తీజన్ బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తీజన్ బాయి
జననం (1956-04-24) 1956 ఏప్రిల్ 24 (వయసు 68)
గనియారి గ్రామం. చత్తీస్ ఘఢ్
ఇతర పేర్లుతీజన్ బాయి
వృత్తిపాండవాని ఫోక్ సింగర్
భార్య / భర్తతుక్కా రామ్
తండ్రిచునుక్ లాల్ పార్థి
తల్లిసుఖ్‌వతి
పురస్కారాలుPadma Bhushan 2003
Padma Shri 1988
Sangeet Natak Akademi Award 1995

తీజన్‌ బాయి (జ. 1956, ఏప్రిల్ 24) ప్రముఖ ఫోక్ సింగర్. ఈమె పాండవానిలో ప్రసిద్ధురాలు. ఈ గానం చత్తీస్ గఢ్ లో ప్రముఖమైనది. ఈమె మహాభారత ఘట్టాలను తన పాట ద్వారా వినిపిస్తుంటారు.

బాల్యవిశేషాలు

[మార్చు]

తీజన్ బాయి ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ కి 14 కి.మీ దూరంలో ఉన్న గనియారి గ్రామంలో 1956, ఏప్రిల్ 24 న జన్మించారు. ఆమె సుఖ్‌వతి, చునుక్ లాల్ పార్థి ల కుమార్తె. ఈమె ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో షెడ్యూల్ తెగ అయిన "పార్థి" కులానికి చెందినవారు. బాల్యంలో ఈమె తాత గారైన బ్రిజ్‌లాల్ పార్థి ఛత్తీస్ గఢ్ హిందీ భాషలో సబల్ సింగ్ చే వ్రాయబడిన మహాభారత కథలను వల్లెవేయించెవారు. ఆమె ఆ కథల పట్ల అధిక ఉత్సుకత కనబరచి వాటిని అలవోకగా తిరిగి చెప్పేవారు. తర్వాత ఉమెద్ సింగ్ దేష్‌ముఖ్ వద్ద శిక్షణ పొందారు.

జీవిత విశేషాలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

ఏకబిగిన ఆదిపర్వం మొదలుకొని మొత్తం పద్దెనిమిది పర్వాలు పాడగలిగిన అద్భుత అధ్యయనం అది. ఎలా సాధ్యం అనడిగితే ఆ కథ మీది అ రమైన ప్రేమ అని సమాధానం. ఈ కళ ఆ పాండవ కథ ఎలా ఇన్నేళ్లుగా సాగుతూ వస్తున్నాయని అడిగితే ఆమె వివరించే ప్రవాహం ఏ కథ ఫ్లాట్‌, స్ట్రక్చర్‌కై నా దీటుగా ఉంటుంది. పాండవుల కథని పుక్కిట పట్టాక, తన జీవితాన్ని వినిపించడం ఒక పనా అంటుంది ఆమె. అక్షర విద్వత్తుకి ఆవలివైపు, చేతిమీద పచ్చబొట్టుగా పొడిపించుకున్న తన అయిదు అక్షరాల పేరును రాయడానికి పది నిమిషాలు తీసుకుంటానని కించిత్తు అభిమా నంగా చెప్పే తీజన్‌బాయి- పద్మశ్రీ, పద్మభూషణ్‌, డి.లిట్‌, మూడు డాక్టరేట్‌లు పోటీపడి వరించాయి. ఆమె పారిస్‌ ఫెస్టివల్‌- సంగీత నాటక అకా డమీ అవార్డు- వీటితోపాటుగా మరిన్ని రివార్డులు అందుకున్నారు.

