దయా కొడవటిగంటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దయా కొడవటిగంటి
Daya Kodavatiganti.jpg
జననంఫిబ్రవరి 4, 1975
అంబర్ పేట, తెలంగాణ, భారతదేశంభారతదేశం
ఇతర పేర్లుకె.వి. దయానంద రెడ్డి
ప్రసిద్ధిసినిమా దర్శకులు
మతంహిందూమతం
భార్య / భర్తభాగ్యలత
పిల్లలుహృదయ్ వికాస్, ప్రశంస

దయా కొడవటిగంటి (కె.వి. దయానంద రెడ్డి) తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. 2013లో వచ్చిన "అలియాస్ జానకి" చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు సినీరంగంలోకి దర్శకులుగా అడుగుపెట్టాడు. 2013 సంవత్సరానికి గానూ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు.[1] [2]

జననం[మార్చు]

దయా 1975, ఫిబ్రవరి 4న డా. అంజిరెడ్డి, భారతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని అంబర్ పేటలో జన్మించాడు. వీరిది మధ్య తరగతి కుటుంబం. దయా తండ్రి రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి. మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు.[3]

విద్యాభ్యాసం[మార్చు]

డిగ్రీ చదివిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ (1995-1996) చేశాడు. హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో ఎం.ఏ. (రంగస్థల కళలు 1998-2000) చదివాడు.

వివాహం[మార్చు]

2004, మే 13న భాగ్యలతతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (హృదయ్ వికాస్), ఒక కూతురు (ప్రశంస).

సినీరంగ ప్రస్థానం[మార్చు]

డిగ్రీ పూర్తికాగానే నటుడిగా రాణించాలని సినీ పరిశ్రమకు వచ్చాడు. పాఠశాల స్థాయినుంచే నాటకాలు వేస్తుండేవాడు. మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో 95-96 బ్యాచ్‌లో చేరి శిక్షణ పొందాడు. అనంతరం తెలుగు విశ్వవిద్యాలయం లో ఎం.ఎ. చదివాడు.[4]

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌లో 10 సంవత్సరాలపైగా పనిచేశాడు. ఖుషి సినిమాకి అప్రెంటీస్‌గా చేరి, పవన్ నటించిన జానీ, గుడుంబా శంకర్, అన్నవరం, పంజా సినిమాలలో నటించాడు. సినిమాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లపై అవగాహనకోసం దర్శకత్వం శాఖ పనిచేశాడు. గుడుంబా శంకర్ సినిమా తర్వాత స్టోరి, స్క్రీన్ ప్లే రాసుకొని డిజిటల్ ఫార్మాట్‌ లో ఎక్స్ పరిమెంటల్‌గా ఓ థ్రిల్లర్ సినిమా చేశాడు.[4]

పవన్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మాతగా, ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో ప్రారంభమైన సత్యాగ్రహి అనే సినిమాకు కథా చర్చలలో పాల్గొన్నాడు. అనంతరం అన్నవరం, జల్సా, కొమురం పులి సినిమాలకు పనిచేశాడు. గాయం-2 సినిమాకు కోడైరెక్టర్‌గా పనిచేశాడు. బసంతి, రౌడీ ఫెలో, ముకుంద, బంగారు పాదం, దడువు మొదలైన సినిమాలలో నటించాడు.[4]

తొలిచిత్ర అవకాశం[మార్చు]

పంజా సినిమా తడువాత మరో ప్రపంచం అనే షార్ట్ ఫిలింలో నటించాడు. ఆ షార్ట్ ఫిలిం బాగా పాపులర్ అయ్యి, దయాకు మంచి గుర్తింపు వచ్చింది. అటుతర్వాత పంజా నిర్మాత నీలిమ తిడుమలశెట్టి ప్రోత్సాహంతో అలియాస్ జానకి కి దర్శతక్వం చేసే అవకాశం లభించింది.

2012, డిసెంబర్ 12 (12-12-12 ) రోజున అధికారికంగా డైరెక్టర్ అయ్యాడు. 2013 జనవరి 1న రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. 2013 ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందించింది.[4]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి. "'ఈగ'కు నందీ వందనం". Retrieved 4 March 2017. Cite news requires |newspaper= (help)
  2. తెలుగు సంచార్. "మొదటి సినిమాకే నంది అవార్డు తీసుకున్న డైరెక్టర్ ఎవరో తెలుసా?". Retrieved 4 March 2017. Cite web requires |website= (help)[permanent dead link]
  3. తెలుగు ఫిల్మీబీట్. "పవన్ కల్యాణ్ నన్ను దర్శకుడిగా చూడాలనుకొన్నారు.. ఆమెకు రుణపడి ఉంటా..." telugu.filmibeat.com. Retrieved 4 March 2017.
  4. 4.0 4.1 4.2 4.3 తెలుగు ఫిల్మీబీట్. "పవన్ కల్యాణ్ నన్ను దర్శకుడిగా చూడాలనుకొన్నాడు.. ఆమెకు డుణపడి ఉంటా..." telugu.filmibeat.com. Retrieved 4 March 2017.