Jump to content

ఎన్‌కౌంటర్

వికీపీడియా నుండి
ఎన్‌కౌంటర్
(1997 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎన్.శంకర్
తారాగణం కృష్ణ,
రోజా
నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
భాష తెలుగు

ఎన్‌కౌంటర్ 1997లో విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఘట్టమనేని హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శంకర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రమేష్ బాబు, వినోద్ కుమార్, రోజా, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

భారత స్వాంతంత్ర్య కోసం పోరాడి అమరులైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి మహామహులని దేశ స్వాతంత్ర్యానంతరం అమరవీరులుగా ఎలా కీర్తిస్తున్నామో అదే విధంగా ఈ రోజున పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని దళితులని, బలహీన వర్గాలని నానా అగచాట్లకు గురిచేస్తున్న ఈ నల్ల దొరల నుండి విముక్తి కోసం అసువులు బాసిన ఉగ్రవాదులు కూడా రేపు సమసమాజ స్థాపన జరిగితే వారినీ అమరవీరులుగానే కీర్తిస్తారన్న సిద్ధాంతాని ప్రతిపాదించిన చిత్రం ఇది.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, దర్శకుడు: ఎన్.శంకర్
  • నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
  • విడుదల తేదీ: 1997 ఆగస్టు 14
  • మాటలు: ఎం.వి.ఎస్.హరనాథరావు
  • పాటలు: భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, గుండవర్పు సుబ్బారావు, ఎన్.శంకర్, గోరటి వెంకన్న
  • ఛాయాగ్రహణం: హరి అనుమోలు
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్


పాటల జాబితా

[మార్చు]

1.వెనకొచ్చే ఆవుల్లారా ఎర్ర ఆవుల్లారాశ్రీరామ రామ , రచన: ఎన్.శంకర్, గానం.స్వర్ణలత బృందం

2.ఎన్ కౌంటర్ ఎన్ కౌంటర్ బూటకపు, రచన: జి.సుబ్బారావు, గానం.శ్రీపతి బాలసుబ్రహ్మణ్యం బృందం

3.ఓ వూరివాడ అక్కల్లారా ఉత్తరమొచ్చిందోయీ , రచన:సుద్దాల అశోక్ తేజ, గానం.కె.ఎస్.చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

4.గంపలో చేమంతి పువ్వు చెంపకెట్టా వచ్చిందే , రచన: భువనచంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

5.జై బోలో జై బోలో అమరవీరులకు , రచన: గోరేటి వెంకన్న, గానం.వందేమాతరం శ్రీనివాస్ బృందం

6.పల్లె తెల్లవారు తున్నదా పల్లెబతుకు,రచన: సుద్దాలఅశోక్ తేజ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కోరస్

7.యుద్ధం యుద్ధం యుద్ధం చేద్దామురా, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం.

మూలాలు

[మార్చు]
  1. "Encounter (1997)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-20.

3.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]