ప్రాణ స్నేహితులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాణ స్నేహితులు
(1988 తెలుగు సినిమా)
Prana Snehithulu.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం కృష్ణంరాజు,
శరత్ బాబు,
రాధ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ గోపీకృష్ణ కంబైన్స్
భాష తెలుగు

ఇది 1988లో విడుదలైన తెలుగు చిత్రం. రాకేశ్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన తొళిచిత్రం 'ఖుద్ గర్జ్' కు తెలుగు రూపం ఈ చిత్రం. హిందీలో శతృఘన్ సిన్హా, జితేందర్, గోవిందా పాత్రలు కృష్ణం రాజు, శరత్ బాబు, సురేష్ లు పోషించారు. ఇదే కథను తమిళంలో అన్నామలై పేరుతో రజనీకాంత్, శరత్ బాబు లతో నిర్మించారు. అదే చిత్రం మళ్ళీ తెలుగు లోకి అనువాదం చేయబడింది.

చిత్రకథ[మార్చు]

కృష్ణంరాజు, శరత్ బాబు చిన్నప్పటినుండి స్నేహితులు. శరత్ బాబు తండ్రి (బాలయ్య) పెద్ద వ్యాపారస్తుడు. కృష్ణంరాజు పేదవాడు . అతని ఇంటి స్థలం మీద బాలయ్య కన్ను పడుతుంది. మోసంతో ఆ ఇంటి స్థలాన్ని కాజేస్తాడు. మోసపోయినట్లు తెలుసుకున్న కృష్ణంరాజుకి ఆ పని శరత్ బాబు చేయించాడని అనుకునేటట్లు బాలయ్య బృందం వ్యూహం చేస్తారు. స్నేహితుల మధ్య అపార్ధాలు పెరుగుతాయి. ఏదో ఒకనాటికి హోటలు పరిశ్రమలో శరత్ బాబును మించుతానని కృష్ణంరాజు శఫదం చేస్తాడు. కొంత కాలం గడిచేసరికి కృష్ణంరాజు బాగా ధనం సంపాదిస్తాడు . శరత్ బాబు కోడుకు (సురేష్) కృష్ణంరాజు కూతురు (రాధ) ప్రేమించుకుంటారు. కృష్ణంరాజుకు తన పెరుగుదలకు శరత్ బాబు కారణం అని తెలుసుకుంటాడు.