పన్నీరు పుష్పాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పన్నీరు పుష్పాలు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఆర్.రవిశంకర్
నిర్మాణం ఎం.నరసింహారావు,
కె.నాగేశ్వరరావు
తారాగణం ప్రతాప్ పోతన్
శరత్ బాబు
రాధిక
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ రాశి మూవీస్
విడుదల తేదీ జూలై 23, 1982 (1982-07-23)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పన్నీరు పుష్పాలు 1982 లో బి.ఆర్.రవిశంకర్ దర్శకత్వంలో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఇందులో ప్రతాప్ పోతన్, రాధిక ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది 1982లోనే విడుదలైన ఈర విళి కావ్యంగల్ అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్.

ప్రకాష్ పల్లెటూరి వాడు. లోకంపోకడ తెలియని అమాయకుడు. గిటార్ విద్వాంసుడు. అవకాశాల కోసం, ప్రతిభ ప్రదర్శించడానికి పట్నం చేరుకుంటాడు. కానీ పట్నంలో అడుగడుగునా మోసాలు అతడిని ఇబ్బందుల పాలు చేస్తాయి. రాధ అనే అమ్మాయితో ప్రకాష్‌కు పరిచయం ఏర్పడుతుంది. రాధ ప్రకాష్‌లోని అమాయకత్వాన్ని ఇష్టపడి అతనిపై సానుభూతిని ప్రదర్శిస్తూ అతడిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రకాష్‌కు రాధ పట్ల ఇష్టం ఏర్పడి, అది ప్రేమగా పరిణమిస్తుంది. అయితే అతడు తన ప్రేమను ఆమె ముందు వ్యక్తం చేయడానికి ధైర్యం చేయలేక సతమతమవుతుంటాడు. రాధ సైన్యంలో పనిచేసే గోపాల్‌ను ప్రేమిస్తూ ఉంటుంది. ప్రకాష్, గోపాల్ లలో ఎవరి ప్రేమ ఫలిస్తుంది? రాధ ఎవరిని వరిస్తుంది? అనేది కథ చివరలో తెలుస్తుంది[1].

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: బి.ఆర్.రవిశంకర్
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: అశోక్ కుమార్
  • నిర్మాతలు: ఎం.నరసింహారావు, కె.నాగేశ్వరరావు

మూలాలు

[మార్చు]
  1. లక్కరాజు (6 August 1982). "చిత్రసమీక్ష: పన్నీరు పుష్పాలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 31 December 2020.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]