శరత్ బాబు

వికీపీడియా నుండి
(శరత్‌బాబు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శరత్ బాబు(sharath babu)
Guppedumanasu.jpg
శరత్ బాబు
జననం సత్యనారాయణ దీక్షిత్
(1951-07-31) 1951 జూలై 31 (వయస్సు: 67  సంవత్సరాలు)
ఆమదాలవలస, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లు సత్యం బాబు దీక్షిత్
వృత్తి నటుడు
క్రియాశీలక సంవత్సరాలు 1973–ప్రస్తుతం
జీవిత భాగస్వామి రమాప్రభ (-1988)

శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు.[1] ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్‌, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.

హీరోగా వీరి తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం, తర్వాత కన్నెవయసులో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు.

పురస్కారాలు[మార్చు]

వీరు 1981, 1988 మరియు 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి సీతాకోక చిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించాయి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద, వీరి వివాహం పద్నాలుగేళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో తెలుగు సినిమా.కాంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళిచేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అని చెప్పింది.[2]

నటించిన తెలుగు సినిమాల జాబితా[మార్చు]

 1. కన్నెవయసు (1973)
 2. రామరాజ్యం (1973)
 3. నోము (1974)
 4. అభిమానవతి (1975)
 5. అమెరికా అమ్మాయి (1976)
 6. బంగారు మనిషి (1976)
 7. మంచికి మరోపేరు (1976)
 8. వింత ఇల్లు సంత గోల (1976)
 9. కన్య - కుమారి (1977)
 10. చిలకమ్మ చెప్పింది (1977)
 11. జీవిత నౌక (1977)
 12. పల్లెసీమ (1977)
 13. పంతులమ్మ (1978)
 14. మరో చరిత్ర (1978)
 15. రామకృష్ణులు (1978)
 16. ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979)
 17. ఇది కథ కాదు (1979)
 18. గుప్పెడు మనసు (1979)
 19. తాయారమ్మ బంగారయ్య (1979)
 20. శృంగార రాముడు (1979)
 21. మూడు ముళ్ళ బంధం (1980)
 22. రచయిత్రి (1980)
 23. 47 రోజులు (1981)
 24. ఇంద్రుడు చంద్రుడు (1981)
 25. తొలికోడి కూసింది (1981)
 26. బాలనాగమ్మ (1981)
 27. రాధా కల్యాణం (1981)
 28. సీతాకోకచిలుక (1981)
 29. ఏకలవ్య (1982)
 30. పెళ్లీడు పిల్లలు (1982)
 31. యమకింకరుడు (1982)
 32. శ్రీలక్ష్మీనిలయం (1982)
 33. అమరజీవి (1983)
 34. గాజు బొమ్మలు (1983)
 35. తోడు నీడ (1983)
 36. పులిదెబ్బ (1983)
 37. సాగర సంగమం (1983)
 38. కాంచన గంగ (1984)
 39. మేమూ మీలాంటి మనుషులమే (1984)
 40. సితార (1984)
 41. స్వాతి (1984)
 42. అనురాగబంధం (1985)
 43. అన్వేషణ (1985)
 44. ఆత్మబలం (1985)
 45. ఉక్కు మనిషి (1985)
 46. ఊరికి సోగ్గాడు (1985)
 47. కర్పూర దీపం (1985)
 48. దర్జా దొంగ (1985)
 49. విష కన్య (1985)
 50. శిక్ష (1985)
 51. స్వాతిముత్యం (1985)
 52. కాష్మోరా (1986)
 53. ఖైదీరాణి (1986)
 54. జీవన పోరాటం (1986)
 55. దాగుడు మూతలు (1986)
 56. నిప్పులాంటి మనిషి (1986)
 57. పసుపుతాడు (1986)
 58. భయం భయం (1986)
 59. భలే భయం (1986)
 60. సంసారం ఓ సంగీతం (1986)
 61. స్రవంతి (1986)
 62. ఉదయం (1987)
 63. కల్యాణ తాంబూలం (1987)
 64. చిన్నారి దేవత (1987)
 65. చైతన్యరథం (1987)
 66. ప్రేమ దీపాలు (1987)
 67. రేపటి స్వరాజ్యం (1987)
 68. విశ్వనాధ నాయకుడు (1987)
 69. సంకీర్తన (1987)
 70. సంసారం ఒక చదరంగం (1987)
 71. ఆగష్టు 15 రాత్రి (1988)
 72. ఆత్మకథ (1988)
 73. ఆణిముత్యం (1988)
 74. ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (1988)
 75. కాంచన సీత (1988)
 76. చిన్ని కృష్ణుడు (1988)
 77. జీవన జ్యోతి (1988)
 78. రక్తాభిషేకం (1988)
 79. సగటు మనిషి (1988)
 80. చెట్టుకింద ప్లీడరు (1989)
 81. నా మొగుడు నాకే సొంతం (1989)
 82. నీరాజనం (1989)
 83. ప్రాణ స్నేహితులు (1989)
 84. యమపాశం (1989)
 85. స్వాతి చినుకులు (1989)
 86. అగ్గిరాముడు (1990)
 87. ఆడపిల్ల (1991)
 88. ఆపద్బాంధవుడు (1992)
 89. మృగతృష్ణ (1992)
 90. వదినగారి గాజులు (1992)
 91. శాంభవి (1993)
 92. శివరాత్రి (1993)
 93. నీకు 16 నాకు 18 (1994)
 94. హలో బ్రదర్ (1994)
 95. సిసింద్రీ (1995)
 96. నేను ప్రేమిస్తున్నాను (1997)
 97. రైతురాజ్యం (1999)
 98. అన్నయ్య (2000)
 99. ఇష్టం (2001)
 100. నువ్వు లేక నేను లేను (2002)
 101. అస్త్రం (2006)
 102. ఏవండోయ్ శ్రీవారు (2006)
 103. ఆట (2007)
 104. చంద్రహాస్ (2007)
 105. సింధూరి (2008)
 106. మగధీర (2009)
 107. నాగవల్లి (2010)
 108. శుభప్రదం (2010)
 109. నేనేం..చిన్నపిల్లనా..? (2013)

మూలాలు[మార్చు]

 • క్వాలిటీ నా బాట...మంచి కోసం నా వేట, శరత్ బాబు ఆంధ్రప్రభ విశేష ప్రచురణ మోహిని (అరవై ఎనిమిది సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానం) 1999లో ప్రచురించిన వ్యాసం.
"https://te.wikipedia.org/w/index.php?title=శరత్_బాబు&oldid=2355990" నుండి వెలికితీశారు