Jump to content

తొలికోడి కూసింది

వికీపీడియా నుండి

తొలికోడి కూసింది , తెలుగు డ్రామా చిత్రం.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లో శరత్ బాబు, సీమ, సరిత,మాధవి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎం ఎస్ విశ్వనాధన్ సంగీతం సమకూర్చారు.

తొలికోడి కూసింది
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
తారాగణం శరత్‌బాబు ,
సీమ,
సరిత
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ రంజిత్ ఆర్ట్స్
భాష తెలుగు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా రాంపండు దొర ఏలుబడి నుండి విముక్తి పొందని ఒకానొక గ్రామంలో అనాథ అయిన దేవుడమ్మ మంచి మనసు, దిటవు ఉన్న యువతి. ఈమె, రజక యువతి జాబిల్లి, గుడ్డి పిల్ల ముగ్గురూ స్నేహితులు. అదే ఊళ్లో మగువనైనా, మందునైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకునే తండ్రీ కొడుకులు, చదువు, సంస్కారం, సాహసం ఉన్న పూజారి కొడుకూ ఉంటారు. పూజారి కొడుకు జాబిల్లిని ప్రేమిస్తాడు. దేవుడమ్మ జాబిల్లికి, పూజారి కొడుకుకూ దగ్గర ఉండి వివాహం జరిపిస్తుంది. గుడ్డి పిల్లను ఫిఫ్టీ ఫిఫ్టీ తండ్రీ కొడుకులు అత్యాచారం చేస్తారు. రాంపండు దొర ఎన్నికల్లో తనకు అడ్డం వచ్చిన పూజారి కొడుకును అంతమొందిస్తాడు. ఇలాంటి నరరూప రాక్షసులను దేవుడమ్మ ఎలా తుదముట్టించింది అనేది పతాక సన్నివేశం[1].

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు ఆత్రేయ సాహిత్యాన్ని అందించగా, ఎం.ఎస్.విశ్వనాథన్ బాణీలు కట్టారు.

  1. అందమైన లోకమని రంగురంగులుంటాయని - ఎస్.జానకి
  2. పోలీసు ఎంకటసామి నీకు పూజారయ్యాడే ప్రేమ పూజారయ్యడే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. ఎప్పుడో ఏదో చూచి ఇప్పుడా ఇదే తలచి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  4. కుదిరిందా రోగం నాయాలా జరిగిందా న్యాయం - ఎస్.జానకి
  5. ఒలమ్మీ ఓ మడివేలమ్మీ నీ మొకమిలా మిలా మిలా మెరిసింది - ఎల్.ఆర్.ఈశ్వరి

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వి. ఆర్. (16 February 1981). "చిత్రసమీక్ష : తొలి కోడి కూసింది". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 312. Retrieved 4 February 2018.[permanent dead link]

బయటిలింకులు

[మార్చు]