్మించారు. ఈ సినిమాను డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. దేవా సంగీత దర్శకత్వం వహించాడు. పోసాని కృష్ణమురళి మాటలు రాశాడు.
తారాగణం
[మార్చు]- జగన్ గా అక్కినేని నాగార్జున, ఆటో డ్రైవర్
- శ్రావణిగా దీప్తి భట్నాగర్
- సంధ్యగా సిమ్రాన్
- బ్రహ్మానందం
- విజయ్ కుమార్, శ్రావణి తండ్రి
- కోట శ్రీనివాసరావు
- బాబూ మోహన్
- సూర్యగా మహేష్ ఆనంద్
- సుధాకర్
- గురుగా దారాసింగ్
- నాగరాజ్ గా అజయ్ రత్నం
- ఎం. ఎస్. నారాయణ
- ఎ. వి. ఎస్
- రాళ్ళపల్లి
- రాజీవ్ కనకాల
- అనంత్
- గుండు హనుమంతరావు
- కళ్ళు చిదంబరం
- గౌతం రాజు
- జెన్ని
- సుజాత
- శివపార్వతి
- కృష్ణశ్రీ
సంగీతం
[మార్చు]ఈ చిత్రానికి దేవా సంగీతం అందించాడు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఆటోవాలా" | వేటూరి సుందర్రామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | 5:26 |
2. | "చందమామ చందమామ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | హరిహరన్, సుజాత | 6:21 |
3. | "అక్కినేని అక్కినేని" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | రాజేష్, సుజాత | 5:47 |
4. | "ఏమో ఏమో" | వేటూరి సుందర్రామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత | 4:25 |
5. | "అబ్బాయి అబ్బాయి నాకు" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత | 4:57 |
6. | "మామా మజారే" | వేటూరి సుందర్రామ్మూర్తి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత, స్వర్ణలత | 5:24 |
మొత్తం నిడివి: | 31:44 |