గుప్పెడు మనసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుప్పెడు మనసు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
తారాగణం శరత్ బాబు
సుజాత
సరిత
సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్
నిర్మాణ సంస్థ కళాకేంద్ర మూవీస్
విడుదల తేదీ 1979 నవంబరు 2 (1979-11-02)
దేశం భారత్
భాష తెలుగు

కె. బాలచందర్ దర్శకత్వంలో 1979లో వచ్చిన ఒక తెలుగు చిత్రం. సాధారణ చిత్రాలకు భిన్నంగా బాలచందర్ సినిమాలన్నీ సాగుతాయి. అసాధారణమనుకున్న విషయం ఒకటి తనకు సంభంధించిన మనుషుల మధ్యే చోటుచేసుకోవటంతో , సుజాత మనసులోని సంఘర్షణ కొత్తకోణంలో ఆవిష్కృతమౌతుంది ఈ చిత్రంలో. సుజాత, శరత్ బాబు భార్యాభర్తలు. సుజాత సెన్సారు సభ్యురాలు. సరిత (వయసులో వారికన్నా చాల చిన్నది) వారి కుటుంబ స్నేహితురాలు. సుజాత ఒక చిత్రం సెన్సారు చేసేటపుడు అభ్యంతరం చెప్పిన సంఘటన వారి కుటుంబంలోనే తారసిల్లుతుంది. ఇదీ చిత్రకథ. బాలమురళీ కృష్ణ పాడిన ఆత్రేయ గీతం మౌనమే నీ భాష ఓ మూగమనసా ఈ చిత్రంలోనిదే.[1]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రం లోని పాటలు రచయిత ఆచార్య ఆత్రేయ.

  1. కన్నె వలపు కనుల పిలుపు ఎదురు చూస్తున్నవి - ఎస్.పి. బాలు, వాణీ జయరాం
  2. నేనా పాడనా పాట మీర అన్నది మాట - వాణీ జయరాం, ఎస్.పి. బాలు
  3. నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా జాబిలి నవ్వున - ఎస్.పి. బాలు
  4. మౌనమె నీ భాష ఓ మూగ మనసా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]