Jump to content

రచయిత్రి (1984 సినిమా)

వికీపీడియా నుండి
రచయిత్రి
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం భానుమతీ రామకృష్ణ
తారాగణం చక్రపాణి ,
రాజి
సంగీతం భానుమతీ రామకృష్ణ
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
భాష తెలుగు

రచయిత్రి 1984లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రానికి భానుమతీ రామకృష్ణ నిర్మించి దర్శకత్వం వహించింది. [1] భానుమతీ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించి, సంగీతాన్నందించింది. దీనికి కథ, స్క్రీన్‍ప్లే, సంభాషణలు, సంగీతం, కూర్పు, దర్శకత్వం – అన్నీ భానుమతి నిర్వహించింది. ఇది రచయిత్రుల రచనల వల్ల సమాజానికి ఉపయోగం కలగాలి అన్న ఉద్దేశ్యంతో తీసిన సినిమా ఇది.

"తన చుట్టూ అలముకుని ఉన్న సామాజిక పరిస్థితుల పత్ల ప్రతిస్పంచించే రచయిత లేక రచయిత్రి ఆయా పరిస్థితులను తన రచనల్లో చిత్రిస్తూ, ఆ వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలకు సముచితమైన పరిష్కారాలు సూచిస్తూ తను చేబట్టిన ఉదత్తమైన రచనా వ్యాసంగానికి న్యాయం చేకూర్చగలిగితే జీవితం ధన్యమయినట్టే" అనే సందేశాన్ని ఈ చిత్రంలో చెప్పబడింది.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

ఈ చిత్రంలో భానుమతి ఒక రచయిత్రి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వారి కథలు పనిమనిషి ద్వారా వింటూ, ఆ కథల్నే నవలలో రాస్తూ, పరిష్కారమార్గం సూచిస్తూ ఉంటుంది. ఇలా కథలో నాలుగు కథలు సమాంతరంగా నడుస్తాయి. కాలక్రమంలో, ఈ రచయిత్రి తన రచనల్లో సూచించిన పరిష్కారాలు చదివి, ఆయా కుటుంబాల వారు బాగుపడి, చివర్లో ఆమె వద్దకు వచ్చి, ధన్యవాదాలు తెలుపుకుంటారు .

తారాగణం

[మార్చు]
  • భానుమతి - రచయిత్రిగా
  • శరత్ బాబు - దేవి ప్రియుడు
  • చక్రపాణి - దేవి భర్తగా
  • రాజీ - దేవిగా
  • అల్లురామలింగయ్య
  • అత్తిలి లక్ష్మి
  • ఝాన్సీ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు:డి.వి.నరసరాజు
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, గోపి, వడ్డేపల్లి కృష్ణ
  • ఛాయాగ్రహణం: చంద్రమోహన్
  • కథ ,స్క్రీన్‍ప్లే, సంభాషణలు, సంగీతం, కూర్పు, దర్శకత్వం: భానుమతి రామకృష్ణ

పాటల జాబితా

[మార్చు]

1.తీయనికల మేఘాలలోన తేలిపోయాను, రచన:మైలవరపు గోపి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

2.నీవేలేని ఈ జీవితమే కలయై కరిగేనులే, రచన: గోపీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

3.విన్నపాలు వినవలె వింతవింతలు, రచన:అన్నమాచార్య కీర్తన, గానం.పాలువాయీ భానుమతి

4.సన్నజాజి తీవెలోయీ సంపంగి పూవులోయీ , రచన: మల్లాది, గానం.పి.భానుమతి

5 . మంచు జల్లు పడి మెరిసే మల్లికవే , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Rachayithri (1984)". Indiancine.ma. Retrieved 2020-08-31.

. 2.ghantasala galaamrutamu ,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]