దొంగల ముఠా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగల ముఠా
(2011 తెలుగు సినిమా)
Ravi Teja's Dongala Mutha poster.jpg
దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
కథ నీలేష్ గిర్కర్
తారాగణం బ్రహ్మాజీ, బ్రహ్మానందం, చార్మీ కౌర్, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్
నిర్మాణ సంస్థ శ్రేయ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 18 మార్చి 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దొంగల ముఠా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో రవితేజ, చార్మ్ కౌర్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి నటించారు. కేవలం 7 గురు సిబ్బందితో, ఐదే రోజుల సమయంలో చిత్రీకరించారు. చిత్రీకరణకు ముందు, ఈ చిత్రానికి బడ్జెట్ లేదని, ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే వరకు తారాగణం, సిబ్బంది వేతనం తీసుకోరనీ దర్శకుడు వర్మ ప్రకటించాడు.

పూరి జగన్నాధ్ సహ దర్శకుడు కాగా, దర్శకుడు హరీష్ శంకర్ (మిరపకాయ ఫేమ్) అసోసియేట్ డైరెక్టరు.[1] సంగీతాన్ని సత్యం సమకూర్చగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అమర్ మొహిలే (సర్కార్ రాజ్ ఫేం) అందించాడు.

2011 మార్చి 18 న, షూటింగ్ ముగిసిన సరిగ్గా 33 రోజుల తరువాత, దొంగల ముతా విడుదలైంది. కెనాన్ 5 డి కెమెరాలతో తీసిన ఈ చిత్ర నిర్మాణ ప్రక్రియ విప్లవాత్మకంగా మారింది.[2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.[3]

అటుపై ఈ చిత్రాన్ని అపరాధి కౌన్? పేరుతో హిందీ లోకి డబ్ చేసారు. గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్, 2018 జూలై 31 న యూట్యూబ్‌లో విడుదల చేసింది.

కథ[మార్చు]

సుధీర్ (రవితేజ), రాణి (చార్మ్ కౌర్) ల జంట తమ స్నేహితుడి పెళ్ళి కోసం ఎడారి రహదారిపై కారులో ప్రయాణిస్తుంటారు. వారు వేదిక చేరుకోవడానికి ఒక అడ్డుదారిలో వెళ్తారు. దారిలో వారి కారు చెడిపోతుంది. ఓ పాత, శిథిలమైన, రిసార్ట్‌లోకి చేరుకుంటారు. రిసెప్షనిస్టు నని చెప్పుకునే విచిత్రమైన వ్యక్తిని (సుబ్బరాజు) కలుస్తారు. రూములు ఖాళీ లేవని అతడు వారికి చెప్తాడు. మేనేజరునని చెప్పుకునే వ్యక్తి (సుప్రీత్) వచ్చి, ఒకే గది ఖాళీగా ఉందని చెప్పి, వారికి 8 వ నంబరు గది ఇస్తాడు. అ గదిని చాలా రోజులుగా శుభ్రం చేయలేదని సుధీర్, రాణి గ్రహిస్తారు. వారు భోజనానికి ఆర్డర్ చేసినప్పుడు, రిసార్ట్ సిబ్బంది మెనూ తెస్తారు కాని, అందుబాటులో ఏమీ లేవని చెబుతారు. సుధీర్ సిబ్బందిపై కేకలు వేస్తాడు. అతను తన కారును తీసుకొని సమీప గ్రామానికి వెళ్తే అక్కడ అతనికి మెకానిక్ దొరుకుతాడని, కాని అతను తన భార్యను తనతో తీసుకెళ్లకూడదనీ వారు అతడికి చెప్తారు. సుధీర్ చిరాకుపడి వళ్లను బయటకు గెంటేస్తాడు. ఇద్దరూ పక్క గది నుండి విచిత్రమైన శబ్దాలు వింటారు. కానీ ఆ గదికి తాళం వేసి ఉండడం వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. తాను, రాణి ఊబిలాంటి పరిస్థితిలో కూరుకుపోతున్నామని సుధీర్ నెమ్మదిగా తెలుసుకుంటాడు.

పొరుగు గది నుండి వచ్చే శబ్దం గురించి అడిగినపుడు అది ఒక దెయ్యం అని రిసెప్షనిస్టు చెబుతాడు. మేనేజరు అది దెయ్యం కాదు, దొంగ అని చెబుతాడు. వారి హావభావాలకు భయపడి, సుధీర్, రాణి రిసార్ట్ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తారు. కాని మేనేజరు, రిసెప్షనిస్టు, సేవకుడు (బ్రహ్మజీ) వారిని బందీలుగా చేస్తారు. రాణిని 9 వ గదిలో ఉంచుతారు -దెయ్యం ఉన్న గది అదే. అయితే, సుధీర్, రాణి వారి నుండి తప్పించుకోగలుగుతారు గానీ, ఆ భవనంలోనే చిక్కుకు పోతారు. రిసార్టు‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాస్తవానికి డాన్ మున్నా భాయ్ కోసం పనిచేసే కిడ్నాపర్లు. వారు ఒక వ్యాపారవేత్త నారాయణ మూర్తి (బ్రహ్మానందం) ని కిడ్నాప్ చేసి 9 వ గదిలో బంధించారు. కిడ్నాప్‌ను పరిష్కరించడానికీ మున్నా అరెస్టయ్యాడనే అబద్ధపు సందేశాన్ని తెలియజేయడానికి పోలీసులు శివ (లక్ష్మి మంచు), రిచర్డ్ (సునీల్) రిసార్టు వద్దకు చేరుకుంటారు. సుధీర్, రాణి, నారాయణమూర్తి ఇప్పుడు పరారీలో ఉన్నందున ఇప్పుడు దాగుడుమూతల ఆట మొదలౌతుంది. చివరగా, ముఠాను అరెస్టు చేయడానికి ఒక పోలీసు (ప్రకాష్ రాజ్) వస్తాడు, తరువాత అతడు తానే మున్నా అని వెల్లడిస్తాడు.

