Jump to content

లక్ష్మీ బాంబ్

వికీపీడియా నుండి
లక్ష్మీ బాంబ్
లక్ష్మీ బాంబ్ సినిమా పోస్టర్
దర్శకత్వంకార్తికేయ గోపాలకృష్ణ
నిర్మాతగున్నపాటి సురేష్ రెడ్డి
తారాగణంమంచు లక్ష్మి
ఛాయాగ్రహణంజోషి
సంగీతంసునీల్ కష్యప్
నిర్మాణ
సంస్థ
ఉద్బవ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
10 మార్చి 2017 (2017-03-10)
సినిమా నిడివి
122 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

లక్ష్మీ బాంబ్, 2017 మార్చి 10న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా. ఉద్బవ్ ప్రొడక్షన్స్ బ్యానరులో గున్నపాటి సురేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. ఇందులో మంచు లక్ష్మి, పోసాని కృష్ణ మురళి, ప్రభాకర్ గౌడ్ నటించగా, సునీల్ కష్యప్ సంగీతం అందించాడు.[1]

కథా నేపథ్యం

[మార్చు]

లక్ష్మి నిజాయితీ గల సెషన్స్ కోర్టు న్యాయమూర్తి. మానవ అక్రమ రవాణా కార్టెల్‌పై ఆమె ఇచ్చిన తీర్పు కారణంగా గూండాలచే హత్య చేయబడుతుంది. తనను హత్య చేసిన వారిపై లక్ష్మి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందన్నది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా యునైటెడ్ స్టేట్స్ లో చిత్రీకరించబడింది.[2]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకి సునీల్ కష్యప్ సంగీతం అందించాడు. 2017, జనవరి 17న పాటల విడుదల కార్యక్రమం జరిగింది.[3][4][5]

పాట పేరు గాయకులు గీత రచయిత
"చిన్ని తల్లి చిన్ని తల్లి" సునీల్ కశ్యప్ కరుణాకర్
"రంగు రంగు పూలలోనా" అశ్వని కరుణాకర్
"తరుము తరుము" హేమచంద్ర అనంత శ్రీరామ్
"అగ్గై వస్తా నిన్నే బుగ్గెచేస్త" మనీషా, అశ్వని కాసర్ల శ్యామ్‌
"లక్ష్మీ బాంబ్" (టైటిల్ ట్రాక్) మనీషా శ్రీరామ్

విడుదల

[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాకి 1/5 రేటింగ్ ఇచ్చింది.[6] 123 తెలుగు "రెండవ భాగంలో కథ సరిగా కుదరలేదు" అని రాసింది. [7]

మూలాలు

[మార్చు]
  1. Joseph, Deepu (2021-03-11). "Lakshmi Bomb". timesofindia. Retrieved 2021-03-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Laxmi Manchu's next to be shot in the US - Times of India". The Times of India.
  3. "Lakshmi Bomb all set for its audio launch - Times of India". The Times of India.
  4. "Music Review: Lakshmi Bomb - Times of India". The Times of India.
  5. "Lakshmi Bomb Latest Telugu Movie - Audio Songs Jukebox - Lakshmi Manchu - Sunil Kashyap". Mango Music. 7 October 2016.
  6. "Lakshmi Bomb Review: There are just too many illogical twists and turns in the movie for the audience to make sense of anything". The Times of India.
  7. Lakshmi Bomb Telugu Movie Review. 123telugu.com.