మంచు లక్ష్మి
స్వరూపం
(లక్ష్మి మంచు నుండి దారిమార్పు చెందింది)
మంచు లక్ష్మి | |
|---|---|
గుండెల్లో గోదారి చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో లక్ష్మి | |
మంచు లక్ష్మీప్రసన్న 1977 అక్టోబరు 8 | |
| ఎత్తు | 5"5 |
| Spouse | ఆండీ శ్రీనివాసన్ |
మంచు లక్ష్మి భారతీయ నటి, నిర్మాత. ఈమె నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న .
కుటుంబము
[మార్చు]ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్, మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే.
వివాహము
[మార్చు]ఈమె వివాహము ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ తో జరిగింది. ఈయన అమెరికా వాసి.
పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం ఉత్తమ విలన్ గా అనగనగా ఓ ధీరుడు చిత్రానికి ఎన్నుకోబడింది.
- సైమా అవార్డులు (2011)లో సైమా ఉత్తమ ప్రతినాయకురాలు (అనగనగా ఓ ధీరుడు)
- దొంగాట సినిమా లో ఏందిరో అనే పాటకు గాను గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డు ని అందుకుంది.
- తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్: ఉత్తమ సహాయ నటి (చందమామ కథలు)
- స్పెషల్ జూరి అవార్డ్ దొంగాట
- గుండెల్లో గోదారి సినిమాకు ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు
నటించిన చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | చిత్రము | పాత్ర | భాష | ఇతర వివరాలు |
|---|---|---|---|---|
| 2008 | ద ఒడే | నజ్మా | ఆంగ్లము | |
| 2009 | డెడ్ ఎయిర్ | గబ్బి | ఆంగ్లము | |
| 2011 | అనగనగా ఓ ధీరుడు | ఐరేంది | తెలుగు | 2012 నంది పురస్కారము: ఉత్తమ ప్రతినాయిక |
| 2011 | దొంగల ముఠా | శివ | తెలుగు | |
| 2012 | డిపార్ట్‍మెంట్ | సత్యా భోస్లే | హిందీ | |
| 2012 | ఊ..కొడతారా ఉలిక్కిపడతారా | అమృతవల్లి | తెలుగు | |
| 2013 | కడలి | సెలీనా | తెలుగు,తమిళం | |
| 2013 | గుండెల్లో గోదారి | చిత్ర | తెలుగు, తమిళం | |
| 2015 | బుడుగు | పూజ | తెలుగు | |
| 2017 | లక్ష్మీ బాంబ్ | జడ్జి లక్ష్మి, ప్రియ | తెలుగు | |
| 2018 | W/O రామ్ | దీక్ష | తెలుగు | |
| 2020 | మా వింత గాధ వినుమా | తెలుగు | ||
| 2021 | పిట్ట కథలు | స్వరూపక్క | తెలుగు | |
| 2022 | మాన్‌స్టర్ | దుర్గ / కేథరీన్ అలెగ్జాండ్రా | మలయాళం | తొలి మలయాళ చిత్రం |
| 2024 | ఆదిపర్వం | [2] | ||
| 2025 | దక్ష | సీఐ దక్ష | తెలుగు | [3] |
టెలివిజన్
[మార్చు]నటనా పాత్రలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | భాష | గమనికలు |
|---|---|---|---|---|---|
| 2004–07 | లాస్ వెగాస్ | సరస్వతి కుమార్ | ఎన్‌బిసి | ఇంగ్లీష్ | పునరావృత పాత్ర (11 ఎపిసోడ్లు) |
| 2006 | బోస్టన్ లీగల్ | జ్యూరర్ నెం. 6 | అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ | "షాక్ అండ్ ఓవ్!" (సీజన్ 2: ఎపిసోడ్ 18) | |
| 2008 | మిస్టరీ ER | డాక్టర్ బేకర్ | డిస్కవరీ హెల్త్ | "ఈటింగ్ అవే/ఎ మోడల్స్ మాలాడీ" (సీజన్ 2: ఎపిసోడ్ 5) | |
| డెస్పరేట్ హౌస్‌వైవ్స్ | నబిలా | అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ | " పిల్లలు అందరిలాగా ఉండరు " (సీజన్ 5: ఎపిసోడ్ 3) | ||
| 2019 | మిసెస్ సుబ్బలక్ష్మి | మిసెస్ సుబ్బలక్ష్మి | జీ5 | తెలుగు | |
| 2024 | యక్షిణి | జ్వాలాముఖి | డిస్నీ+ హాట్‌స్టార్ | ||
| 2025 | ది ట్రెటర్స్ ఇండియా | పోటీదారు | అమెజాన్ ప్రైమ్ వీడియో | హిందీ | 18వ స్థానం |
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://www.telugufirst.com/telugu-tv/tv-shows/254-manchu-lakshmi-new-show-at-etv.htm[permanent dead link]
- ↑ Zee News Telugu (19 March 2024). "మంచు లక్ష్మి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆది పర్వం'". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
- ↑ "మంచు వారి యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్.. 'దక్ష'తో రఫ్పాడించిన మోహన్ బాబు, లక్ష్మీ". V6 Velugu. 9 September 2025. Archived from the original on 22 September 2025. Retrieved 22 September 2025.