చార్మీ కౌర్
చార్మీ కౌర్ | |
|---|---|
2014 లో చార్మీ | |
| జననం | 1987 మే 17 వాసై, మహారాష్ట్ర |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 2002–2015 (నటి) 2015–ప్రస్తుతం (నిర్మాత) |
చార్మి కౌర్ (జ. 1987 మే 17[1]) ఒక భారతీయ సినీ నటి, నిర్మాత. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది.[2] మాస్ (2004), అనుకోకుండా ఒక రోజు (2005), లక్ష్మీ (2006), రాఖీ (2006), పౌర్ణమి (2006) ఆమెకు పేరు తెచ్చిన సినిమాలు. ఇందులో అనుకోకుండా ఒక రోజు సినిమాలో ఈమెది ప్రధాన పాత్ర కాగా మిగతా వాటిలో సహాయ పాత్రలు. ఈమెకు రెండు నంది పురస్కారాలు లభించాయి.
2007 లో వచ్చిన మంత్ర సినిమాకుగాను ఈమెకు నంది ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తర్వాతి సంవత్సరాల్లో మనోరమ (2009), కావ్యాస్ డైరీ (2009), మంగళ (2011) చిత్రాల్లో నటించింది. మంగళ సినిమాకు గాను నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం అందుకుంది.[3][4] 2011 లో ఈమె అమితాబ్ బచ్చన్ పక్కన బుడ్డా హోగా తేరే బాప్ అనే హిందీ సినిమాలో నటించింది.[5][6][7]
కెరీర్
[మార్చు]చార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఒక రోజూ ఆమె స్వస్థలం ముంబాయిలో కాకతాళీయంగా చార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీతోడు కావాలి తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేసాడు. అది 2001, అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది.
తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ చార్మికి వెంటనే కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించటంతో ఆమె తెలుగు దర్శకుడు కృష్ణ వంశీ దృష్టిలో పడింది. కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ చార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది.
2007 డిసెంబరులో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో చార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో చార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఛార్మి నటించిన సినిమాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Charmy turns 18 Maneckji Cooper Education Trust School, Mumbai". Archived from the original on 24 September 2018. Retrieved 12 November 2006.
- ↑ "Many filmy twists and salvation, finally". The Hindu. 8 August 2015. Archived from the original on 23 March 2020. Retrieved 25 December 2015.
- ↑ "CCL Telugu Warriors Brand Ambassadors 2016". CCL 2016. Archived from the original on 26 August 2018. Retrieved 25 December 2015.
- ↑ "Charmy is not just a run-of-the-mill actress; here's why she's a hero in Tollywood". Folomojo. Archived from the original on 4 March 2016. Retrieved 25 December 2015.
- ↑ "Charmi impressed by a Hollywood Star". tollywoodshow.com. Archived from the original on 11 June 2017. Retrieved 5 November 2015.
- ↑ Y. Sunita Chowdhury (9 April 2014). "For the election season". The Hindu. Archived from the original on 19 April 2014. Retrieved 18 April 2014.
- ↑ "Charmme Kaur moves court in drug case | the Indian Express". 24 July 2017. Archived from the original on 26 July 2017. Retrieved 24 July 2017.