నటీనటులు[మార్చు]

నిర్మాణం[మార్చు]

సాధారణంగా ఒక సినిమా షూటింగు చేయడానికి 2-6 నెలల సమయం పడుతుంది. 150 నుండి 200 మందికి పైగా సిబ్బంది దీనిపై పని చేస్తారు. అయితే, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఈ 2 గంటల నిడివి గల చలన చిత్రం షూటింగు కేవలం 5 రోజుల్లో పూర్తయింది, రామ్ గోపాల్ వర్మతో సహా కేవలం 5 గురు సిబ్బంది మాత్రమే పనిచేసారు. ఈ చిత్రంలో ఎవరికీ డబ్బు చెల్లించలేదు. ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి ఉత్సాహంగా ఉన్న నటులు, సాంకేతిక నిపుణులతో మాత్రమే ఇది రూపొందింది. ఈ సినిమా కోసం పనిచేస్తున్న వారందరికీ విడుదలైన తర్వాత, ఈ చిత్రం లాభాలను ఆర్జిస్తే మాత్రమే చెల్లిస్తారు. ఈ చెల్లింపు మొత్తాలు ఒక్కొక్కరూ సినిమాకు చేకూర్చిన విలువకు అనుగుణంగా ఉంటాయి.

సాంప్రదాయ చలన చిత్ర కెమెరాలకు విరుద్ధంగా కెనాన్ కెమెరాలను ఉపయోగించాలనే వినూత్న సవాలును మొదట సాంకేతికంగా నిరూపించారు. ఈ కెమెరాలకు అదనపు లైటింగు అవసరం లేదు. షూటింగ్ ప్రారంభమయ్యే ముందే కొన్ని సన్నివేశాలు తీసి, ప్రింటు వేసి పరీక్షించారు. అది చక్కగా ఉండడంతో పని మొదలుపెట్టారు. చిత్రీకరణ 2011 ఫిబ్రవరి 9 న ప్రారంభమైంది [4] దొంగల ముఠా మొత్తం షూటింగు షెడ్యూలు కంటే ముందే పూర్తయింది. మొత్తం చిత్రం 5 కెనాన్ కెమెరాలతో చిత్రీకరించారు. ప్రతి షాట్‌ను ఒకేసారి 5 వేర్వేరు కోణాల్లో బంధించారు. జిబ్స్, ట్రాలీలు మొదలైన వాటితో సహా ఎలాంటి లైట్లనూ పరికరాలనూ ఉపయోగించలేదు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు లేదు. కెమెరా ఆపరేటర్లందరూ ఎవరి మార్గనిర్దేశమూ లేకుండా కోణాలు కూర్పులను తమకు తామే ఎంచుకున్నారు.

ఈ కెమెరాలలో ఒక్కొక్కటీ సుమారు రూ. 1.5 లక్షలు ఖర్చవుతుంది. అనుకున్న ఐదు రోజుల కంటే ముందే, నాలుగున్నర రోజులలోనే చితీకరణ పూర్తైంది. మార్చి 18 న విడుదలైంది. చివరగా, రామ్ గోపాల్ వర్మ ప్రోమో ప్రారంభం సందర్భంగా జరిగిన ఒక విలేకరుల సమావేశంలో చిత్రం ఉత్పత్తి వ్యయం 6,50,000 రూపాయలని చెప్పాడు.[5]

ఇతర విశేషాలు[మార్చు]

  1. ఈ చిత్రం కోసం మొత్తం కూర్పు 3 చిన్న గదులలో కూర్చున్న 3 మాక్ కంప్యూటర్లలో షిఫ్ట్ ప్రాతిపదికన ముగ్గురు కూర్పులు పనిచేశారు.
  2. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కలర్ కరెక్షన్స్ వంటి అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏ స్టూడియోకీ వెళ్లకుండా చిన్న గదుల్లో జరిగాయి.

మూలాలు[మార్చు]

  1. Puri Jagannath co-director and Harish Shanker associate director for RGV's Dongala Muta.
  2. Nanisetti, Serish (18 March 2011). "Storyteller's tale". The Hindu. Chennai, India.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-23. Retrieved 2020-08-04.
  4. I am making a film in 5 days with a crew of just 5 people including me: Ram Gopal Varma.
  5. RGV Finally revealed Production Cost of Dongala Muta.