ఉయ్యాల జంపాల (2013 సినిమా)
ఉయ్యాల జంపాల (2013 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విరించి వర్మ |
---|---|
తారాగణం | రాజ్ తరుణ్, అవికా గోర్ |
సంగీతం | సన్నీ ఎం. ఆర్ |
నిర్మాణ సంస్థ | అక్కినేని నాగార్జున [1] రామ్మోహన్. పి |
భాష | తెలుగు |
ఉయ్యాల జంపాల 2013 డిసెంబరు 25నలో విడుదలైన చిత్రం. 2013 డిసెంబరు 15 న ఈ చిత్ర సంగీతం విడుదలయ్యింది.[2]
ఈ చిత్రాన్ని కన్నడలో "కృష్ణ-రుక్కు" బెంగాలీలో "పర్బొనా అమి చర్తె తొకె"గా పునఃనిర్మించారు.
కథ
[మార్చు]గోదావరి జిల్లా కూనవరం నేపథ్యంగా సాగే పక్కా గ్రామీణ ప్రేమ కథ ఇది. ఈ చిత్రంలో సూరి, ఉమాదేవి బావ, మరదళ్లు. కోడిపెంట ఎరువు అమ్ముకునే ఓ పల్లెటూరి బుల్లెబ్బాయి... సూరి (రాజ్ తరుణ్). తన మేనమామ కూతురు ఉమ (అవిక) అంటే అతనికి క్షణం పడదు. గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా కనిపించే బావ మరదళ్ల సరసం, చిలిపి తగాదాలు, గిల్లి కజ్జాలు, ఆటపట్టించడం లాంటి తమాషాలు సూరి, ఉమల బాల్యంలో ఓ భాగం. బావామరదళ్లు ఇద్దరూ ఒకర్ని ఒకరు ఉడికించుకోవడానికి వేరే వాళ్లని ప్రేమిస్తారు. వారి జీవితం అలా సాగిపోతుండగా అనుకొని సంఘటన వారిద్దర్ని మరింత దగ్గరికి చేరుస్తుంది. ఉమ ప్రేమించిన వాడు ఆమెని మోసం చేయబోతే తన్ని బుద్ధి చెప్తాడు సూరి. దాంతో సూరిపై తనకున్న ప్రేమని తెలుసుకుంటుంది ఉమ. అంతేకాకుండా సూరిపై తనకు ఉన్న ఇష్టం ప్రేమ అని ఉమకు అర్ధమవుతుంది. కానీ సూరికి తన మరదలిపై తనకున్న ప్రేమ తెలీదు. అయితే ఇరు కుటుంబాల మధ్య ఉన్న తగాదాల కారణంగా ఉమకు సూరి పెళ్ళి సంబంధాన్ని ఖాయం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సూరి ఖాయం చేసిన పెళ్ళి ఉమ చేసుకుంటుందా? లేక సూరికి తన ప్రేమను తెలుపుతుందా? సూరి, ఉమాదేవిల మధ్య ఉన్న సాన్నిహిత్యం పెళ్ళి వరకు దారి తీస్తుందా అనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- సూరిగా రాజ్ తరుణ్
- ఉమా దేవిగా అవికా గోర్
- సునీతగా పునర్ణవి భూపాలం
- మురళిగా కిరీటి దామరాజు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం - విరించి వర్మ
పాటల జాబితా
[మార్చు]సన్నీ ఎం.ఆర్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఉయ్యాలైనా జంపాలైనా, రచన: వాసు వలబోజు, గానం. హర్షిక గుడి, అనుదీప్ దేవ్
లపక్ లపక్ , రచన: వాసు వలబొజు, గానం. బిందు, హర్షికా గుడి, దీపు
నిజంగా ఇది నేనెనా , రచన: రాంబాబు గోసల, గానం. సన్నీ ఎం.ఆర్ , హర్శిక గుడి
మన బందం , రచన: వాసు వలబోజూ, గానం. సన్నీ ఎం ఆర్.
ధెర్ థక్ ఛేలో(హిందీ), రచన: ఆశిష్ పండిట్, గానం. ఆర్జిత్ సింగ్.
పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: తృతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ బాలనటి (ప్రణవి), ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టు ఫిమేల్ (మిత్రా వరుణ మహి)[3][4][5][6]
- సైమా అవార్డులు - 2013: సైమా ఉత్తమ తొలిచిత్ర నటి (అవికా గోర్), సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు (రాజ్ తరుణ్)
మూలాలు
[మార్చు]- ↑ "Nagarjuna producing Uyyala Jampala". timesofindia. 2013-10-28. Archived from the original on 2013-11-08. Retrieved 2013-12-12.
- ↑ "Uyyala Jampala audio to release on Dec 15". timesofindia. 2013-12-10. Retrieved 2013-12-12.[permanent dead link]
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.