మౌనమె నీ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మౌనమే నీ భాష ఓ మూగ మనసా కె. బాలచందర్ దర్శకత్వంలో 1979లో విడుదలైన గుప్పెడు మనసు చిత్రంలోని పాట[1]. దీనిని ఆచార్య ఆత్రేయ రచించగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించాడు.[2] సినిమాలోని ఈ పాటలో శరత్ బాబు, సుజాతలు నటించారు. ఈ పాటకు ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[3] ఈ పాట ద్వారా మనం ఎన్ని ఆదర్శాలు చెప్పుకున్నా మన మనసు వేసే కోతిగంతుల్ని నియంత్రించలేకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు.[4]

పాట గురించి[మార్చు]

ఈ పాటలో ఆత్రేయ మనిషి మనసు గురించి, మనస్తత్వం గురించి, జీవిత తత్వం గురించి చెప్పాడు. ఈ పాటలోని తత్వేం ప్రతి ఒక్కరి జీవితానికీ, వాళ్ల జీవితంలో జరిగిన సంఘటనలకూ దగ్గరగా ఉంటుంది. మనిషి ఆలోచనా విధానానికి, తత్వానికి ఓ పాఠ్య పుస్తకం లాంటిదీ పాట. కర్మ–యోగి తత్వం తరహాలో ఉంటుంది.[5] ఈ పాటలో భావం, తత్వం అందరికీ అర్థమయ్యేలా గొప్పగా ఉంటుంది.

సినిమాలోని కథ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం లోకి వెళ్లినప్పుడు ,అందరి ఆలోచనలూ ఆగిపోయినప్పుడూ మౌనాన్నీ, మనసునూ ముడి పెట్టి ఈ నేపధ్య గీతాన్ని దర్శకుడు బాలచందర్ ఎంచుకుని అద్భుతమైన ప్రక్రియను చూపించాడు. ఆత్రేయ అమూర్త వస్తువుకు మూర్త స్వరూపాన్ని ఇచ్చాడు. ఇది సాహిత్యం, సంగీతం,కథలోకి అల్లుకున్న పాట.[6] సామరాగం ఆధారంగా చేసుకుని ఈ పాటను బాలమురళీకృష్ణ పాడాడు.[7] సినీహెరాల్డ్ అవార్డుల్లో ఈ పాటకు ఉత్తమ గాయకునిగా అతనికి పురస్కారం లభించింది.[8]

పాట[మార్చు]

పాట పల్లవి ఇది:

మౌనమె నీ భాష ఓ మూగ మనసా… ఓ మూగ మనసా…
మౌనమె నీ భాష ఓ మూగ మనసా… [2]
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు..
కల్లలు కాగానె కన్నీరవుతావు..
మౌనమె నీ భాష ఓ మూగ మనసా… ఓ మూగ మనసా…

మూలాలు[మార్చు]

  1. Pratap (2014-12-24). "బాలచందర్‌కు నివాళి: తెలుగులోనూ విప్లవకారుడే..." telugu.oneindia.com. Retrieved 2020-12-20.
  2. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-337432[permanent dead link]
  3. ".: Musicologist Raja | Exclusive Telugu Lyrics Website | Telugu Film Songs Reviews :". rajamusicbank.com. Retrieved 2020-12-20.
  4. "తెలుగు పాటల్లో మంచి సాహిత్యం లేదా?". మాలిక పత్రిక (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-12-06. Retrieved 2020-12-20.
  5. "ఎందుకు వలచేవో...ఎందుకు వగచేవో!". Sakshi. 2017-04-02. Retrieved 2020-12-20.
  6. "మౌనమె నీ భాష…". శ్రీ-పదములు. 2010-07-25. Retrieved 2020-12-20.
  7. "లాక్‌డౌన్‌లో హాయి కలిగించే సంగీతం". Telugu News International - TNILIVE (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-01. Retrieved 2020-12-20.[permanent dead link]
  8. Unknown (2016-07-08). "Rajamusicbank: బాలమురళి గారితో నా పరిచయం అదృష్టానికి పరాకాష్ట". Rajamusicbank. Retrieved 2020-12-20.

బాహ్య లంకెలు[మార్చు]