ఆమె జీవితపు ప్రతి కోణం ఒక పాఠం నేర్పే రీతిలో ఉంటుంది. ఒక ఆదివాసీ సమాజపు నేపథ్యం నుండి దేశ అత్యున్నత పురస్కారాలకు ఎదగడం మధ్య జరిగిన జీవిత అనుభవాలు ఎలాంటివో అవి తెలిస్తే నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పురుషులు చెప్పే పండ్వానీ కథని పోట్లాడి మరీ పాడిన మొదటి మహిళ ఘనత తీజన్‌బాయిది. ఇది సాహిత్యంలో గుర్తింపు పొందగలగాలి. ఆ కథ, దాని ఔన్నత్యం, ఆ కథనరీతి, శైలి... అది భారతీయ కథనరీతులను ప్రభావం చేసిన తీరు సవిస్తార పాఠ్యాంశంగా ఉండగలగాలి. పాడేవాళ్ళు పాడుకుని సంతోషిస్తే, చదువరులు దాన్ని చదువుకుని తమ తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.ఎరుపు, నలుపు రంగులు కలిసిన తన ప్రాంతపు కట్టుబొట్టతోకఢా, కాక్‌నీ, బిందీ లాంటి నగలతో తన (ఆహార్యాన్ని) దుస్తులని తానే ఎంచుకున్నానని చెబుతారామె. అన్నీకలిసి ఎనిమిది కిలోల బరువుంటాయట. మోస్తూ కథ చెప్పడం కష్టం కదా అంటే చెప్పేది భీముడు, సుయోధనుడు, ద్రౌపదిల గురించి కదా అని చమత్కరించింది. భీముడు ఆవిడకి ఇష్టుడు. కల్లాకపటం లేనివాడు కాబట్టి. ఒక్క భారతమే ఎందుకు రామాయణం కూడా చెప్పవచ్చు కదా అంటే భారతంతో మనసు అంటారు.

అలా హృదయపు లోతుల్లో నుండి రాలేని కళ జనంలోనికెళ్ళలేదు, వాళ్ళ మనసులని తాకలేదు అని ఆమె భావన.అలా జనాల్లోకి వెళ్ళిన తన కళని ఇప్పటికి రెండు వందలపైగా ఔత్సాహికులకి ఆమె నేర్పారు. వాళ్ళలో ఉపాబాలా, మీనా సాహు, రీతూ వర్మ, సీమాఘోష్‌ లాంటి విద్యార్థులని గుర్తుచేసుకుంటారు తీజన్‌బాయి. తన దగ్గరకొచ్చి తర్ఫీదయే విద్యార్థులు కాకుండా తన గాన రీతిని సొంతం చేసుకొని పాడేవాళ్ళని ఆమె ఆక్షేపించరు. మీ సలహాలేకుండా మీ శైలిలో పాడుతున్నారు కదా అంటే విశ్వవ్యాప్త కళ ఇది. పరిధులు, సీమలు ఎందుకంటారు. రామ్‌పూర్‌ విశ్వవిద్యాలయం ఈ కళని పాఠ్యాంశంగా ఇంకా గుర్తించనప్పటికీ, ఈ కళారూపం గానరీతి పద్ధతులపై వర్క్‌షాపులవీ నిర్వహిస్తుంటారని తీజన్‌బాయి సెక్రటరీ చెప్తారు. ఆ పరంగా తన కళని ఆగకుండా ముందుకు తీసుకెళ్తున్నారామె. వయసెంతని అడిగితే మనమల పిల్లల్ని ఆడించుకుంటానని జవాబు. ఇన్నేళ్ళ ఎగుడు దిగుడు జీవితం ఒకవైపు, ఎలాంటి ఎగుడుదిగుడుల్లోనైనా మొక్కవోని తన పండ్వాని కథ మరోవైపు. కథని జీవితం చేసుకున్నాక జీవితం తనని బాధించలేదు.

ఆ కళలో ఏకలీనం అవుతుందామె. ఇక తీజన్‌బాయిలో గుర్తించాల్సిన మరో కోణం ఏమిటంటే ఈ సాద్‌గీని భద్రంగా పెట్టుకోవడం కూడా తన కళలో భాగమైంది. దేశ విదేశాలు అఖండ ఖ్యాతి, పేరు ప్రతిష్ఠలు, కొద్దిపాటి డబ్బు, ఆ పరంగా వచ్చే మార్పులు ఇవేవీ కళని తాకనివ్వకుండా తనని తాను సంభాళించుకోవడం కూడా ఒక కళనే. ఒక సెక్రటరీ, అపాయింట్‌మెంట్స్‌ ఆ హంగుల్లో ఉంటూ కూడా అతి సాదాసీదాగా తనని తాను ఉంచుకోవడంలో సఫలీకృతులయ్యారు తీజన్‌బాయి.

సూచికలు

[మార్చు]
  • courtesy with Surya daily news paper - February 1, 2013